Homeక్రీడలుక్రికెట్‌Virat Kohli Gift To Vaibhav Suryavanshi: డియర్ వైభవ్.. సూర్యవంశీకి విరాట్ కోహ్లీ హార్ట్...

Virat Kohli Gift To Vaibhav Suryavanshi: డియర్ వైభవ్.. సూర్యవంశీకి విరాట్ కోహ్లీ హార్ట్ టచింగ్ గిఫ్ట్.. వైరల్

Virat Kohli Gift To Vaibhav Suryavanshi: అది గౌహతి మైదానం. వర్షం కురిసింది.. పిచ్ నుంచి బంతికి ఆశించినత స్థాయిలో సపోర్ట్ లభించడం లేదు. అలాగని బంతి బ్యాట్ మీదికి రావడం లేదు. ఇటువంటి పరిస్థితులు ఉన్నచోట మిగతా బ్యాటర్లకు ఇబ్బంది ఉంటుంది. కానీ విరాట్ కోహ్లీకి అటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే అతడు మానవాతీతుడు. ఎలాంటి మైదానం మీద నైనా సరే అతడు బ్యాటింగ్ చేస్తాడు. గౌహతి మైదానం మీద కూడా 16 బంతులలో 32 పరుగులు చేశాడు. ఇందులో ఏడు ఫోర్లు ఉన్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. విరాట్ కోహ్లీ కూడా తన ఇన్నింగ్స్ ను భారీ స్కోర్ లాగా మలచలేకపోయాడు.

అంతటి విరాట్ కోహ్లీకి కూడా సాధ్యం కాని ఘనతను 15 సంవత్సరాల వైభవ్ సూర్య వంశీ సొంతం చేసుకున్నాడు. విరాట్ కోహ్లీకి మించి బ్యాటింగ్ చేశాడు.. 26 బంతుల్లోనే 78 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. దీనినిబట్టి సూర్యవంశీ బ్యాటింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. హేజిల్ వుడ్ నుంచి మొదలు పెడితే కృణాల్ పాండ్యా వరకు ఎవరినీ వదిలిపెట్టలేదు సూర్య వంశీ.. సూర్యవంశీ అలా బ్యాటింగ్ చేస్తూ ఉండడంతో.. బెంగళూరు బౌలర్లు, ఫీల్డర్లు చూస్తూ ఉండిపోయారు. ఇందులో విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు.

బెంగళూరు విధించిన 202 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ కేవలం 20 ఓవర్లలోనే ఫినిష్ చేసిందంటే దానికి ప్రధాన కారణం సూర్య వంశీ. యశస్వి జైస్వాల్ (13) త్వరగానే అవుట్ అయినప్పటికీ. జురెల్ తో కలిసి సూర్య వంశీ రెండో వికెట్ 37 బంతుల్లోనే 108 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇదే దూకుడులో 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. 15 సంవత్సరాల వయసులోనే 15 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా సూర్య వంశీ సరికొత్త రికార్డు సృష్టించాడు.. బెంగళూరు మీద రాజస్థాన్ గెలిచిన తర్వాత.. విరాట్ కోహ్లీ స్పందించాడు. ముఖ్యంగా వైభవ్ సూర్య వంశీ ని దగ్గరికి తీసుకున్నాడు. ఆలింగనం చేసుకున్నాడు. గట్టోడివి.. బాహుబలి వి.. బలమైన ఇన్నింగ్స్ ఆడిన ఆటగాడివి అంటూ పొగిడాడు.

విరాట్ కోహ్లీ ఆటగాళ్లను గుర్తించడంలో ముందు వరుసలో ఉంటాడు. వారి ప్రతిభ బయటపడినప్పుడు అభినందిస్తుంటాడు. దేశీ ప్లేయర్లు మాత్రమే కాదు.. విదేశీ ప్లేయర్లను కూడా అతడు ప్రోత్సహిస్తుంటాడు. గతంలో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లకు బ్యాట్ లను అందించాడు. ఆటలో టెక్నిక్.. పరుగులు తీయడంలో వేగం.. వీటన్నిటిని నేర్పిస్తుంటాడు. అందువల్లే విరాట్ కోహ్లీ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అని పిలుస్తుంటారు. ఇప్పుడు వైభవ్ విషయంలో కూడా దానిని మరోసారి నిరూపించుకున్నాడు విరాట్. సూర్య వంశీ ని విరాట్ ఆ లింగనం చేసుకోవడం గొప్ప విషయమని.. అది అతడికి లభించిన జీవితకాల పురస్కారం అని అభిమానులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular