Virat Kohli : టీమిండియా 17 సంవత్సరాల అనంతరం t20 వరల్డ్ కప్ సాధించిన నేపథ్యంలో.. సగటు భారత క్రికెట్ అభిమాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఇదే క్రమంలో టి20 ఫార్మాట్ కు టీమిండియా లెజెండరీ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా వీడ్కోలు పలికారు. వారు ముగ్గురు తీసుకున్న నిర్ణయం ఒక్కసారిగా సంచలనానికి కారణమైంది. అయితే టి20 ఫార్మాట్ కు ఎందుకు వీడ్కోలు పలికారనే దానిపై రోహిత్, రవీంద్ర జడేజా క్లారిటీ ఇచ్చినప్పటికీ.. విరాట్ కోహ్లీ మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఇదే ప్రశ్న అనేక సందర్భాల్లో విరాట్ కోహ్లీకి ఎదురైనప్పటికీ.. అతడు క్లారిటీ ఇవ్వకపోగా.. ఆ ప్రశ్నకు సమాధానాన్ని దాటవేస్తూ వచ్చాడు. అయితే ఇన్ని రోజులకు విరాట్ కోహ్లీ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాడు.
Also Read : మైదానంలో నితీష్ దారుణాన్ని చూడలేక.. అతడి తండ్రి సంచలన నిర్ణయం!
అందువల్లే వీడ్కోలు పలికాడట..
టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ.. పొట్టి క్రికెట్ కు(ఐపీఎల్ కు కాదు) గుడ్ బై చెప్పాడు. అయితే ఇన్నాళ్లకు తను ఎందుకు ఆ ఫార్మాట్ కు వీడ్కోలు పలికాను అనే విషయంపై విరాట్ కోహ్లీ స్పష్టత ఇచ్చాడు..” కొత్త ప్లేయర్లు జట్టులోకి రావాల్సి ఉంది.. తదుపరి వరల్డ్ కప్ కు వారు సిద్ధంగా ఉండాలంటే కచ్చితంగా రెండు సంవత్సరాలైనా పడుతుంది. అందుకే టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలవగానే.. అంతర్జాతీయ టి20 ఫార్మాట్ కు వీడ్కోలు పలికాను.. టి20 ఫార్మాట్ లో యువకులకు అవకాశం కల్పించడానికి ఆ నిర్ణయం తీసుకున్నాను. నేను తీసుకున్న నిర్ణయం మంచిదే అని భావిస్తున్నాను. టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత నేను, రోహిత్, రవీంద్ర జడేజా పొట్టి ఫార్మాట్ నుంచి తప్పుకున్నాం. మా ముగ్గురి స్థానంలో వేరే వారికి అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాలను యువ ఆటగాళ్లు సద్వినియోగం చేసుకుంటున్నారు.. అందువల్లే జట్టులోకి యువ రక్తంతో తొణికిసలాడుతోంది.. ప్రస్తుతం టీమిండియా టి20 ఫార్మాట్ లో నెంబర్ వన్ స్థానంలో ఉంది. ఇదే జోరు వచ్చే కాలంలోనూ సాగిస్తుందని అనుకుంటున్నాని” విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. ఇక గత ఏడాది జరిగిన టి20 వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ అన్ని మ్యాచ్లలో విఫలమయ్యాడు. కానీ ఫైనల్ మ్యాచ్లో మాత్రం దుమ్మురేపాడు. జట్టుకు అవసరమైన సందర్భంలో హాఫ్ సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు.. అతడు ఆడిన అద్భుతమైన ఆట వల్ల టీమిండియా ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఎదుట టఫ్ టార్గెట్ విధించింది. ఆ టార్గెట్ ఫినిష్ చేయడంలో దక్షిణాఫ్రికా చివరి వరకు పోరాడినప్పటికీ.. 12 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఇక టీమ్ ఇండియా తరపున విరాట్ కోహ్లీ 125 టి20 మ్యాచ్ లు ఆడాడు.