Virat Kohli
Virat Kohli : బెంగళూరు జట్టు గత ఏడాది నిర్వహించిన మెగా వేలంలో ఆడని ఆటగాళ్లను వదిలేసుకుంది. ఆడేవారికి మాత్రమే అవకాశం కల్పించింది. కొంతమంది ఆటగాళ్లకు భారీ మొత్తంలో చెల్లించి దక్కించుకుంది. మొత్తంగా ఈసారి ఐపీఎల్ ట్రోఫీని దక్కించుకోవడానికి రసవత్తరమైన ప్రణాళిక రూపొందించింది. కెప్టెన్ గా రజత్ పాటిదార్ కు అవకాశం కల్పించింది. మొత్తంగా బెంగళూరు జట్టు గత వైఫల్యాలకు చెక్ పెడుతూ.. ఈసారి సరికొత్తగా దర్శనమిస్తోంది. ఆటగాళ్ల ఆట తీరు చూసి బెంగళూరు అభిమానులు సంబరపడిపోతున్నారు. ఈసాలా కప్ నమదే అంటూ ఎగిరి గంతులు వేస్తున్నారు. సీజన్లో బెంగళూరు జట్టు ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్లలో విజయం సాధించింది..కోల్ కతా కోల్ కతా వేదికగా.. చెన్నై జట్టుపై చెన్నై వేదికగా విజయాలు సాధించి పాయింట్లు పట్టికలో మొదటి స్థానంలో కొనసాగుతోంది.. దీంతో బెంగళూరు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈసారి బెంగళూరు ఆటగాళ్లు అద్భుతంగా ఆడతారని.. ట్రోఫీని తీసుకొస్తారని బలంగా నమ్ముతున్నారు.
Also Read : చేసింది 31 పరుగులే ఐనా.. CSK పై విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు
విరాట్ కోహ్లీ మాస్ ర్యాగింగ్
శుక్రవారం జరిగిన మ్యాచ్లో చెన్నై జట్టుపై బెంగళూరు ఘనవిజయం సాధించిన నేపథ్యంలో.. బెంగళూరు మాజీ కెప్టెన్, బెంగళూరు జట్టులో కీలక ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli) చెన్నై జట్టు ఆటగాళ్లను ర్యాగింగ్ చేయడం మొదలుపెట్టాడు. చెన్నై జట్టు ఓటమికి దగ్గరగా ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో రవీంద్ర జడేజా(Ravindra Jadeja) వద్దకు వచ్చి ర్యాగింగ్ చేశాడు. సహజంగానే మైదానంలో విపరీతమైన దూకుడు మనస్తత్వంతో ఉంటే విరాట్ కోహ్లీ.. అప్పుడప్పుడు తనలో ఉన్న చిలిపి కోణాన్ని కూడా బయటపెడతాడు. తోటి ప్లేయర్లను ఇమిటేట్ చేస్తాడు. “కంగారు” లాగా గంతులు వేస్తాడు. కోపం వస్తే అదే స్థాయిలో ప్రత్యర్థి ఆటగాళ్లపై రెస్పాండ్ అవుతాడు. వారు అవుట్ అయిన తర్వాత గట్టిగా నినాదాలు చేస్తాడు. ఒకవేళ క్యాచ్ పట్టుకున్నా.. రన్ అవుట్ చేసినా.. విరాట్ కోహ్లీలో అసలైన కసి బయటపడుతుంది. ఆగ్రహంగా అతడు తనలో ఉన్న మరో కోణాన్ని బయటపెడతాడు. మొత్తంగా విరాట్ కోహ్లీ శుక్రవారం నాటి మ్యాచ్లో చెన్నై జట్టుపై విజయం సాధించిన అనంతరం సింహనాదం చేశాడు. దానికంటే ముందు తనలో ఉన్న హాస్యనటుడిని బయటికి తీసుకొచ్చాడు. రవీంద్ర జడేజాను ర్యాగింగ్ తో పాటు.. కామెడీ కూడా చేశాడు. ఈ సంబంధించిన ఫోటోలు.. వీడియోలను బెంగళూరు అభిమానులు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. 17 సంవత్సరాల తర్వాత చెన్నై జట్టును చెన్నై వేదికగా ఓడించిన తర్వాత బెంగళూరు ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేవని.. ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఉత్సాహానికి పట్టా పగ్గాలు లేవని సోషల్ మీడియా వేదికగా బెంగళూరు అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read : 30 బంతుల్లో 31.. కోహ్లీపై పై నెట్టింట విమర్శలు!