Dileep Trophy : టీమిండియా టి20 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది.. ఈ విషయంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. కీలకపాత్ర పోషించారు.. ఆ తర్వాత వారిద్దరు t20 ల నుంచి నిష్క్రమిస్తున్నట్టు ప్రకటించారు.. మళ్లీ ఇప్పుడు వీరిద్దరూ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రోహిత్ – విరాట్ వన్డే, టెస్ట్ జట్టులో మాత్రమే కొనసాగుతున్నారు. ఈ రెండు జట్లకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తున్నాడు. టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమిండియా శ్రీలంకలో పర్యటించింది. అంతకుముందు యువ జట్టు జింబాబ్వేలో పర్యటించి.. టి20 సిరీస్ దక్కించుకుంది. శ్రీలంకలో పర్యటించిన భారత జట్టు టి20 సిరీస్ సాధించగా.. వన్డే సిరీస్ మాత్రం కోల్పోయింది. వన్డే సిరీస్ కు రోహిత్ నాయకత్వం వహించాడు. విరాట్ కీలక ఆటగాడిగా ఉన్నాడు. రోహిత్ ఆడిన మూడు మ్యాచ్లలో మెరుగైన ఇన్నింగ్స్ నమోదు చేశాడు. విరాట్ మాత్రం ఆశించినంత స్థాయిలో రాణించలేకపోయాడు. ఈ సిరీస్ పరాజయం తర్వాత టీమ్ ఇండియా పై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. త్వరలో టీమిండియా బంగ్లాదేశ్లో టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ క్రమంలోనే కెప్టెన్ రోహిత్, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
సామర్థ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు..
బంగ్లాదేశ్ తో ఆడే టెస్ట్ సిరీస్ లో భారత జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ఎంపిక చేయనుంది. ఈ నేపథ్యంలో తమ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ దిలీప్ ట్రోఫీలో ఆడే అవకాశం ఉంది. మీరు మాత్రమే కాకుండా మిగతా ఆటగాళ్లు కూడా ఈ ట్రోఫీలో ఆడే అవకాశం ఉందని జాతీయ మీడియాలో ప్రసారమవుతున్న వార్తలు ద్వారా తెలుస్తోంది. సెలక్షన్ కమిటీ కూడా ఇదే విషయాన్ని ఆటగాళ్లకు సూచించిందని తెలుస్తోంది. గిల్, రాహుల్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్, సూర్య కుమార్ యాదవ్, కులదీప్ యాదవ్ ను కూడా భారత సెలక్షన్ కమిటీ దిలీప్రోఫీలో ఆడమని కోరినట్లు తెలుస్తోంది. అయితే ఈ సిరీస్లో స్టార్ పేస్ బౌలర్ బుమ్రా ఆడటం లేదు. తీరికలేని క్రికెట్ ఆడుతున్న అతను… కొద్దిరోజులపాటు విశ్రాంతి కావాలని బీసీసీఐ పెద్దలను అడగడంతో.. వారు అతనికి మినహాయింపు ఇచ్చారు. బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ అనంతరం.. భారత్ ఆస్ట్రేలియా, ఇతర జట్లతో మ్యాచ్ లు ఆడనుంది.
జోనల్ ఫార్మాట్ రద్దు..
దులీప్ ట్రోఫీలో గతంలో ఉన్న జోనల్ ఫార్మాట్ ను రద్దు చేశారు. ప్రస్తుతం ఈ సిరీస్ లో ఇండియా ఏ, ఇండియా బి, ఇండియా సి, ఇండియా డీ పేరుతో జట్లను ఎంపిక చేస్తారు.. దులిప్ ట్రోఫీ ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో జరగాల్సి ఉంది. మరోవైపు ఒక రౌండ్ పోటీలను బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కూడా నిర్వహిస్తారు. ఈ ట్రోఫీలో భాగంగా 6 మ్యాచులు జరుగుతాయి. సెప్టెంబర్ 5న ట్రోఫీ మొదలవుతుంది. 24న ముగుస్తుంది. మరోవైపు బంగ్లాదేశ్ తో తొలి టెస్ట్ సెప్టెంబర్ 19 నుంచి చెన్నైలో మొదలవుతుంది. అయితే రోహిత్, విరాట్ కోహ్లీ సెప్టెంబర్ ఐదున ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీలో ఆడతారా? 12న మొదలయ్యే రెండో రౌండ్ లో ఆడతారా? అనే విషయాలపై స్పష్టత లేదు. దులీప్ ట్రోఫీ కంటే ముందు చెన్నైలో ఒక షార్టు క్యాంప్ ను బీసిసిఐ ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. కాగా, రోహిత్, విరాట్, బుమ్రా ను మినహాయించి మిగతా ఆటగాళ్లు దేశవాళి క్రికెట్ ఆడాలని కొన్ని నెలల క్రితం బీసీసీఐ సెక్రటరీ జై షా పేర్కొన్నారు. దానికి తగ్గట్టుగానే ప్రస్తుతం సీనియర్ ఆటగాళ్లు దులీప్ ట్రోఫీలో ఆడే అవకాశం ఉంది. మరోవైపు ఆగస్టు 15 నుంచి తమిళనాడులో జరిగే బుచ్చిబాబు ఇన్విటేషన్ టోర్నమెంట్లో సూర్య కుమార్ యాదవ్, సర్ఫరాజ్ వంటి ఆటగాళ్లు ఆడే అవకాశం ఉంది..
వారు కూడా ఆడే అవకాశం
శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ కూడా దులీప్ ట్రోఫీ లో ఆడే అవకాశం ఉంది. భారత జట్టులోకి మళ్లీ ఎంట్రీ ఇవ్వాలంటే కిషన్ కచ్చితంగా రెడ్ బాల్ క్రికెట్ ఆడాల్సిందేనని సెలక్షన్ కమిటీ ఇటీవల ప్రకటించింది. గత ఏడాది రంజీ ట్రోఫీ ఆడాలని అయ్యర్, కిషన్ కు సెలక్షన్ కమిటీ సూచించింది. అయితే వారు రంజీ ట్రోఫీ ఆడకుండా సాకులు చెప్పారు. దీంతో వారిని వార్షిక కాంట్రాక్ట్ నుంచి బీసీసీఐ తొలగించింది. ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్లో అయ్యర్ కు బీసీసీఐ అవకాశం ఇచ్చింది. అయితే అతడు ఆ సిరీస్ లో దారుణంగా విఫలమయ్యాడు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Virat rohit decided to play dileep trophy before the test series with bangladesh
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com