Homeక్రీడలుVirat Kohli Viral Like: యూ చిలిపీ విరాట్.. కోహ్లీ వేషాలపై ఆ హాట్ బ్యూటీ...

Virat Kohli Viral Like: యూ చిలిపీ విరాట్.. కోహ్లీ వేషాలపై ఆ హాట్ బ్యూటీ ఏమన్నదంటే..

Virat Kohli Viral Like: మన దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా విరాట్ కోహ్లీకి డై హార్డ్ కోర్ ఫాన్స్ ఉన్నారు. మైదానంలో అతని అద్భుతమైన ఆట తీరు చూసి.. చివరికి క్రికెట్ తో సంబంధం లేని వారు కూడా విరాట్ కోహ్లీకి అభిమానులుగా మారిపోయారు. విరాట్ కోహ్లీ ఆట తీరు చూసి.. అతడి ఆటిట్యూడ్ చూసి ఎంతోమంది అతడిని అనుసరిస్తున్నారు. సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీకి కోట్లల్లో ఫాలోవర్స్ ఉన్నారు.

విరాట్ కోహ్లీకి విపరీతమైన క్రేజ్ వల్ల సోషల్ మీడియాలో అతడి హవా మామూలుగా ఉండదు. ఒక పోస్ట్ పెడితే చాలు అతడు కోట్లల్లో వసూలు చేస్తాడు. కంపెనీల ప్రకటనలకు సంబంధించిన వీడియోలను అతడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు. ఆ వీడియోలు క్షణాల్లోనే కోట్లాది వీక్షణలను సొంతం చేసుకుంటాయి. విరాట్ కోహ్లీ సాధారణంగా ఎవరి పోస్టు కు లైక్ చేయడం. కామెంట్ అంతకంటే చేయడు.

ఇటీవల అతడు లిజ్ లాజ్ జర్మనీ ఇన్ఫ్లుయెన్సర్ ఫోటోకు లైక్ చేశాడు. దీంతో ఆమె ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయింది. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సోషల్ మీడియాలో ఆమె గురించి విస్తృతంగా చర్చ జరగడం మొదలైంది. దీనికి తోడు గ్లోబల్ మీడియా కూడా ఆమె గురించి ప్రత్యేక కథనాలను ప్రసారం చేసింది.. దీంతో లిజ్ లాజ్ గురించి గూగుల్ లో చాలామంది సెర్చ్ చేస్తున్నారు.

విరాట్ వల్ల తనకొచ్చిన పేరును లిజ్ లాజ్ ఆస్వాదిస్తోంది. ” విరాట్ నా ఫోటోకు లైక్ చేశాడు. నాకు ఆనందం కలిగిస్తుంది. దీనివల్ల సోషల్ మీడియాలో నేను వైరల్ అయిపోయాను. నా ఫోటోకు లైక్ కొట్టడంలో ఆయనకు ఎటువంటి దురుద్దేశం లేదు. కాకపోతే చాలామంది దీనిని తప్పుగా అర్థం చేసుకున్నారు. అలా ఆలోచించడం సరికాదు. అతడు ఒక పేరు మోసిన ఆటగాడు. అటువంటి వ్యక్తి నా ఫోటోను లైక్ చేయడం గొప్ప విషయం గా భావిస్తున్నాను. ఈ హోదాను నేను ఆస్వాదిస్తున్నానని” లిజ్ లాజ్ పేర్కొంది.

 

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version