
Virat Kohli Birthday: ఆటలో అతడో నేర్పరి. వ్యూహాలు రచించడంలో దిట్ట. ప్రత్యర్థిని కట్టడి చేయడంలో మేటి. కొండంత లక్ష్యాన్నైనా అలవోకగా ఛేదించడం అలవాటే. ఫీల్డింగ్ లో కూడా వేగంగా కదలడం, కెప్టెన్ గా అనేక అలవోక విజయాలు దక్కించుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి గురించి ఎంత చెప్పినా తక్కువే. నేడు ఆయన జన్మదినం సందర్భంగా ఆయన గురించి కొన్ని నిజాలు. అయితే ఒక్క ప్రపంచ కప్ కూడా గెలవకుండానే దిగిపోతున్న కెప్టెన్ గా రికార్డు సాధించాడు.
2016లో ఐపీఎల్ లో 207 మ్యాచ్ లాడి ఐదు శతకాలు, 42 అర్థ శతకాలు పూర్తి చేశాడు. 2021లో 15 వన్డేలాడి 405 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అన్ని ఫార్మాట్లలో 443 మ్యాచుల్లో 55కి పైగా సగటు, సుమారు 80 స్టెక్ రేట్ తో 23,159 పరుగులు చేశారు. 70 శతకాలు, 118 అర్థశతకాలు, 2301 బౌండరీలు, 238 సిక్సర్లు కొట్టారు. తన బ్యాట్ తోనే సమాధానం చెప్పడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. కానీ ఇటీవల కాలంలో తరచూ ఫెయిల్ కావడంతో విమర్శలు కూడా ఎక్కువగానే వస్తున్నాయి.
బ్యాట్స్ మెన్ గా తిరుగులేని రికార్డు ఉన్న కోహ్లిపై ఈ సమయంలో విమర్శలు రావడం సరైంది కాదనే అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతోంది. పలు టోర్నీల్లో తనదైన శైలిలో అదరగొట్టే కెప్టెన్ టీ20 ప్రపంచకప్ లో మాత్రం విఫలం కావడం సంచలనం సృష్టిస్తోంది. టీమిండియా సాధించిన విజయాల్లో అరుదైన రికార్డులు సొంతం చేసుకున్న ఆయన రెండు ఆటల్లో వెనుకబడగా సామాజిక మాధ్యమాల్లో విమర్శలు రావడం తెలిసిందే.
టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా సెమీస్ చేరడం కష్టంగా మారింది. మిగిలిన జట్ల సంగతి ఎలా ఉన్నా ప్రస్తుతం టీమిండియాపై భారీ ఆశలు పెంచుకున్న అభిమానులకు నిరాశే మిగులుతోంది. పాకిస్తాన్, న్యూజీలాండ్ జట్లపై అపజయం పాలు కావడంతో ఆటగాళ్ల వ్యక్తిగత జీవితాలపై విమర్శలు రావడం గమనార్హం. దీంతో విరాట్ కోహ్లికి క్రికెట్ అభిమానులు అండగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది.
Also Read: ఇక అన్ని మ్యాచ్ లు గెలవాల్సిందే..!లేకుంటే..?