Love Me Twitter Talk: లవ్ మీ మూవీ ట్విట్టర్ టాక్: బేబీ హీరోయిన్ మ్యాజిక్ రిపీట్ చేసిందా? ఆడియన్స్ రెస్పాన్స్ ఇదే!

దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కిన లవ్ మూవీ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకుడు. ఈ యంగ్ డైరెక్టర్ ఓ భిన్నమైన ప్రేమ కథను ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం చేశాడు.

Written By: S Reddy, Updated On : May 25, 2024 8:58 am

Love Me Twitter Talk

Follow us on

Love Me Twitter Talk: గత ఏడాది విడుదలైన బేబీ చిత్రం ఒక సంచలనం. తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య సాహసోపేతమైన పాత్ర చేసింది. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా నటించారు. బేబీ మూవీతో ఓవర్ నైట్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న వైష్ణవి చైతన్యకు వరుస ఆఫర్స్ వచ్చాయి. తాజాగా ఆమె లవ్ మీ అంటూ ప్రేక్షకులను పలకరించింది. బేబీ అనంతరం వైష్ణవి చైతన్య నుండి వస్తున్న మూవీ కావడంతో సహజంగానే అంచనాలు ఏర్పడ్డాయి. దిల్ రాజు బంధువు ఆశిష్ హీరోగా నటించగా ఓ వినూత్న కాన్సెప్ట్ తో తెరకెక్కించారు.

లవ్ మీ మూవీ మే 25న వరల్డ్ వైడ్ విడుదల చేశారు. ఇప్పటికే యూఎస్ ప్రీమియర్స్ ముగిశాయి. మూవీ చూసిన ఆడియన్స్ తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. లవ్ మీ చిత్ర కథ విషయానికి వస్తే… ఒక దెయ్యం-హీరో మధ్య సాగే సస్పెన్సు డ్రామా. అసలు ఓ దెయ్యం వెనుక హీరో ఎందుకు పడుతున్నాడు. ఆ దెయ్యానికి, హీరోకి ఉన్న సంబంధం ఏమిటీ? ఈ ఘోస్ట్ అండ్ హ్యూమన్ లవ్ స్టోరీ ఎలా ముగిసింది అనేది కథ.

దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కిన లవ్ మూవీ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకుడు. ఈ యంగ్ డైరెక్టర్ ఓ భిన్నమైన ప్రేమ కథను ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం చేశాడు. ఆశిష్ నటన, వైష్ణవి చైతన్య గ్లామర్, ఎం ఎం కీరవాణి బీజీఎమ్ సినిమాకు హైలెట్ అని చెప్పాలి. కొంత మేర సస్పెన్సు క్రియేట్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఎవరీ దెయ్యం అనే ఓ ఆలోచన ప్రేక్షకుల మదిలో రన్ అవుతూ ఉంటుంది. కెమెరామెన్ పీసీ శ్రీరామ్ విజువల్స్ ఆకట్టుకుంటాయి.

మంచి పాయింట్ ని ఎంచుకున్న దర్శకుడు సిల్వర్ స్క్రీన్ పై మెప్పించే విధంగా మలచడంలో ఫెయిల్ అయ్యాడు. పేపర్ పై ఉన్న స్కిప్ట్ కి తెర రూపం ఇవ్వడంలో తడబడ్డాడు. సస్పెన్సు థ్రిల్లర్స్ కి స్క్రీన్ ప్లే ప్రధాన బలం. పట్టులేని స్క్రీన్ ప్లే ఆడియన్స్ ని ఎంగేజ్ చేయలేకపోయింది. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు మెప్పించినా పూర్తి స్థాయిలో సినిమా ఆకట్టుకోలేదు. అంచనాలు అందుకోలేకపోయారు అనే వాదన వినిపిస్తోంది. అయితే వీకెండ్ కి ఒకసారి చూసి ఎంజాయ్ చేయవచ్చు.