Virat Kohli Retirement: మొత్తానికి ఆ ఘడియ వచ్చేసింది అని తన సహచర ప్లేయర్లతో చెప్పాడట. ఆ సిరీస్ లో విరాట్ అత్యంత చెత్త ఆట తీరు ప్రదర్శించాడు. కేవలం 9 ఇన్నింగ్స్ లలో 190 రన్స్ మాత్రమే స్కోర్ చేయగలిగాడు.. ఇందులో విశేషమేంటంటే తొమ్మిది మ్యాచ్లో అనవసరమైన అవుట్ సైడ్ ఆఫ్ బంతులను టచ్ చేసి 8 సార్లు మూల్యం చెల్లించుకున్నాడు. ఆ దృశ్యాలను నేటికీ అభిమానులు మర్చిపోలేకపోతున్నారు.. టీమిండియా చాంపియన్స్ ట్రోఫీలో విన్నర్ అవ్వడం.. ప్రస్తుతం ఐపీఎల్ జరుగుతున్న నేపథ్యంలో కోహ్లీ సుదీర్ఘ ఫార్మాట్ కు వీడ్కోలు పలికే తీరుపై చర్చ జరగడం లేదు.. అయితే ఇప్పుడు రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్ కు శాశ్వత వీడ్కోలు పలకడంతో విరాట్ కోహ్లీ గురించి చర్చ మొదలైంది.. రోహిత్ శాశ్వత వీడ్కోలు పలికిన తర్వాత మరొకసారి టెస్ట్ జట్టుకు సంబంధించిన బాధ్యతలు స్వీకరించాలని విరాట్ కోహ్లీ భావించాడని తెలుస్తోంది. ఇదే విషయాన్ని బీసీసీఐ పెద్దలతో చెప్పాడని సమాచారం.. ఇంగ్లాండ్ జట్టుతో జరిగే సుదీర్ఘ సిరీస్ కు తనను నాయకుడిగా ఎంపిక చేయాలని బీసీసీఐ పెద్దలకు వర్తమానం పంపించాడు. అయితే దానిని వారు పక్కన పెట్టారు. దీంతో అతడు తీవ్రమైన కలత చెందాడని ప్రఖ్యాత ఆంగ్ల పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక కథనంలో స్పష్టం చేసింది. “భారత క్రికెట్ కు మరింత ఉజ్వలమైన భవిష్యత్తు అందించాల్సి ఉంది. దీనికోసం యువ ప్లేయర్లను సపోర్ట్ చేయాలి. అలాంటప్పుడు గిల్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తున్నామని” విరాట్ కోహ్లీకి బీసీసీఐ పెద్దలు చెప్పినట్టు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక కథనం ప్రచురితమైంది.
Also Read: సీజ్‌ఫైర్ వద్ద: పాక్ తో ’భారత్ యుద్ధమే కావాలి
మరో 770 కావాలి
వన్డే, టి20 ఫార్మాట్ పక్కన పెడితే.. టెస్టులలో భారత జట్టు తరఫున పదివేల పరుగులు సాధించిన ఆటగాళ్లు ముగ్గురు మాత్రమే ఉన్నారు. ఈ ఘనతను ముందుగా సునీల్ గవాస్కర్ బద్దలు కొట్టాడు. ఆ తర్వాత సచిన్ ఆ రికార్డును చేదించాడు. అనంతరం రాహుల్ ద్రావిడ్ ఆ ఘనతను అందుకున్నాడు. ఈ రికార్డును అందుకోవాలంటే విరాట్ కోహ్లీకి మరో 770 రన్స్ అవసరం ఉన్నాయి. టెస్ట్ ఫార్మాట్లో.. ఇలాంటి రికార్డు దక్కించుకునే అవకాశం ముందున్నప్పటికీ.. రిటైర్మెంట్ అనడం కరెక్ట్ కాదని బీసీసీఐ పెద్దలు విరాట్ కోహ్లీతో చెప్పారట.. సుదీర్ఘ ఫార్మాట్లో ఒకేసారి రోహిత్, కోహ్లీ గనక శాశ్వతంగా దూరం జరిగితే అది జట్టుపై ఎఫెక్ట్ చూపిస్తుందని.. యంగ్ టీం కు సపోర్ట్ ఇవ్వాలని.. అవసరమైతే మైదానంలో కీ రోల్ ప్లే చేయాలని విరాట్ కోహ్లీకి బీసీసీఐ మేనేజ్మెంట్ సూచించిందట. అయితే విరాట్ కోహ్లీ నుంచి ఇంతవరకు ఎటువంటి స్పందన రాలేదని ప్రచారం జరుగుతుంది.. ఒకవేళ విరాట్ కోహ్లీ శాశ్వత వీడ్కోలు పలికితే.. ఆ ప్రభావం జట్టు మీద ఖచ్చితంగా ఉంటుంది. అయితే 2007 తర్వాత ఇంతవరకు ఇంగ్లాండ్ గడ్డపై భారత్ టెస్ట్ సిరీస్ గెలుచుకోలేదు. విరాట్ కోహ్లీ లాంటి సీనియర్ ఆటగాడు లేకుండా టీమిండియా ఆ ఘనత అందుకుంటుందా.. బౌన్సీ మైదానాలపై టీమిండియా యువ ఆటగాళ్లు ఒత్తిడి తట్టుకుంటారా.. అనే ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది. కెప్టెన్సీ ఇవ్వనంత మాత్రాన విరాట్ కోహ్లీ శాశ్వత వీడ్కోలు పలుకుతాడా? వద్దనుకున్న కెప్టెన్సీని అతడు ఎందుకు కావాలి అనుకుంటాడు? ఈ ప్రశ్నలకు కూడా సమాధానం లభించాల్సి ఉంది. మొత్తంగా చూస్తే ఈ రూమర్లకు చెక్ పడాలంటే విరాట్ కోహ్లీ నోరు విప్పాలి.. బీసీసీఐ పెద్దలు క్లారిటీ ఇవ్వాలి.