Virat Kohli: సైన్యం చేస్తున్న పనికి ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. కొన్ని దేశాలు గోడమీది పిల్లి వాటం లాగా ఉన్నప్పటికీ.. అంతిమంగా భారత్ చేస్తున్న పనికి ప్రపంచవ్యాప్తంగా సమర్ధన లభిస్తోంది. మనతో ఉప్పు నిప్పులాగా ఉండే చైనా సైతం.. ఉగ్రవాదంపై జరుపుతున్న పోరులో తన వంతుగా సహకరిస్తానని భారత్ కు హామీ ఇస్తోంది.. అంతేకాదు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని విడిచి పెట్టాలని సూచిస్తోంది.. ఇక మన దేశంలో ప్రముఖులు సైన్యం చేస్తున్న యుద్ధానికి మద్దతు ప్రకటిస్తున్నారు. తమవంతుగా సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు. దేశం కోసం ఏమైనా చేస్తామని.. సైన్యానికి అండగా ఉంటామని పేర్కొంటున్నారు. మనదేశంలో ఉన్న అపర కుబేరుల నుంచి.. సామాన్య మానవుల వరకు సైన్యం చేస్తున్న పనికి మద్దతు లభిస్తోంది. పాకిస్తాన్ పని ఇప్పుడే పెట్టాలని.. ఉగ్రవాదాన్ని ఇప్పుడే తుడిచి పెట్టాలని.. అప్పుడే మన దేశం సుఖశాంతులతో వర్ధిల్లుతుందని.. సౌబ్రాతృత్వంతో కొత్త కాంతులు వెదజల్లుతోందని పేర్కొంటున్నారు.. ఇక క్రికెటర్లు కూడా మన సైన్యానికి అండగా ఉంటున్నారు. ఈ కష్టకాలంలో సైన్యం చేస్తున్న పనులకు సెల్యూట్ చేస్తున్నారు. ఈ జాబితాలో టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా చేరిపోయాడు. సామాజిక మాధ్యమాల వేదికగా అతడు తన అభిప్రాయాన్ని సైన్యం చేస్తున్న పని పై వ్యక్తం చేశాడు.
Also Read: పాక్ కు మరో బ్లాక్ డే.. వణికిపోతున్న ప్రజలు
గర్వంగా ఉంది
సామాజిక మాధ్యమాల లో విరాట్ కోహ్లీ ఒక స్టోరీ పోస్ట్ చేశాడు. అందులో ప్రతి వాక్యం కూడా భారత సైన్యం త్యాగాన్ని, గొప్పతనాన్ని, సేవానిరతిని వెల్లడించే విధంగా ఉంది..” మీ త్యాగం గొప్పది. మీరు చేస్తున్న పని అచంచలమైనది. మీ వల్లే మేము ఇలా ఉన్నాం. మీరు చేస్తున్న పని వల్లే మేము ఇలా ఉండగలుగుతున్నాం. ఇంతటి క్లిష్ట సమయంలో మీకు మేము అండగా ఉంటాం. మీ ధైర్య సాహసాల వల్లే దేశం ప్రపంచ దేశాల ముందు సరి కొత్తగా కనిపిస్తోంది. మీ సాహసానికి.. ధైర్యానికి జోహార్లు.. మీ సేవానిరతికి హాట్సాఫ్. మీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంత వివరించినా తక్కువే. దేశాన్ని గొప్పగా ఉంచడంలో.. దేశాన్ని అగ్రస్థానంలో ఉంచడంలో మీరు ఎన్నో త్యాగాలు చేస్తుంటారు. చివరికి మీ కుటుంబాలకు కూడా దూరమవుతుంటారు.. ఇలాంటి మీరు మా దేశానికి సంబంధించి ఇప్పటికి హీరోలే” అంటూ విరాట్ కోహ్లీ తన ఇన్ స్టా గ్రామ్ స్టోరీ లో పేర్కొన్నాడు. కాగా విరాట్ కోహ్లీ సైన్యానికి సంబంధించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనం కలిగిస్తున్నాయి.. భారత దేశ సైన్యాన్ని అతడు కీర్తిస్తూ చేసిన వ్యాఖ్యలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. విరాట్ చేసిన వ్యాఖ్యలు సైన్యంలో మరింతగా ధైర్యాన్ని నింపేలా ఉన్నాయని.. ఇలాంటి క్లిష్ట సమయంలో సెలబ్రిటీలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల సైన్యంపై సామాన్యులకు మరింత నమ్మకం పెరుగుతుందని నెటిజన్లు పేర్కొంటున్నారు.
View this post on Instagram