Vaibhav Suryavanshi milk consumption: అప్పట్లో టీమ్ ఇండియా సారధిగా ధోని ఉండేవాడు. సారథిగా ప్రమోషన్ పొందకంటే ముందు అతడు సూపర్ ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. జులపాల జుట్టు.. హెలికాప్టర్ షాట్లతో జార్ఖండ్ డైనమేట్ గా రూపాంతరం చెందాడు. టీమిండియా కెప్టెన్ గా అతడు ప్రమోషన్ కూడా పొందాడు. అతడి నాయకత్వంలో టీ20.. వన్డే వరల్డ్ కప్ లను భారత జట్టు సొంతం చేసుకుంది. అయితే అతడు ఆ స్థాయిలో బ్యాటింగ్ చేయడం వెనుక ఒక సీక్రెట్ ఉంది. అతడు ప్రతిరోజు లీటర్ల కొలది పాలు తాగడం వల్లే ఆ స్థాయిలో సామర్థ్యాన్ని సొంతం చేసుకునేవాడు. ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో అతడు చెప్పాడు.
ప్రస్తుత ఐపిఎల్ లో వైభవ్ సూర్య వంశీ మెరుపు వేగంతో బ్యాటింగ్ చేశాడు. ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. అంతేకాదు ఇంకా అనేక రకాల పురస్కారాలను అతడు దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో అతడిని ప్రఖ్యాత వ్యాఖ్యాత రవి శాస్త్రి ఇంటర్వ్యూ చేశాడు. నువ్వు ఈ స్థాయిలో సిక్సర్లు కొడుతూ ఉంటావు కదా.. వీరోచితంగా బ్యాటింగ్ చేస్తూ ఉంటావు కదా.. నువ్వు రోజు ఎన్ని లీటర్ల పాలు తాగుతావు అంటూ రవి శాస్త్రి ప్రశ్నించాడు. దానికి సూర్య వంశీ చెప్పిన సమాధానం అందరిని ఆశ్చర్యపరచింది.
సూర్య వంశీ ప్రస్తుతానికి శరీర సామర్థ్యం మీద దృష్టి సారించాడు. వికెట్ల మధ్యలో వేగంగా పరుగులు పెట్టడాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇందులో భాగంగా తనకు ఎంతో ఇష్టమైన బీహార్ మటన్ ను పక్కన పెట్టాడు. చికెన్ వంటకాలు కూడా పూర్తిగా తగ్గించాడు. కేవలం డైటీషియన్ చెప్పినట్టుగానే తింటున్నాడు. ఫలితంగా బరువు చాలా బరువు తగ్గాడు. ఒకప్పటితో పోల్చి చూస్తే వికెట్ల మధ్య వేగంగా పరుగులు పెడుతున్నాడు. అంతేకాదు సామర్థ్యాన్ని కూడా సరికొత్తగా పెంపొందించుకుంటున్నాడు.
సూర్య వంశీ గతంలో పాలు తాగేవాడు. అది కూడా లీటర్ల క్వాంటిటీలో లాగించేవాడు. ఎప్పుడైతే అతడు ప్రొఫెషనల్ ఆటగాడిగా మారిపోయాడో.. రాజస్థాన్ జట్టుకు ఆటగాడిగా మారిపోయిన తర్వాత తన బరువును తగ్గించుకునే పనిలోపడ్డాడు. రాహుల్ ద్రావిడ్ సూచన మేరకు చాలావరకు డైట్ తగ్గించుకున్నాడు. నాన్ వెజ్ పూర్తిగా మానేశాడు. ఆయిల్ ఫుడ్ పూర్తిగా తగ్గించాడు. కేవలం ఎక్కువ శక్తిని ఇచ్చే ఆహారాన్ని మాత్రమే తీసుకుంటున్నాడు. ఫైబర్.. ప్రోటీన్స్.. ఉండే విధంగా ఆహారాన్ని తీసుకుంటున్నాడు. పాలు తాగే అలవాటును పూర్తిగా మానేశాడు. ఇదే విషయాన్ని రవి శాస్త్రితో చెబితే అతడు నవ్వి ఊరుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అవుతోంది.
Ravi Shastri tried to unlock the secret behind Vaibhav Suryavanshi’s power
Question: How much milk do you drink nowadays?
Vaibhav: Sir, I don’t drink milk nowadays pic.twitter.com/FHaX1qeJgc
— SaffronSoul (@TheRealDharm) June 1, 2026
