https://oktelugu.com/

Washington Sundar- Anchor Varshini: యాంకర్ వర్షిణితో వాషింగ్టన్ సుందర్ రొమాన్స్.. అందుకే సన్ రైజర్స్ నుంచి ఔట్.. సంచలన లీక్స్

వాషింగ్టన్ సుందర్.. తమిళనాడు క్రికెటర్.. అప్పుడప్పుడు బాగానే ఆడతాడు. పైగా 26 ఏళ్ల యువకుడు..మొదట బెంగళూరు జట్టుకు ఆడేవాడు. తర్వాత కావ్య మారన్ ఇతడిని ఏరికోరి హైదరాబాద్ జట్టుకు తీసుకుంది.

Written By:
  • Rocky
  • , Updated On : May 19, 2023 / 03:37 PM IST

    Washington Sundar- Anchor Varshini

    Follow us on

    Washington Sundar- Anchor Varshini: గంగూలీ, నగ్మా, వీవీయన్ రిచర్డ్స్, నీనా గుప్తా, ఎంఎస్ ధోని, లక్ష్మీ రాయ్, యువరాజ్ సింగ్, దీపికా పదుకొనే.. సినిమా సెలబ్రిటీలు, క్రికెటర్ల సంబంధం ఇప్పటిది కాదు. ఇప్పటితో ముగిసేది కాదు. ఎప్పటినుంచో మనం చూస్తున్నదే. కాకపోతే ఇప్పుడు మీడియా ఫోకస్ పెరిగింది కాబట్టి మనం రోజు చూడాల్సి వస్తుంది. కపిల్ దేవ్ కాలం నుంచి ప్రస్తుత రోహిత్ శర్మ వరకు క్రికెటర్లు, సినిమా తారల మధ్య టన్నులకొద్ది ప్రేమయాణాలు, సంబంధాలు, తాత్కాలిక బంధాలు కామన్. ఇవన్నీ ముదిరిపాకనపడ్డవి కొందరి విషయాల్లో మాత్రమే. మిగతా వారివి ఆ టైంలో ఆలోన్ గా ఉన్నామా.. ఎంజాయ్ చేశామా అనే టైపు.. కానీ ఈ జాబితాలో ఎవరు కూడా తమ కెరియర్ ను నాశనం చేసుకున్న వాళ్లు లేరు. అంతటి దీపికా పదుకొనే యువరాజ్ సింగ్ ఆట చూసేందుకు ఆస్ట్రేలియా వెళ్లినప్పటికీ, అతనితో కలిసి ఎక్కడా కనిపించలేదు. కనీసం తిరగలేదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే.. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ నడుస్తోంది. హైదరాబాద్ ఆడే మ్యాచ్లో తెలుగు యాంకర్ వర్షిణి సౌందర రాజన్ తెగ సందడి చేస్తోంది. అయితే ఆమె చూసేందుకు వెళ్లిన ప్రతిసారీ ఆడిన మ్యాచ్ల్లో హైదరాబాద్ జట్టు ఓడిపోతుందని నెటిజన్లు మండిపడుతున్నారు. కానీ ఎన్నడూ లేనిది ఆమెకు హైదరాబాద్ అంటే అంత ఆసక్తి కలగడానికి కారణం ఉంది.. ఇప్పుడు అదే ఒక క్రికెటర్ ను ఐపీఎల్ టీమ్ నుంచి బయటకు వెళ్ళగొట్టేలా చేసింది.

    పాపం సుందర్

    వాషింగ్టన్ సుందర్.. తమిళనాడు క్రికెటర్.. అప్పుడప్పుడు బాగానే ఆడతాడు. పైగా 26 ఏళ్ల యువకుడు..మొదట బెంగళూరు జట్టుకు ఆడేవాడు. తర్వాత కావ్య మారన్ ఇతడిని ఏరికోరి హైదరాబాద్ జట్టుకు తీసుకుంది. ఇందులో రాణించకపోయినప్పటికీ ఎఫైర్ల విషయంలో మాత్రం ఈ తమిళ తంబి పేరు బాగా వినిపిస్తోంది. ఇతగాడు తమిళ మూలాలు ఉన్న వర్షిణి అనే ఓ యాంకర్ తో చెట్టా పట్టాలు వేసుకుని తిరగడం ప్రారంభించాడు. ఈమె ఎవరో కాదు గతంలో ఈటీవీ రియాల్టీ షోలలో కనిపించేది. సుమంత్ హీరోగా రూపొందించిన ఓ సినిమాలో హీరోయిన్ గా నటించింది. వర్షిణి ది కూడా తమిళ కుటుంబ నేపథ్యమే. పుట్టింది మాత్రం హైదరాబాదులో. టీవీ షోలు, సినిమాల్లో పెద్దగా క్లిక్ కాలేదు. కానీ వాషింగ్టన్ సుందర్ తో మాత్రం హాయిగా తిరిగేస్తోంది. ఈ మధ్య ఒకరోజు వీరిద్దరూ కలిసి ఫుల్లుగా ఎంజాయ్ చేశారు.. ఒక రిసార్ట్లో చిల్ అయ్యారని తమిళ మీడియా కోడై కూస్తోంది. ఇద్దరు ఇష్టపడ్డారు. కలిసి తిరుగుతున్నారు. నచ్చని నాడు విడిపోతారు. ఇదంతా మనకెందుకు అంటారా? మీ ప్రశ్న సరయిందే కానీ.. ఐపీఎల్ సీజన్ నడుస్తున్నప్పుడు యాజమాన్యం ఇటువంటి యవ్వారాలను అస్సలు సహించదు.

    పీకి పడేసింది

    వర్షిణితో సుందర్ సాగిస్తున్న యవ్వారం తెలిసి జట్టు యాజమాన్యం అతడిని ఐపీఎల్ నుంచి పీకి పడేసింది.. గట్టి హెచ్చరికలు పంపింది. ఇలాంటి తిరుగుళ్ళు తిరిగి కెరియర్ నాశనం చేసుకోవద్దు అని గట్టిగా మందలించింది. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఇండియన్ అఫీషియల్ టీం లోనే కాదు ఐపీఎల్ జట్లలోనూ మంచి ధరకు ప్రవేశం సాధించడం చాలా క్లిష్టమైన టాస్క్. నిలుపుకోవడం కూడా మరింత పెద్ద టాస్క్. ఇలాంటి సమయంలో ఆ యాంకర్ తో తిరిగి కెరియర్ నాశనం చేసుకోవడం అవసరమా ? అని సుందర్ కు తోటి క్రీడాకారులు హితవు చెబుతున్నారు.. ఎఫైర్ పెట్టుకుంటే పెట్టుకున్నావు గాని.. అందులో గోప్యత పాటిస్తే మంచిది కదా? అని సలహా ఇస్తున్నారు..అన్నట్టు ఇదే వర్షిణి గతంలో ఓ సెలబ్రిటీతో యవ్వారం నడిపింది. తర్వాత హైపర్ ఆదితో సంథింగ్ సంథింగ్ అంటూ ప్రచారం జరిగింది. ఆ మధ్య ఆది బర్త్ డే ను అర్ధరాత్రి మూడు గంటలకు జరిపి, ఆ వీడియోను ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. అతడికి ఒక ముద్దు కూడా ఇచ్చింది..”నువ్వు నాకు కరెక్ట్ రా ఆది ” అంటూ కామెంట్ కూడా చేసింది..ఇప్పుడేమో సుందర్ తో చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతోంది. హేమిటో ఈ తాత్కాలిక “సమ్” బంధాలు. ఒక పట్టాన కొరుకుడు పడవు. ఒక పట్టాన అతకవు.