Virat Kohli : విరాట్ కోహ్లీ 2008 నుంచి ఇప్పటివరకు ఐపీఎల్లో బెంగళూరు జట్టుకు ఆడుతున్నాడు. సారధిగా కూడా వ్యవహరించాడు. అయితే ఇప్పటివరకు బెంగళూరు జట్టు ఐపిఎల్ ట్రోఫీ సాధించలేకపోయింది. విరాట్ కోహ్లీ సారధిగా ఉన్నప్పటికీ.. బెంగళూరు విజేతగా నిలవలేకపోయింది. ఇక విరాట్ కోహ్లీ ఏటికేడు తన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు. కుర్రాళ్ల కంటే దీటుగా పరుగులు చేస్తున్నాడు. తగ్గేదే లేదు అన్నట్టుగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అందువల్లే విరాట్ కోహ్లీ వదులుకోవడానికి బెంగళూరు జట్టు యాజమాన్యం ఇష్టపడటం లేదు. పైగా అతని కోసం ఎన్ని త్యాగాలు చేయడానికైనా బెంగళూరు యాజమాన్యం వెనుకాడటం లేదు. ప్రస్తుత ఐపీఎల్ లో బెంగళూరు తన జట్టు కోసం విరాట్ కోహ్లీతో ఎక్కువగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. కెప్టెన్ రజత్ పాటిదార్ ఉన్నప్పటికీ విరాట్ కోహ్లీకి అగ్రతాంబూలం ఇస్తోంది.. అంతేకాదు కెప్టెన్ గా పాటిదార్ నియామకం వెనుక కూడా విరాట్ కోహ్లీ ఉన్నాడని తెలుస్తోంది.
Also Read : కేఎల్ రాహుల్ కాంతారా స్టెప్ వేసి టీజ్ చేసిన కోహ్లీ: వీడియో వైరల్
నచ్చిన పాట అదేనట..
విరాట్ కోహ్లీ సామాజిక మాధ్యమాలలో తిరుగులేని స్థాయిలో ఉన్నాడు. అతడికి విపరీతమైన అనుచర గణం ఉంది.. విరాట్ కోహ్లీ కి ఇన్ స్టా గ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్ లో మిలియన్ల మంది అనుసరిస్తుంటారు. ప్రపంచంలో ఏ క్రికెటర్ కు లేని ఫాలోయింగ్ విరాట్ కోహ్లీకి ఉంది. అయితే విరాట్ కోహ్లీ ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆ కార్యక్రమంలో బెంగళూరు అధికారిక జెర్సీ వేసుకొని కనిపించాడు. ఈ సందర్భంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వ్యాఖ్యాత.. మీకు ఇష్టమైన పాట ఏదని అడిగాడు.. దానికి విరాట్ కోహ్లీ “నీ సింగం దాన్” అనే పాటను తన మొబైల్లో చూపించి వినిపించాడు. దీంతో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. సాధారణంగా విరాట్ కోహ్లీ ఏదైనా బాలీవుడ్ పాట వినిపిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ వారందరికీ షాక్ ఇస్తూ విరాట్ కోహ్లీ తనకు నచ్చిన పాట అదేనంటూ స్పష్టంగా చెప్పేశాడు.. అంతేకాదు తమిళ్ చిత్రం “పాతు తలా” సినిమాలో వివేక్ రచించిన ” నీ సింగం దాన్” సాంగ్ మై ఫేవరెట్ సాంగ్ అని విరాట్ వెల్లడించాడు. ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించాడు.. ఈ పాట ఇప్పటికే యూట్యూబ్లో 8+ కోట్ల వ్యూస్ దక్కించుకుంది.. ఈ పాటను ఏ ఆర్ రెహమాన్ స్వరపరిచారు. ఈ సినిమాలో శింబు, గౌతమ్ కార్తీక్, ప్రియా భవాని శంకర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ నటించారు. ఒబేలి ఎన్. కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే ఈ పాట హీరో వ్యక్తిత్వాన్ని ఓ రేంజ్ లో వివరిస్తుంది. అందువల్లే ఈ పాట తమిళ్లో సూపర్ హిట్ అయింది. అది విరాట్ కోహ్లీకి విపరీతంగా నచ్చింది. అందుకే ఈ పాటను తన ఫేవరెట్ సాంగ్ అని విరాట్ కోహ్లీ వివరించాడు
Virat Kohli talking about his favourite song. pic.twitter.com/yfYoy511yl
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 1, 2025