Virat Kohli Dance: బ్రిటీష్ గడ్డపై బ్రిటన్ వాసులను కొడితే ఆ మజానే వేరు. ఎందుకంటే భారత్ ను తన కబంధ హస్తాల్లో దాదాపు 200 సంవత్సరాలకు పైగా మగ్గించి మనల్ని హింసించిన ఇంగ్లండ్ జాతీయులపై ఆధిపత్యం ఎప్పుడూ భారతీయులకు ప్రత్యేకమే.. ఇప్పుడు అలాంటి అద్భుతాన్నే సాధించారు మనోళ్లు.
ఇంగ్లండ్ లోని బర్మింగ్ హామ్ లో ఇంగ్లండ్ జట్టును 49 పరుగుల తేడాతో ఓడించి ఇంగ్లండ్ తో జరిగిన మూడు మ్యాచ్ ల సిరీస్ లో రెండో టీ20లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. ఈ విజయంతో 2-0 తేడాతో ఇంగ్లండ్ గడ్డపై ఇంగ్లండ్ ను ఓడించి టీమిండియా చరిత్ర సృష్టించింది. ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే టీ20 సిరీస్ ను కైవసం చేసుకుంది.
Also Read: Ethanol Fuel:5 ఏళ్లలో దేశంలో పెట్రోల్ వాహనాలు ఉండవు.. కేంద్రం మరో సంచలనానికి తెరతీస్తోందా?
రెండో టీ20లో మొదట టాస్ ఓడి భారత జట్టు బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 170/8తో భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. ఆ తర్వాత బౌలర్లు మెరుస్తూ ఆతిథ్య జట్టును మరో మూడు ఓవర్లు మిగిలి ఉండగానే కేవలం 121 పరుగులకే ఆలౌట్ చేశారు.
ఈ టీ20లో విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, రవీంద్రా జడేజా వంటి హేమాహేమీలు జట్టులోకి వచ్చారు. మొదటి మ్యాచ్లో వీరికి విశ్రాంతినిచ్చారు. బుమ్రా, పంత్, జడేజా కీలకమైన సహకారాన్ని అందించగా.. బ్యాట్ తో కోహ్లీ విఫలమయ్యారు. వన్ డౌన్ లో వచ్చిన కోహ్లీ 1 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. కోహ్లీ ఎప్పటిలాగే మరోసారి విఫలమయ్యాడు.
అయితే బ్యాటింగ్ లో విఫలమైన విరాట్ కోహ్లీ లాంగ్ ఆన్ లో బౌండరీ వద్ద మాత్రం ఫీల్డింగ్ చేస్తూ ప్రేక్షకులను అలరించాడు. వారిని ఉర్రూతలూగించాడు. అభిమానులతో కలిసి డ్యాన్స్ కూడా చేశాడు.
ఇక ఈ మ్యాచ్ లో భారత బౌలర్ భువనేశ్వర్ కీలకమైన తొలి మూడు వికెట్లు తీసి భారత విజయానికి బాటలు వేశాడు. ఓపెనర్లు జాసన్ రాయ్, ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ లను తొలి ఓవర్లలోనే ఔట్ చేసి భారత్ కు శుభారంభం అందించాడు. ఆ తర్వాత చాహల్ 2 వికెట్లతో చెలరేగడంతో 55-5 వికెట్లతో ఇంగ్లండ్ పీకల్లోతుకష్టాల్లో పడింది. 121 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత బ్యాటింగ్ లో 29 బంతుల్లోనే జడేజా 46 పరుగులు చేయడంతో భారత్ 170-8 పరుగుల భారీ స్కోరు చేసింది.
Also Read:Conocarpus Plant: సండే స్పెషల్: భారత్-పాకిస్తాన్ లను భయపెడుతున్న ఆ మొక్క కథేంటి?
Virat Kohli entertaining the crowd with his dance 😊🇮🇳 pic.twitter.com/qGzWdQwU1q
— MOHIT SHUKLA (@MohitShukla1030) July 9, 2022