Jasprit Bumrah: బుమ్రా.. మైదానంలో దూకుడుగా బౌలింగ్ చేస్తాడు. పదునైన బంతులు వేస్తాడు.. యార్కర్ల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడు. పైగా అత్యంత వేగంగా బంతులు వేసి ప్రత్యర్థి బ్యాటర్లకు కోలుకోలేని అవకాశం ఇవ్వడు. చూస్తుండగానే వికెట్ నేల కూల్చి అదరగొడతాడు. అందువల్లే అతడిని భారత జట్టు తురుపు ముక్క అని పిలుస్తుంటారు. మిగతా బౌలర్లు విఫలమైనప్పటికీ.. బ్యాటర్లు తల వచ్చినప్పటికీ.. ఏకపక్షంగా మ్యాచ్ లు గెలిపించిన ఘనత బుమ్రా కు దక్కుతుంది. అందువల్లే అతడిని టీమిండియా పాలిట డైనమైట్ అని పిలుస్తుంటారు. బుమ్రా సాధారణంగా ప్రశాంతంగా ఉంటాడు. తనను గెలికితే మాత్రం ఊరుకోడు. పైగా అంతకుమించిన ఆగ్రహాన్ని చూపిస్తుంటాడు. కాకపోతే అది అరుదైన సందర్భాల్లో మాత్రమే. అయితే తొలిసారి బుమ్రా ఆగ్రహంతో పాటు అసహనం కూడా వ్యక్తం చేశాడు.
Also Read: ఫైరింగ్ పూర్తి అయ్యింది..’ఓజీ’ నుండి అభిమానులకు సెన్సేషనల్ అప్డేట్!
సుదీర్ఘ ఫార్మాట్ లో ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ మండలి కొత్త నిబంధన తీసుకొచ్చింది. బౌలర్ ఓవర్ లో 60 సెకండ్ల వ్యవధిలోనే తర్వాతి బంతి వేయాలనే రూల్ తెరపైకి తీసుకువచ్చింది. దీనివల్ల బౌలర్ల మీద అనివార్యంగా ఒత్తిడి పెరుగుతోంది. దీంతో వెంట వెంటనే బంతులు వేయాలంటే బౌలర్లకు కష్టమవుతున్నది. దీంతో వేగంగా బంతులు వేయాల్సి వస్తోంది. ఫలితంగా బౌలర్లు శారీరకంగా అలసిపోతున్నారు. ఇలా వెంట వెంటనే బంతులు వేయాల్సి రావడం వల్ల ఓవర్ త్వరగా ముగించాల్సి వస్తోంది. అంతేకాదు సుదీర్ఘ ఫార్మాట్లో ఇలా బౌలింగ్ వేయడం వల్ల బౌలర్లు అలసటకు గురవుతున్నారు. ఈ నిబంధన పై బుమ్రా స్పందించాడు.. మూడో టెస్టు రెండో రోజు ఆట ముగిసిన తర్వాత అతడు విలేకరుల సమావేశంలో మాట్లాడాడు. ” నా ప్రదర్శన సంతోషాన్ని కలిగిస్తోంది. కాకపోతే అన్ని ఓవర్లు వేయడం వల్ల అలసిపోయాను. అందువల్లే చివర్లో సంబరాలు జరుపుకోలేదు. ఇక్కడి వాతావరణం చాలా వేడిగా అనిపిస్తోంది. కొత్త నిబంధన ప్రకారం 60 సెకండ్లలోనే తర్వాత బంతి వేయాలి. ఒక్కోసారి వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఈ విషయాన్ని అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకోవాలని” బుమ్రా వ్యాఖ్యానించాడు.
వాస్తవానికి 60 సెకండ్ల నిబంధన గతంలో ఉండేది కాదు. దీంతో బౌలర్ల మీద అంతగా ఒత్తిడి ఉండేది కాదు. దీంతో వారు స్వేచ్ఛగా బౌలింగ్ వేసేవారు. కానీ ఇటీవల కాలంలో సుదీర్ఘ ఫార్మాట్ లో ఈ నిబంధనను ఐసీసీ తీసుకురావడం వల్ల ఓవర్లు త్వరగానే పూర్తవుతున్నాయి. కాకపోతే బౌలర్ల మీద ఊహించని స్థాయిలో ఒత్తిడి పెరుగుతోంది. దీంతో బౌలర్లు శారీరక శ్రమకు గురవుతున్నారు. ఫలితంగా వెన్ను, ఇతర సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో బౌలర్ల కెరియర్ త్వరగానే ముగిసిపోయే ప్రమాదం ఏర్పడుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని బుమ్రా ఆ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు కాసులకు మరిగిన ఐసీసీ తలతిక్క నిబంధనలను తీసుకొచ్చి ఆటగాళ్ల ప్రాణాల మీదికి తెస్తోంది. రెండో టెస్టులో బుమ్రా విశ్రాంతి తీసుకోవడానికి కారణం కూడా ఇదేనని తెలుస్తోంది. తొలి టెస్ట్ లో అవిశ్రాంతంగా బౌలింగ్ వేసిన బుమ్రా.. రెండవ టెస్ట్ మ్యాచ్ నాటికి విశ్రాంతి తీసుకున్నాడు.. నాడు ఒక్క మాట కూడా మాట్లాడని బుమ్రా.. మూడో టెస్ట్ రెండో రోజు మాత్రం తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. తన మనసులో గూడు పట్టుకున్న విషయాన్ని వెల్లడించాడు. మరి దీనిపై ఐసీసీ వర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాల్సి ఉంది.