Virat Kohli: వరల్డ్ కప్ లో ఇండియా ఆడిన మొదటి మ్యాచ్ లోనే గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇండియా ఆస్ట్రేలియా తో ఆడిన మొదటి మ్యాచ్ లోనే ఘన విజయం సాధించి ఇండియా టీమ్ ఎంత పవర్ ఫుల్ టీమ్ అనేది మరోసారి ప్రపంచానికి తెలియజేసింది. అలాగే ఆస్ట్రేలియన్ బౌలర్లు మొదట్లో ఇండియన్ ప్లేయర్ అయిన రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ లను ముగ్గురిని కూడా డకౌట్ చేసి ఇండియన్ బ్యాట్స్ మెన్స్ మీద ఆస్ట్రేలియన్ బౌలర్లు కొంతవరకు సక్సెస్ అయినప్పటికీ వాళ్ల ఆనందాన్ని ఎక్కువ సేపు ఉండనివ్వ కూడదు అని అనుకున్న విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఇద్దరు కలిసి క్రీజ్ లోకి వచ్చి దాటి గా ఆడుతూ ఆస్ట్రేలియా టీమ్ కి గెలుపు అనే ఆశల మీద నీళ్లు చల్లారు…
ఇక ఒకసారి మ్యాచ్ లోకి వెళ్తే మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా టీమ్ 199 పరుగులు చేసి అలౌట్ అయిపోగా, 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియన్ టీం మొదట్లోనే మూడు వికెట్లు కోల్పోయి చాలా దారుణమైన స్థితిలో ఉన్నప్పుడు అది చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఏంటి ఇండియా టీమ్ ఇలాంటి పరిస్థితుల్లో ఉంది అని అందరూ అనుకున్నారు.కానీ ఒకసారి క్రీజ్ లోకి కింగ్ కోహ్లీ, రాహుల్ ఇద్దరు వచ్చాక వికెట్ పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే స్కోర్ ని నిధానంగా బిల్డ్ చేసే ప్రయత్నం చేశారు. అందులో సక్సెస్ కూడా అయ్యారు.ఆస్ట్రేలియన్ బౌలర్ లను దీటుగా ఎదుర్కొంటూనే ఎక్కడ కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఒక గ్రేట్ ఇన్నింగ్స్ ని ఆడారనే చెప్పాలి.ప్రస్తుతం ఇద్దరూ కలిసి ఐదో వికెట్ కి 145 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దాంతో ఇండియా టీంకి గెలుపు ఈజీ అయింది. విరాట్ కోహ్లీ, కే ఎల్ రావు ఇద్దరూ కూడా హాఫ్ సెంచరీ చేశారు. అందులో కోహ్లీ 85 పరుగులు చేసి అవుట్ అవ్వగా, కేఎల్ రాహుల్ మాత్రం చివరి వరకు ఉండి హార్థిక్ పాండ్యా తో కలిసి ఇండియా మ్యాచ్ ని గెలిపించాడు.ఇక లాస్ట్ లో సిక్స్ కొట్టి మ్యాచ్ ని గెలిపించిన రాహుల్ 97 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
అయితే ఈ మ్యాచ్ లో కోహ్లీ తన ఎక్స్పీరియన్స్ తో ఆడుతూ తన కో ప్లేయర్ అయిన రాహుల్ ని కూడా తనకు బాల్ టు బాల్ ఎలా ఆడాలో చెబుతూ ఇద్దరు కలిసి ఒక పెద్ద ఇన్నింగ్స్ ని ఆడారనే చెప్పాలి. ఇలాంటి కీలక సమయాల్లో మ్యాచ్ ని అడటం అంటే అది ఒక్క కోహ్లీ వల్ల మాత్రమే అవుతుంది అని కోహ్లీ మరొకసారి ప్రూవ్ చేశాడు. ప్రపంచ దేశాల్లో ఉన్న ప్లేయర్లకి ఇండియన్ ప్లేయర్లకి మధ్య ఉన్న తేడా ఏంటి అంటే మిగితా టీమ్ వాళ్ళవి మొదట్లోనే మూడు వికెట్లు పోయాయి అంటే ఆ తర్వాత ఆడే ప్లేయర్లకి ప్రెజర్ ఎక్కువై ఆ ప్రెజర్ ని కంట్రోల్ చేసుకోలేక అవుట్ అయిపోతూ ఉంటారు కానీ ఇండియన్ టీం ప్లేయర్లు మాత్రం ఎంత ప్రెజర్ ఉన్న అండర్ ప్రెజర్ లో ఆడటం అలవాటైపోయి ఉన్నారు.ఇక ముఖ్యంగా కోహ్లీ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాలి చేజింగ్ లో ఆయన చేజ్ చేసిన మ్యాచులు చాలా ఎక్కువ గా ఉండటమే కాకుండా ఆయన తన మార్క్ ఇన్నింగ్స్ తో అదరగొడుతాడు…ఇక రాహుల్ చివర్లో సిక్స్ కొట్టి ఆ మ్యాచ్ ని గెలిపించాడు.ఆ సిక్స్ తో ఆయన స్కోర్ 97 పరుగులు చేశాడు.ఇక ఈ మ్యాచ్ చూసిన వాళ్ళు ఇంకా ఒక నాలుగు పరుగులు ఉంటే రాహుల్ సెంచరీ చేసుకునేవాడు అంటూ ఆ మ్యాచ్ చూసిన చాలా మంది అనుకుంటున్నారు…
ఇక ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా టీమ్ 49.3 ఓవర్లలో 199 పరుగులు చేసి ఆలౌట్ అయింది. వాళ్ల ప్లేయర్ల లో డేవిడ్ వార్నర్ 41 పరుగులు చేయగా, స్టీవ్ స్మిత్ 46 పరుగులు చేశాడు ఇక వీళ్ళ తర్వాత స్టార్క్ కూడా 28 రన్స్ చేశాడు…దాంతో ఆస్ట్రేలియా 49.3 బాంతులకి 199 రన్స్ చేసింది…ఇక మన బౌలర్లు అందరూ కూడా సమిష్టి గా రాణించి ఆస్ట్రేలియా టీమ్ ని కోలుకోలేని దెబ్బ కొట్టారు.ముఖ్యంగా మన బౌలర్లలో రవీంద్ర జడేజా 3 వికెట్లు తీశాడు, అలాగే కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీశారు, ఇక హార్దిక్ పాండ్యా, సిరాజ్,అశ్విన్ లు తలో వికెట్ తీశారు… మొత్తానికైతే ఇండియా ఈ మ్యాచ్ లో ఘన విజయాన్ని సాధించింది.