WI vs PAK 3rd ODI: కరేబియన్ దేశంలో ప్రస్తుతం పాకిస్తాన్ పర్యటిస్తోంది.. మూడు టి20ల సిరీస్ ను గెలిచింది.. దీంతో పాకిస్తాన్ ఆట తీరు మారిందని అందరూ అనుకున్నారు. అంతేకాదు అదే ఊపులో 3 వన్డేల సిరీస్లో భాగంగా తొలి వన్డే గెలిచింది. దీంతో పాకిస్తాన్ జట్టు ఆట తీరుపై ఆ దేశ అభిమానులకి కాదు.. క్రికెట్ విశ్లేషకులకు కూడా నమ్మకం ఏర్పడింది. కచ్చితంగా ఆట తీరు మారిందని.. ఇకపై వరుస విజయాలు సాధిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అదంతా పాలపొంగు అని పాకిస్తాన్ ఆటగాళ్లు నిరూపించారు.
Also Read: 22 సంవత్సరాలకే ఇంత విధ్వంసమా.. కంగారు జట్టుకు చుక్కలు చూపించావు కదరా!
3 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి వన్డే లో పాకిస్తాన్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ఆ తర్వాత రెండవ వన్డేలో వెస్టిండీస్ ఐదు వికెట్ల తేడాతో గెలుపును సొంతం చేసుకుంది. నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో విజయం సాధించి.. సిరీస్ సొంతం చేసుకుంటుందని పాకిస్తాన్ అభిమానులు భావించారు. కానీ అందుకు విరుద్ధమైన ఫలితం వచ్చింది. అంతేకాదు పాకిస్తాన్ జట్టు లక్ష్యాన్ని చేదించే క్రమంలో 100 పరుగులు కూడా చేయకుండా కుప్పకూలిపోవడాన్ని ఆ జట్టు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.. మూడో వన్డేలో పాకిస్తాన్ జట్టు బౌలింగ్లో త్వర త్వరగా 6 వికెట్లు పడగొట్టినప్పటికీ.. ఆ తర్వాత ఆతిథ్య జట్టును నిలువరించడంలో విఫలమైంది. ఒకానొక దశలో ఆతిధ్య జట్టు 184/6 వద్ద నిలిచింది.. ఈ దశలో హోప్ శతకం సాధించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 294 పరుగులు చేసింది.


294 రన్ టార్గెట్ చేజ్ చేసేందుకు రంగంలోకి దిగిన పర్యాటక జట్టు ఏ దశలోనూ ఆతిథ్య జట్టుకు పోటీ ఇవ్వలేకపోయింది.. సున్నా పరుగులకే ఓపెనర్లు పెవిలియన్ చేరుకున్నారు. వారిద్దరు మాత్రమే కాదు మిగతా ముగ్గురు బ్యాటర్లు కూడా 0 పరుగులకే అవుట్ అయ్యారు. దీంతో పాకిస్తాన్ తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఇక మిగతా బ్యాటర్లు కూడా ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడంతో.. పాకిస్తాన్ 92 పరుగులకే కుప్పకూలిపోయింది. తద్వారా ఆతిధ్య వెస్టిండీస్ జట్టు 202 పరుగుల భారీ వ్యత్యాసంతో గెలుపును సొంతం చేసుకుంది. వెస్టిండీస్ జట్టులో సీల్స్ ఆరు వికెట్లు సొంతం చేసుకున్నాడు.
