Homeక్రీడలుVirat Kohli: గిల్లితే గిల్లేస్తాడు.. కోహ్లి ఏమిటా అగ్రెసివ్ బాబూ..!

Virat Kohli: గిల్లితే గిల్లేస్తాడు.. కోహ్లి ఏమిటా అగ్రెసివ్ బాబూ..!

Virat Kohli: క్రికెట్ లో విరాట్ కోహ్లీ ఎంత అగ్రెసివ్ గా ఉంటాడో అందరికీ తెలుసు. ప్రతి మ్యాచ్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాడు విరాట్ కోహ్లీ. విజయమే లక్ష్యంగా సర్వశక్తులను ఒడ్డేందుకు వెనుకాడడు. ఆ తత్వమే విరాట్ కోహ్లీని అభిమానులు అమితంగా అభిమానించేలా చేస్తోంది. తనకి గౌరవం ఇచ్చే వారి పట్ల అంతే గౌరవంగా ఉంటాడు. తన పట్ల దురుసుగా ప్రవర్తించే వారికి అంతే దురుసుగా సమాధానాన్ని ఇస్తాడు. సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ – రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య చిన్న స్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో అటువంటి ఆసక్తికరమైన ఘటనే చోటుచేసుకుంది.

విరాట్ కోహ్లీ క్రికెట్ లో దూకుడుగా అగ్రెసివ్ గా ఉండే ప్లేయర్. ఆటలో దూకుడుతోపాటు మైదానంలోను అత్యంత దూకుడుగా వ్యవహరిస్తుంటాడు. ఐపీఎల్ లోను అదే దూకుడును కనబరుస్తున్నాడు విరాట్ కోహ్లీ. లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ మైదానం మొత్తం కలియతిరుగుతూ హుషారుగా కనిపించాడు. వికెట్ పడిన ప్రతిసారి అగ్రెసివ్ యాటిట్యూడ్ తో అభిమానులను ఎంతగానో అలరించాడు.

అతిగా స్పందించిన లక్నో జట్టు ప్లేయర్లు, మెంటార్ గంభీర్..

గత నెల పదో తేదీన లక్నో – బెంగుళూరు జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్లో 212 పరుగులు భారీ స్కోర్ చేసినా కూడా లక్ష్యాన్ని కాపాడుకోవడంలో ఆర్సీబీ జట్టు విఫలమైంది. స్టోయినిస్, పూరన్ చెలరేగడంతో లక్నో అద్భుతమైన విజయాన్ని సాధించింది. లక్నో జట్టు గెలిచిన, ఆర్సీబీ జట్టు ఓడిపోయిన పెద్దగా ఇష్యూ ఉండేది కాదు. మ్యాచ్ చివరి బంతికి ఒక్క పరుగు అవసరమైన స్థితిలో.. హర్షల్ పటేల్ వేసిన బంతిని ఆవేష్ ఖాన్ మిస్ చేశాడు. వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ కూడా దాన్ని సరిగా అందుకోలేకపోయాడు. దీంతో ఆవేష్ ఖాన్ సింగిల్ పూర్తి చేశాడు. ఆ పరుగు పూర్తి చేసిన వెంటనే తన హెల్మెట్ తీసి నేలకేసి బాది అవేష్ ఖాన్ సెలబ్రేట్ చేసుకున్నాడు. అప్పుడు నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న రవి బిష్ణోయి కూడా కేకలు వేస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలోకి పరిగెత్తుకుంటూ వచ్చిన గంభీర్.. చిన్న స్వామి స్టేడియంలో బెంగుళూరు జట్టు అభిమానుల వైపు చూసి నోటిపై వేలు ఉంచుకొని.. సైలెంట్ అన్నట్టుగా సైగలు చేశాడు. ఇదంతా చూసిన అభిమానులు కూడా లక్నో టీమ్ మరీ అతి చేస్తోందంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంతకుముందు భారీ ఇన్నింగ్స్ ఆడిన పూరన్ కూడా ఇలాంటిదే ఒక పని చేశాడు. అతను అవుట్ అయ్యే సమయానికి లక్నో చేజింగ్ దాదాపు అదుపులోకి వచ్చేసింది. ఈ క్రమంలో మైదానాన్ని వీడుతూ చిన్నస్వామి స్టేడియంలోని ఆర్సీబీ సపోర్టర్లకు ఫ్లైయింగ్ కిస్సులు పంపించాడు ఈ విండీస్ ప్లేయర్.

గట్టిగా బదులిచ్చిన కోహ్లీ..

గత మ్యాచ్ లో లక్నో ప్లేయర్లందరూ రెచ్చిపోయి అతిగా రెస్పాండ్ అయితే.. సోమవారం జరిగిన మ్యాచ్ లో బెంగుళూరు జట్టు ప్లేయర్ విరాట్ కోహ్లీ మాత్రమే అతిగా స్పందించి వారికి గట్టిగా రిప్లై ఇచ్చాడు. ఆయుష్ బదోని క్యాచ్ అందుకోగానే నోటిఫై వేలుంచుకుని లక్నో ఫ్యాన్స్ సైలెంట్ గా ఉండాలని వార్నింగ్ ఇచ్చాడు. అలాగే, క్యాచ్ అందుకున్న ప్రతిసారి ఎగ్రిసివ్ గా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. దంతా చూసిన అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. చాలా కాలం క్రితం చూసిన ఎగ్రిసివ్ కోకిలేని మళ్లీ చూస్తున్నామని సామాజిక మాధ్యమాలు వేదికగా కామెంట్లు చేస్తున్నారు. గత మ్యాచ్ లో రెచ్చిపోయిన లక్నో జట్టు ప్లేయర్లకు, మెంటార్ గౌతమ్ గంభీర్ కు సరైన రీతిలో సమాధానం చెప్పాడని పలువురు అభిమానులు కోహ్లీని మెచ్చుకుంటున్నారు. ఆటతోపాటు నోటితోనూ దూకుడుగా ఉండే కోహ్లీతో పెట్టుకుంటే ఇలానే ఉంటుందని పలువురు హెచ్చరిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular