Homeఎంటర్టైన్మెంట్Anchor Anasuya : చీర కట్టులో మెస్మరైజ్ చేస్తున్న రంగమ్మత్త... వైరల్ గా అనసూయ లేటెస్ట్ ఫోటో...

Anchor Anasuya : చీర కట్టులో మెస్మరైజ్ చేస్తున్న రంగమ్మత్త… వైరల్ గా అనసూయ లేటెస్ట్ ఫోటో షూట్

Anchor Anasuya  : అనసూయ భరద్వాజ్ ని బుల్లితెర ఆడియన్స్ బాగా మిస్ అవుతున్నారు. ఆమె అందాలను ఏళ్ల తరబడి జబర్దస్త్ వేదికగా ఆస్వాదించారు. 2022లో అనసూయ జబర్దస్త్ నుండి తప్పుకుంది. అందుకు పలు కారణాలు వెల్లడించింది. టీఆర్పీ స్టంట్స్ నచ్చడం లేదు. కమెడియన్స్ నాపై జోక్స్ వేస్తున్నారని ఆమె ఒకింత అసహనం వ్యక్తం చేసింది. ఇకపై టెలివిజన్ షోలు చేసేది లేదని కూడా చెప్పింది. దాంతో ఫ్యాన్స్ గుండెల్లో రాయిపడింది. తన ప్రామిస్ ని బ్రేక్ చేస్తూ అనసూయ ఇటీవల ఒక షో చేసింది.

స్టార్ మా లో కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ పేరుతో ఒక గేమ్ షో ప్రసారమైంది. బుల్లితెర సెలెబ్స్ అమ్మాయిలు-అబ్బాయిలుగా ఏర్పడి పోటీపడతారు. కిరాక్ బాయ్స్ కి శేఖర్ మాస్టర్, ఖిలాడీ గర్ల్స్ కి అనసూయ ప్రతినిధులుగా వ్యవహరించారు. ఈ షోలో కూడా తన గ్లామర్ షోకి అనసూయ తెరలేపింది. జానీ మాస్టర్ షర్ట్ తీసేస్తే.. అనసూయ అందుకు పోటీగా తన ఒంటిపై ఉన్న జాకెట్ తొలగించి మైండ్ బ్లాక్ చేసింది. ఇది కాస్త వివాదాస్పదం అయ్యింది. అనసూయ ఎప్పటిలానే విమర్శలను కొట్టి పారేసింది.

Also Read : అనసూయ రోజుకి ఎంత తీసుకుంటుందో తెలుసా? ఆ సినిమాకు కెరీర్ హైయెస్ట్, మైండ్ బ్లోయింగ్ డిటైల్స్

కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ 2 త్వరలో ప్రారంభం కానుంది. ఇటీవల ప్రోమో విడుదల చేశారు. అనసూయ, శేఖర్ మాస్టర్, శ్రీముఖి సదరు ప్రోమోలో కనిపించారు. అనసూయ టెలివిజన్ షో ప్రారంభం అవుతుందన్న న్యూస్ ఆమె ఫ్యాన్స్ లో జోష్ నింపింది. ఈ షో కొరకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు నటిగా విలక్షణ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. పుష్ప 2లో దాక్షాయణి పాత్రలో అనసూయ అద్భుతంగా నటించింది.

ఇక అనసూయ రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచేసినట్లు సమాచారం. గతంలో ఆమె రోజుకు రూ. 1 లక్ష ఛార్జ్ చేసేదట. పెదకాపు ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా తెరకెక్కుతున్న కొత్త చిత్రంలో అనసూయ రోజుకు రూ. 3 లక్షలు ఛార్జ్ చేస్తుందని సమాచారం. తన పనిలో ఎంత బిజీగా ఉన్నా ఫోటో షూట్స్ తో తన ఇంస్టాగ్రామ్ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. చీర కట్టులో అనసూయ చేసిన మెస్మరైజింగ్ ఫోటో షూట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.

Also Read : హ్యాండ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్, ప్రభాస్..ఈ సమ్మర్ కి స్టార్ హీరోల సినిమాలు లేనట్టేనా?

Exit mobile version