WCL Season 2 Specialties: వాళ్లంతా గొప్ప గొప్ప క్రికెటర్లు. యుక్త వయసులో ఎన్నో సంచలనాలు సృష్టించారు. మరెన్నో అద్భుతాలు సాధించారు. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న జట్లకు గొప్ప గొప్ప విషయాలు కట్టబెట్టారు. అటువంటి ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. టి20 ఫార్మాట్ పుణ్యమా అని మళ్లీ వారు బ్యాట్ పట్టుకున్నారు. బంతిని అందుకున్నారు. మైదానంలో ఒకప్పటి మాదిరిగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.. లెజెండ్రీ ఆటగాళ్ల ఆట తీరును ఈ తరం ప్రేక్షకులకు కూడా చూపించాలనే ఉద్దేశంతో వరల్డ్ ఛాంపియన్ ఆఫ్ లెజెండ్స్ నిర్వహిస్తున్నారు. గత ఏడాది ఒక సీజన్ పూర్తయింది. ఇప్పుడు ఇంగ్లాండ్ క్రికెట్ వెల్స్ బోర్డు ఆధ్వర్యంలో రెండవ సీజన్ నిర్వహిస్తున్నారు. అయితే ఈ సీజన్లో అన్ని ప్రత్యేకతలే కనిపిస్తున్నాయి.
Also Read: వృత్తినే ఇంటిపేరుగా మార్చుకున్నాడు.. ఫిష్ వెంకట్ మృతికి కారణమిదే…
క్రికెట్లో ఇంగ్లీష్, కంగారు, భారత్, సఫారీలు, పాక్, విండీస్ ఆటగాళ్లకు ప్రత్యేక చరిత్ర ఉంటుంది. వెస్టిండీస్ నుంచి గేల్, పోలార్డ్ కు ప్రత్యేకమైన ఘనత ఉంటుంది. క్రికెట్లో వీరిద్దరూ సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్ని కాదు. బ్యాటింగ్, బౌలింగ్ లో వీరిద్దరూ సరికొత్త ప్రమాణాలను నెలకొల్పారు. వీరి ద్వయం మాత్రమే కాదు బ్రావో కూడా గొప్ప ఆటగాడే. వీరు ముగ్గురు క్రికెట్లో సంచలనాలు సృష్టించారు. ప్రస్తుతం ఈ ముగ్గురు వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ లో విండీస్ జట్టు తరఫున ఆడేందుకు రెడీగా ఉన్నారు.
బంగారు జెర్సీలు
శుక్రవారం నుంచి మొదలైన ఆగస్టు రెండు వరకు జరుగుతుంది. ఇంగ్లాండ్ లోని బర్నింగ్ హామ్, నార్త్ అంప్టన్, లీసెస్టర్, లీడ్స్ మైదానాలలో ఈ మ్యాచ్ లు నిర్వహిస్తారు. ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు ఈ టోర్నీని నిర్వహిస్తున్నది. వెస్టిండీస్ జట్టు కోసం ప్రత్యేకంగా ఐకానిక్ జెర్సీ రూపొందించారు. 18 క్యారెట్ల బంగారంతో ఈ జెర్సీని తయారు చేశారు. వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజాల వారసత్వం, గత స్ఫూర్తికి నిదర్శనంగా ఈ జెర్సీ నిలుస్తుందని.. ఆ జట్టు అభిమానులు పేర్కొంటున్నారు. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. ఈ లీగ్ లో మొత్తం 15 మ్యాచ్లు ఉంటాయి. ప్రతి జట్టు మరొక జట్టుతో ఒక మ్యాచ్ ఆడుతుంది. లీగ్ పూర్తయిన తర్వాత.. నాలుగు జట్లు సెమీ ఫైనల్ చేరుకుంటాయి. ఫైనల్ మ్యాచ్ వచ్చేనెల రెండవ తేదీన జరుగుతుంది. శుక్రవారం ఇంగ్లాండ్ పాకిస్తాన్ మధ్య జరిగిన తొలి మ్యాచ్లో.. పాకిస్తాన్ జట్టు విజయం సాధించింది.
లెజెండ్రీ ఆటగాళ్లు ఆడుతున్న నేపథ్యంలో మైదానాలకు ప్రేక్షకులు భారీగానే వస్తున్నారు. మరోవైపు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఈ టోర్నీని ఘనంగా నిర్వహిస్తోంది. ప్లేయర్లకు ఏ స్థాయిలో ఫీజు ఇస్తున్నారో తెలియడం లేదు. ఫ్యాన్ కోడ్, డ్రీమ్ 11 వంటి సంస్థలు ఈ టోర్నీకి స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నాయి. ఈ సీజన్లో ఈ టోర్నీకి టైటిల్ స్పాన్సర్ గా డుగస్టా ప్రాపర్టీస్ వ్యవహరిస్తోంది. అజయ్ దేవగన్ కో ఓనర్, హర్షిత్ తోమర్ కో ఫౌండర్ గా ఈ టోర్నీకి వ్యవహరిస్తున్నారు. ఐపీఎల్ తరహాలోనే ఈ టోర్నీకి హంగులు సమకూర్చారు.
భారత జట్టు లో యువరాజ్, శిఖర్ ధావన్, హర్భజన్ సింగ్, సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, రాబిన్ ఊతప్ప, అంబటి రాయుడు, స్టువర్ట్ బిన్నీ, వరుణ్ అరోన్, పీయూష్ చావ్లా, అభిమన్యు, వినయ్ కుమార్, మిధున్, సిద్ధార్థ కౌల్, గురు కీరత్ మాన్ ఆడుతున్నారు.