Commonwealth Games 2022: మన తొలి ‘బంగారం’ మీరాబాయి ఛాను.. భారత్ కు మొత్తంగా 3 పథకాలు

Commonwealth Games 2022: ఇంగ్లండ్ లో జరుగుతున్న కామన్ వెల్త్ గేమ్స్ లో భారత్ కు తొలి బంగారం పతకం దక్కింది. మన మీరాభాయి ఛాను ఇండియాకు తొలి గోల్డ్ మెడల్ అందించి భారతీయులను ఉప్పొంగేలా చేసింది. బర్మింగ్ హమ్ వేదికగా జరుగుతున్న ఈ క్రీడల్లో భారత్ సత్తా చాటుతోంది. ముఖ్యంగా వెయిల్ లిఫ్టింగ్ విభాగంలో పతకాల పంట పండిస్తోంది. రెండో రోజు భారత వెయిట్ లిఫ్టర్లు మూడు పతకాలు సాధించడం విశేషం. తొలుత పురుషుల 55 […]

Written By: NARESH, Updated On : July 30, 2022 10:51 pm
Follow us on

Commonwealth Games 2022: ఇంగ్లండ్ లో జరుగుతున్న కామన్ వెల్త్ గేమ్స్ లో భారత్ కు తొలి బంగారం పతకం దక్కింది. మన మీరాభాయి ఛాను ఇండియాకు తొలి గోల్డ్ మెడల్ అందించి భారతీయులను ఉప్పొంగేలా చేసింది. బర్మింగ్ హమ్ వేదికగా జరుగుతున్న ఈ క్రీడల్లో భారత్ సత్తా చాటుతోంది. ముఖ్యంగా వెయిల్ లిఫ్టింగ్ విభాగంలో పతకాల పంట పండిస్తోంది.

రెండో రోజు భారత వెయిట్ లిఫ్టర్లు మూడు పతకాలు సాధించడం విశేషం. తొలుత పురుషుల 55 కేజీల విభాగంలో సంకేత్ సర్గార్ రజత పతకం సాధించగా.. తాజాగా 61 కేజీల పురుషుల విభాగంలో గురురాజ పుజారి కాంస్య పతకం నెగ్గాడు. గురురాజ ఏకంగా 269 కేజీల బరువును ఎత్తి మూడో స్థానంలో నిలవగా.. మలేషియాకు చెందిన అజ్నిల్ బిన్ బిడ్ మహ్మద్ 285 కేజీలు ఎత్తి స్వర్ణం సాధించాడు. పపువా న్యూగినియా అథ్లెట్ కు రజతం దక్కింది.

గురురాజకు కామన్ వెల్త్ క్రీడల్లో ఇది వరుసగా రెండో పతకం కావడం విశేషం. 2018లోనూ గోల్డ్ కోస్ట్ క్రీడల్లో రజతం సాధించాడు. ఇప్పుడు కామన్ వెల్త్ లో కాంస్యం కొట్టి దేశానికి పేరు తీసుకొచ్చాడు.

-భారత్ కు తొలి గోల్డ్ మెడల్ అందించిన మీరాభాయి ఛాను
ఇక ఇప్పటికే ఒలింపిక్స్ లో పతకం సాధించి దేశానికి పేరు తీసుకొచ్చిన మన మీరాభాయి ఛాను కామన్ వెల్త్ క్రీడల్లోనూ సత్తా చాటింది. ఏకంగా భారత్ కు తొలి గోల్డ్ మెడల్ ను అందించింది. వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను మహిళల 49 కేజీల విభాగంలో మొత్తం 201 కేజీల బరువును ఎత్తి స్వర్ణం గెలిచి, ఆ విభాగంలో గేమ్ రికార్డు నెలకొల్పింది.

ఈ మూడు పతకాలు కూడా వెయిట్ లిఫ్టింగ్ విభాగంలోనే భారత్ కు దక్కడం విశేషం. ముగ్గురు వెయిట్ లిఫ్టర్లు బంగారం, రజతం, కాంస్య పతకాలు సాధించి ఒకేరోజు మూడు పతకాలు అందించి భారత ప్రతిష్టను ఇనుమడింపచేశారు.

https://twitter.com/sumitsaurabh/status/1553427797971853312?s=20&t=puhZRrUflrQRnZ48kbOoEA