Virat Kohli Record: క్రికెట్లో లెజెండ్ బిరుదాంకితుడు సచిన్ టెండూల్కర్. అతడు నెలకొల్పిన రికార్డులను బద్దలు కొట్టడం అంత ఈజీ కాదు. గొప్ప గొప్ప క్రికెటర్లు సైతం అతడి ఘనత అందుకోవాలని ప్రయత్నించారు. కానీ ఎవరి వల్లా సాధ్యం కాలేదు. అయితే ఇప్పుడు సచిన్ కూడా చేరుకోలేని రికార్డును ఓ ఆటగాడు సృష్టించాడు.
సచిన్ కూడా సాధించిన రికార్డును సృష్టించిన ఆటగాడి పేరు విరాట్ కోహ్లీ.. సమకాలీన క్రికెట్లో విరాట్ కోహ్లీని కింగ్ అని పిలుస్తారు. దానికి కారణం అతడు ఆడే ఆట. ఎలాంటి మైదానమైనా సరే.. ఒకసారి బ్యాట్ పట్టుకొని అందులోకి అడుగుపెట్టితే.. ఆ తర్వాత పరిస్థితి మొత్తం మారిపోతుంది. డొమెస్టిక్ నుంచి మొదలు పెడితే ఇంటర్నేషనల్ వరకు ప్రతి ఫార్మాట్లోనూ విరాట్ కోహ్లీ అద్భుతాలు సృష్టించాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ లిస్ట్ ఏ క్రికెట్లో రికార్డులను బద్దలు కొట్టేస్తున్నాడు. 2028 లో జరిగే వన్డే వరల్డ్ కప్ లో ఆడే స్థాయిలో ఫామ్ లేదని విమర్శలు వస్తున్న నేపథ్యంలో.. అతడు అద్భుతాలు సృష్టిస్తున్నాడు
శుక్రవారం విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా గుజరాత్ జట్టుపై అతడు 77 పరుగులు చేశాడు. తద్వారా ఈ ఆటగాడు అందుకోలేని రికార్డింగ్ సృష్టించాడు. 50 ఓవర్ల క్రికెట్లో చాలా రోజులుగా ఎవరికీ వీధికాని రికార్డులను కోహ్లీ సాధించాడు. లిస్ట్ ఏ క్రికెట్లో లెజెండరీ ఫినిషర్ గా ఆస్ట్రేలియా క్రికెటర్ మైకేల్ బేవాన్ కు రికార్డు ఉంది. అయితే అతని రికార్డును కూడా విరాట్ బద్దలు కొట్టాడు. లిస్ట్ ఏ క్రికెట్లో యావరేజ్ రన్స్ లో బేవాన్ టాప్ లో ఉన్నాడు. అయితే అతడిని విరాట్ వెనక్కి పంపించాడు. బెంగళూరులో జరుగుతున్న ఈ మ్యాచ్లో గుజరాత్ జట్టుపై విరాట్ 61 బంతుల్లో 77 పరుగులు చేశాడు. లిస్ట్ ఏ క్రికెట్లో 57.87 యావరేజ్ కోరుకున్న టాప్ ఆటగాడిగా విరాట్ రికార్డు సృష్టించాడు. మైఖేల్ బేవన్ పేరు మీద 57.86 యావరేజ్ ఉంది.
అత్యధిక సగటు ఉన్న ప్లేయర్లు వీళ్లే
విరాట్ 57.87
మైకేల్ బేవన్ (ఆస్ట్రేలియా) 57.86
సమ్ హైన్(ఇంగ్లాండ్) 57.76
పూజార 57.01
రుతురాజ్ గైక్వాడ్ 56.68
బాబర్ అజాం 53.82
డివిలియర్స్ 53.46
గడిచిన ఆరు మ్యాచుల సీరీస్ లో విరాట్ కోహ్లీ 146 సగటుతో 584 పరుగులు చేశాడు. గుజరాత్ జట్టు మీద 61 బంతుల్లో 77, ఆంధ్రజ్యోతి మీద 101 బంతులలో 131, దక్షిణాఫ్రికా మీద 65, దక్షిణాఫ్రికా మీద 102, దక్షిణాఫ్రికా మీద 135, ఆస్ట్రేలియా మీద 74 పరుగులు చేశాడు.