Virat Kohli: సోషల్ మీడియాలో ఏదైనా వాణిజ్య ప్రకటన సంబంధించి పోస్టు లేదా వీడియో అప్లోడ్ చేస్తే విరాట్ కోహ్లీ కోట్లల్లో వసూలు చేస్తుంటాడు. టీమిండియా క్రికెటర్లలో విరాట్ కోహ్లీకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. మహేంద్ర సింగ్ ధోని, సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ వంటి వారు విరాట్ కోహ్లీకి దరిదాపుల్లో కూడా లేరు. ఇన్ స్టా గ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్, థ్రెడ్స్ లో విరాట్ మానియా సాగుతూ ఉంటుంది. అతడు చిన్న పోస్ట్ చేసినా.. వీడియో అప్లోడ్ చేసినా అది కాస్త వైరల్ అవుతుంది. మిలియన్లలో లైక్స్, వ్యూస్ సొంతం చేసుకుంటుంది. అందువల్లే విరాట్ కోహ్లీతో వాణిజ్య ప్రకటనలు రూపొందించడానికి ఏజెన్సలు ఉత్సాహం చూపిస్తుంటాయి. కార్పొరేట్ కంపెనీలు అమితమైన ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటాయి. ఓ నివేదిక ప్రకారం అండార్స్మెంట్ లకు సంబంధించి విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదించే ఆటగాడిగా టాప్ స్థానంలో కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. సహజంగా భారీగా సంపాదించే అథ్లెట్లలో ఫుట్ బాల్ క్రీడాకారులు ముందుంటారు. అయితే వారి సరసన తొలిసారి చేరిన క్రికెటర్ గా విరాట్ కోహ్లీ నిలిచాడు.
Also Read: ఎన్టీఆర్ కు భారతరత్న.. సానుకూలంగా మోడీ!
జూకర్ బర్గ్ కు లెక్కలేదా..
విరాట్ కోహ్లీకి పేస్ బుక్ లో మిలియన్లలో ఫాలోవర్స్ ఉన్నారు. ఒక రకంగా ఫేస్బుక్లో అమితమైన ఆదరణ సాధించిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ మందు వరుసలో ఉంటాడు. అటువంటి విరాట్ కోహ్లీకి ఇన్ స్టా గ్రామ్ ద్వారా ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. ఇన్ స్టా గ్రామ్ లో తప్పుడు ఆల్గారిథమ్ వల్ల అవనీత్ కౌర్(సినీనటి) చిత్రాల పట్ల ఇష్టాన్ని వ్యక్తం చేసినట్టు నమోదయింది.. ఇన్ స్టా గ్రామ్ లో తప్పుడు ఆల్గారిథమ్ వల్ల ఇలాంటి సంఘటన చోటు చేసుకుందని ఇప్పటికే విరాట్ కోహ్లీ ప్రకటించాడు. అయితే అవనీత్ కౌర్ దృశ్యాలకు విరాట్ కోహ్లీ తన ఆసక్తిని వ్యక్తం చేయడం వివాదాన్ని రేపింది.. ఇది సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.. సాధారణంగా విరాట్ కోహ్లీ హీరోయిన్లకు దూరంగా ఉంటాడు. ఎట్టి పరిస్థితులను వారి పోస్టులకు తన ఆసక్తిని వ్యక్తం చేయడు. కామెంట్ కూడా చేయడు. అరుదుగా మాత్రమే అతడు ఈ పని చేస్తుంటాడు. పైగా అతడి టీం ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉంటుంది. కేవలం విరాట్ కోహ్లీ సోషల్ మీడియా అకౌంట్స్ చూసుకోవడానికి ప్రత్యేకమైన బృందం కూడా ఉంటుంది. అలాంటిది విరాట్ కోహ్లీ ప్రమేయం లేకుండా అవనీత్ కౌర్ చిత్రాలకు ఇష్టాన్ని వ్యక్తం చేసిన సందర్భం సంచలనాన్ని సృష్టించింది.. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ అభిమానులు మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విరాట్ కోహ్లీ ఎకౌంట్లో లేని పోస్ట్ కు ఎలా లైక్ సాధ్యమైందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ” విరాట్ కోహ్లీకి జూకర్ బర్గ్ సారి చెప్పాలి. ఎందుకంటే జరిగిన తప్పుకు బాధ్యుడు అతడే.. విరాట్ కోహ్లీ ప్రమేయం లేకుండా లైక్ నమోదయింది. ఇలాంటి లోపభూయిష్టమైన విధానాలు సరైనవి కాదు.. జూకర్ బర్గ్ తన ఆల్గారిథం పూర్తిగా మార్చాలి.. లేనిపక్షంలో ఇటువంటి ఇబ్బందులకు ఎవరు బాధ్యులు” అని విరాట్ కోహ్లీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.. బేషరతుగా జూకర్ బర్గ్ విరాట్ కోహ్లీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
Virat Kohli addresses social media controversy surrounding his interaction with Avneet Kaur’s fan page, cites an Instagram algorithm error.#ViratKohli pic.twitter.com/hoW2CIPBpI
— CricTracker (@Cricketracker) May 2, 2025