Champions Trophy 2025 (14)
Champions Trophy 2025: క్రికెట్లో అప్పుడప్పుడు అద్భుతాలు చోటు చేసుకుంటాయి. వాటిని అభిమానులు గొప్పగా చెప్పుకుంటారు. ఆటగాళ్లు కూడా తమ మధ్య జరిగే సరదా సంభాషణల్లో కూడా ఈ విషయాలను నెమరు వేసుకుంటారు. టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత.. మీడియాలో, సోషల్ మీడియాలో ఒక విషయం ప్రధానంగా చర్చకు వచ్చింది. ఇంతకీ అది ఏంటంటే..
Also Read: ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం ద్వారా.. టీమిండియా ఆటగాళ్లు ఎంత సంపాదించారో తెలుసా?
టి20 వరల్డ్ కప్ జరుగుతున్నప్పుడు.. విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు. సింగిల్ డిజిట్ స్కోర్ కే అతడు వెను తిరిగేవాడు.. దీంతో విరాట్ కోహ్లీని జట్టు నుంచి తొలగించాలని.. ఇతర ఆటగాళ్లకు అవకాశం కల్పించాలని డిమాండ్లు పెరిగిపోయాయి. సెమీఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా పై గెలిచిన తర్వాత రోహిత్ శర్మ కు ఇదే ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనిపై రోహిత్ తనదైన శైలిలో స్పందించాడు. విరాట్ కోహ్లీ ఫామ్ గురించి తనకు ఆందోళనలేదని.. అతడు కచ్చితంగా ఆడతాడని.. ఫైనల్ మ్యాచ్లో అతడు ఆడే అద్భుతమైన ఇన్నింగ్స్ కోసం తాను ఎదురుచూస్తున్నానని రోహిత్ వ్యాఖ్యానించాడు. అతడు చెప్పినట్టుగానే విరాట్ కోహ్లీ ఫైనల్ మ్యాచ్లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఏకంగా 76 పరుగులు చేసి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. దక్షిణాఫ్రికా జుట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఒక్కడే నిలబడ్డాడు. అక్షర్ పటేల్ తో స్థిరమైన ఇన్నింగ్స్ ఆడి.. టీమిండియా విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఫైనల్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ పూనకం వచ్చినట్టు బ్యాటింగ్ చేశాడు. దక్షిణాఫ్రికా బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. తద్వారా టీమిండియా భారీ స్కోరు చేయడానికి బాటలు వేశాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చేయడం.. టీమిండియా విధించిన లక్ష్యానికి 12 పరుగుల దూరంలో నిలిచిపోవడంతో.. భారత్ రెండోసారి టి20 వరల్డ్ కప్ గెలుచుకుంది. అంతేకాదు ఉత్కంఠ పరిస్థితుల మధ్య విజయం సాధించి.. సరికొత్త చరిత్ర సృష్టించింది.
ఇప్పుడు రోహిత్..
రోహిత్ రిటైర్మెంట్ పై ఇటీవల వ్యాఖ్యలు వినిపించాయి. రోహిత్ సరైన ఫామ్ లో లేకపోవడంతో అతడు వన్డేలకు వీడ్కోలు పలకాలని డిమాండ్ల వ్యక్తమయ్యాయి. చివరికి ఇటీవల ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన వన్డే సిరీస్ లో రోహిత్ టచ్ లోకి వచ్చాడు. సూపర్ సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. ఇక ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ వరకు రోహిత్ సరిగా ఆడలేకపోయాడు. తన స్థాయి ఇన్నింగ్స్ నిర్మించలేకపోయాడు. అయితే ఫైనల్ మ్యాచ్లో మాత్రం 76 పరుగులు చేసి.. టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. న్యూజిలాండ్ విధించిన 252 పరుగుల లక్ష్యాన్ని చేదించడంలో రోహిత్ కీలక భూమిక పోషించాడు. 76 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. గిల్ తో కలిసి తొలి వికెట్ కు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాడు. అందువల్లే రోహిత్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం దక్కించుకున్నాడు. టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో విరాట్, చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో రోహిత్ 76 పరుగులు చేయడం విశేషం. క్రికెట్ చరిత్రలో ఇది అద్భుతం.