T20 World Cup 2024: అంబటి రాయుడు అక్కసుతో అంటాడు గాని.. 8 టీ20 వరల్డ్ కప్ లలో విరాట్ కోహ్లీనే తోపు..

2007లో టి20 వరల్డ్ కప్ ప్రారంభమైన సీజన్లో.. ఆస్ట్రేలియా ఆటగాడు మాథ్యూ హెడెన్ 265 రన్స్ చేశాడు. అప్పట్లో ఆ పరుగుల గురించి మహా గొప్పగా చెప్పుకునేవారు.

Written By: Anabothula Bhaskar, Updated On : May 30, 2024 8:22 am

T20 World Cup 2024

Follow us on

T20 World Cup 2024: “ఆరెంజ్ క్యాప్ లతో ఉపయోగం లేదు. వ్యక్తిగత పరుగుల కోసం పాకులాడేవారు జట్టును విజేతలుగా నిలపలేరు.. వ్యక్తిగతంగా ఆడే కంటే.. జట్టు ప్రయోజనాల కోసం ఆడితే బాగుంటుంది” ఇవీ ఇటీవల విరాట్ కోహ్లీని ఉద్దేశించి అంబటి రాయుడు చేసిన విమర్శలు. ఆఫ్ కోర్స్ అంబటి రాయుడు ఎప్పటి నుంచో విరాట్ ను టార్గెట్ చేశాడు. చేస్తూనే ఉంటాడు. దాని వెనుక పగ ఉంది, కోపం కూడా ఉంది. అంబటి రాయుడు మాటలకేంగాని.. 2007 నుంచి మొదలైన టి20 వరల్డ్ కప్ లో.. ఇప్పటివరకు 8 సార్లు టోర్నీలు జరిగాయి. ఇన్ని టోర్నీలలో విరాట్ కోహ్లీనే తోపు బ్యాటర్ గా ఉన్నాడు.

2007లో టి20 వరల్డ్ కప్ ప్రారంభమైన సీజన్లో.. ఆస్ట్రేలియా ఆటగాడు మాథ్యూ హెడెన్ 265 రన్స్ చేశాడు. అప్పట్లో ఆ పరుగుల గురించి మహా గొప్పగా చెప్పుకునేవారు.. కేవలం రెండంటే రెండు సంవత్సరాల లోనే.. ఆ రికార్డును శ్రీలంక ఆటగాడు తిలక్ రత్నే దిల్షాన్ బ్రేక్ చేశాడు. 2009లో జరిగిన టి20 వరల్డ్ కప్ దిల్షాన్ ఏగంగా 317 పరుగులు చేశాడు.. ఆ మరుసటి సంవత్సరం జరిగిన టి20 వరల్డ్ కప్ లో శ్రీలంక ఆటగాడు మహేళ జయవర్ధనే 302 రన్స్ చేశాడు.

ఇక 2012లో ఆస్ట్రేలియా ఆటగాడు వాట్సన్ 249 రన్స్ చేశాడు.. 2014 నుంచి విరాట్ కోహ్లీ ప్రతాపం మొదలైంది. ఆ సంవత్సరం జరిగిన టి20 వరల్డ్ కప్ లో ఏకంగా 319 రన్స్ చేసి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. అప్పటివరకు 317 పరుగులు చేసిన దిల్షాన్ రికార్డును చాలామంది గొప్పగా చెప్పుకునేవారు. కానీ అతడి రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొట్టాడు. ఇక 2016 సీజన్ లో బంగ్లాదేశ్ ఆటగాడు ఇక్బాల్ అనూహ్యంగా 295 రన్స్ చేశాడు. పెద్ద పెద్ద జట్ల ఆటగాళ్లకు సాధ్యం కాని రికార్డును అతడు తన సొంతం చేసుకున్నాడు. టి20 మాత్రమే కాదు, ఐసీసీ నిర్వహించిన ఏ మెగా టోర్నీ లోనూ మరే బంగ్లాదేశ్ ఆటగాడు ఈ స్థాయిలో ఆడలేదు. 2021 సీజన్లో పాకిస్తాన్ బ్యాటర్ బాబర్ ఆజాం 303 రన్స్ చేశాడు.. పాకిస్తాన్ తరపున టి20 వరల్డ్ కప్ లో తొలిసారి అత్యుత్తమ పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇక 2022లో జరిగిన టి20 వరల్డ్ కప్ లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ 296 రన్స్ చేశాడు. ఆ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.. ఇప్పటివరకు ఎనిమిది సార్లు టి20 వరల్డ్ కప్ లు జరుగగా.. అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రెండుసార్లు ఆ ఘనతను సృష్టించాడు. ఇప్పటివరకు టి20 వరల్డ్ కప్ లో హైయెస్ట్ స్కోర్ సాధించిన ఆటగాడిగా విరాట్ కోహ్లీకి రికార్డు ఉంది.. మరి ఈ సీజన్లో విరాట్ కోహ్లీ తన బ్యాటింగ్ పరాక్రమాన్ని ఎలా ప్రదర్శిస్తాడో చూడాలి . ఇటీవలి ఐపిఎల్ లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు.