Homeక్రీడలుVirat Kohli Restaurant: హైదరాబాద్ వచ్చేసిన విరాట్ కోహ్లీ.. ఆయన రెస్టారెంట్ ఎక్కడ ప్రారంభించారంటే?

Virat Kohli Restaurant: హైదరాబాద్ వచ్చేసిన విరాట్ కోహ్లీ.. ఆయన రెస్టారెంట్ ఎక్కడ ప్రారంభించారంటే?

Virat Kohli Restaurant: ఇండియాలోనే కాదు.. వరల్డ్ లో ఆయన పేరు తెలియని వారు ఉండరు. క్రికెట్ అంటే తెలియని వారైనా సరే ఆయనను ఇట్టే గుర్తు పడతారు ఆయనే ‘విరాట్ కోహ్లి.’ సచిన్ క్రికెట్ కు గాడ్ ఫాదర్ అయితే.. విరాట్ కోహ్లి క్రికెట్ కు బాద్ షా. సరైన వయస్సులో పిచ్ పై అడుగుపెట్టిన విరాట్ ఇప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలుతున్నాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. ఆయన ఫుడ్ బిజినెస్ లోకి వచ్చాడన్న విషయం మనలో చాలా మందికి తెలియదు. ఆయన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెస్టారెంట్లను ఇండియాలో విస్తరిస్తున్నాడు. ఇందులో భాగంగానే హైదరాబాద్ కు కూడా వచ్చాడు.

విరాట్ కోహ్లీ తన కొత్త రెస్టారెంట్ ‘వన్8 కమ్యూన్’ ను హైదరాబాద్ సిటీకి తీసుకువచ్చాడు. హైటెక్ సిటీలోని హార్డ్ రాక్ కేఫ్ సమీపంలో ఉన్న ఆర్ ఎంజెడ్ ది లాఫ్ట్ ఇన్ నాలెడ్జ్ సిటీలో ఈ రెస్టారెంట్ ఏర్పాటు చేశాడు. ఈ రెస్టారెంట్ ఎంతో మంది సందర్శకులను ఆకర్షించడం ఖాయంగా కనిపిస్తుంది.

ఈ రెస్టారెంట్ ను కొహ్లీ శుక్రవారం (మే 24) ప్రారంభించాడు. రెస్టారెంట్ ప్రారంభానికి ముందు ముందు ఆయన తన ఇన్ స్టాలో స్నీక్ పీక్ ను పంచుకున్నాడు. ‘హాయ్ హైదరాబాద్, మీతో ఒక ఎగ్జయిటింగ్ న్యూస్ షేర్ చేయాలని నేను థ్రిల్లింగ్ గా ఉన్నా. మేము ఇప్పుడే హైటెక్ సిటీ నడిబొడ్డుకు చేరుకున్నాము, అండ్ మీ భోజన ఆచారాలు ఇప్పుడు సమం కాబోతున్నాయి! నా దృష్టిలో ‘వన్8 కమ్యూన్’ అనేది కేవలం ఒక ప్రదేశం మాత్రమే కాదు – ఇది ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడం, సంబంధాలను సృష్టించడం మరియు హైదరాబాద్ లో నిజమైన కమ్యూనిటీ భావనను నిర్మించే వేదిక. ‘మే 24 న మేము మా తలుపులు తెరుస్తున్నప్పుడు, మీరు కమ్యూనికేషన్ స్ఫూర్తిని అనుభవించడానికి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను.’ అని రాసుకున్నారు.

‘వన్ 8 కమ్యూన్’ ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తుంది, రుచికరమైన ఆహారం, క్రికెట్ వైబ్స్, సినిమాటిక్ ఆకర్షణ అన్నింటినీ ఒకే చోట అందిస్తుంది. ఈ వాతావరణం స్టైలిష్ గా, ఆహ్లాదకరంగా ఉంటుందని, ఆహార ప్రియులకు, క్రీడాభిమానులకు పర్ఫెక్ట్ గా ఉంటుందని నేను భావిస్తున్నాను’ అన్నారు.

విరాట్ ఏర్పాటు చేసిన ‘వన్ 8 కమ్యూన్’ దేశంలో విస్తరిస్తోంది. 2017 లో స్థాపించబడిన ఇది విజయవంతంగా ఢిల్లీ, ముంబై, పూణే, కోల్ కత్తా, బెంగళూరు వంటి ప్రధాన నగరాలకు విస్తరించింది. ఇప్పుడు సౌత్ లో బిగ్గెస్ట్ సిటీ అయిన హైదరాబాద్ కు వచ్చింది. విరాట్ అభిమానులే కాదు.. క్రికెట్ ప్రేమికులు కూడా వన్8 కమ్యూన్ ను ఓన్ చేసుకుంటారని తెలుస్తోంది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version