Mitchell Starc: ముంబై జట్టుపై శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్లో కోల్ కతా విజయం సాధించింది.. ఇందులో ఆ జట్టు బౌలర్ మిచెల్ స్టార్క్ కీలక పాత్ర పోషించాడు. వాస్తవానికి ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత కీలకమైన బౌలర్ స్టార్క్. కానీ అందుకు తగ్గట్టుగా ఆడలేక.. తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. ముంబై జట్టును వారి సొంత మైదానంలో ఓడించి, కోల్ కతా ను తిరుగులేని స్థాయిలో నిలబెట్టాడు. అద్భుతమైన బాల్స్ వేసి, ముంబై ఆటగాళ్లకు తన పవర్ చూపించాడు. స్టార్క్ వేసిన పదునైన బంతులకు ముంబై ఆటగాళ్ల వికెట్లు గాల్లోకి ఎగిరాయి. ఏకంగా నాలుగు వికెట్లు తీసి.. స్టార్క్ సంబరాలు చేసుకున్నాడు. వికెట్ పడినప్పుడల్లా ఎగిరి గంతేస్తూ విశ్లేషకుల విమర్శలకు సరైన సమాధానం చెప్పాడు.
ఈ సీజన్ కోసం 2023లో ఐపీఎల్ వేలం జరిగింది. స్టార్క్ ను కోల్ కతా జట్టు ఏకంగా 24.75 కోట్లకు కొనుగోలు చేసింది.. అంతటి ధర చూసి క్రీడాకారులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.. స్టార్క్ సత్తా తెలిసినప్పటికీ.. ప్లాట్ మైదానాలపై ఆ స్థాయి బౌలింగ్ చేస్తాడా అని విశ్లేషకులు సందేహించారు. కొందరైతే అంతటి ధర అతనికి పెట్టొచ్చని వ్యాఖ్యానించారు. అంతటి ఖరీదైన బౌలర్ ఆశించినత స్థాయిలో ఐపీఎల్ లో రాణించలేకపోయాడు. వికెట్లు తీయడం దేవుడెరుగు.. పరుగులు ధారాళంగా ఇవ్వడం మొదలుపెట్టాడు. ఒకానొక దశలో జట్టుకు భారంగా మారాడు. అతడు ఎంత లైన్ అండ్ లెంగ్త్ తో బాల్స్ వేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.
చెత్త బౌలింగ్ తో విమర్శలు ఎదుర్కొన్న అతడు.. నిద్రలేని రాత్రులు గడిపాడు. కోల్ కతా జట్టులో అనామక ఆటగాడిగా ముద్ర పడిపోయాడు. తీవ్రస్థాయిలో విమర్శలు వస్తుండడంతో అలా మౌనంగా ఉండిపోయాడు.. తనదైన రోజు కోసం ఎదురుచూడడం మొదలుపెట్టాడు. ఆరోజు రానే వచ్చింది. శుక్రవారం ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కీలకమైన నాలుగు వికెట్లు పడగొట్టి, ఔరా అనిపించాడు. ఇప్పటివరకు 9 మ్యాచులు ఆడిన స్టార్క్ ఏడు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. కానీ ముంబై తో జరిగిన మ్యాచ్లో నాలుగో వికెట్లు సాధించాడు. ఈ వికెట్లు తీయడం ద్వారా తన గుండెలో ఉన్న భారాన్ని మొత్తం ఒక్కసారిగా దించేసుకున్నాడు. వికెట్లు తీసిన ఆనందంలో మైదానంలో ఎగిరి గంతేశాడు.
Mitchell Starc with the final wicket for @KKRiders
Watch the recap on @StarSportsIndia and @JioCinema #TATAIPL | #MIvKKR pic.twitter.com/aUz2emSPdV
— IndianPremierLeague (@IPL) May 3, 2024