Virat Kohli Instagram: సోషల్ మీడియా వచ్చిన తర్వాత సెలబ్రిటీలు అభిమానులతో ఎంతో దగ్గరగా ఉంటూ తమకు సంబంధించిన అన్ని ముచ్చట్లు షేర్ చేసుకుంటారు. అయితే వాళ్లు పెట్టే ఒక్కొక్క పోస్ట్ కి కొన్ని కోట్లల్లో సంపాదిస్తున్నారు అని మీకు తెలుసా? నిజమండి బాబు.. సెలబ్రిటీస్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పెట్టే ఒక్క పోస్ట్ కి వాళ్లకు కొన్ని లక్షల రూపాయల్లో ఇన్కమ్ వస్తుంది.
ప్రస్తుతం ఇండియన్ సెలబ్రిటీస్ లో పెట్టే ప్రతి పోస్ట్ కి టాప్ మోస్ట్ అమౌంట్ తీసుకునే వ్యక్తి భారత్ టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. అతని ఇన్స్టా అకౌంట్లో 256 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. కోహ్లీ పెట్టిన ఏ పోస్ట్ అయినా సరే వితిన్ సెకండ్స్ వైరల్ అవుతుంది. కోహ్లీకి ఉన్నటువంటి ఫాలోవర్స్ లిస్ట్ ఇండియాలో మరి ఏ ఇతర సెలబ్రిటీకి లేదు ..సాధ్యం కాదు అని ఓ రికార్డు ఉంది.
మరి అంత మంది ఫాలోవర్స్ ఉన్నప్పుడు ..అందునా యూత్ ఐకాన్ గా ఫీల్ అవుతున్నప్పుడు…కోహ్లీ పెట్టే పోస్ట్ కి డిమాండ్ ఆ మాత్రం ఉండాలిగా. కోహ్లీ పెట్టే ఒక్క పోస్ట్ కి సుమారు11.45 కోట్లు ముడుతుందట. అత్యధిక ఫాలోవర్స్ ఉండడంతో విరాట్ పెట్టే ఏ పోస్ట్ కైనా అత్యధిక మొత్తం అందుతుంది మరి. అయితే ఇంస్టాల్ స్టోరీ కి మాత్రం పోస్ట్ కి వచ్చినంత అమౌంట్ రాదట. ఎందుకంటే పోస్ట్ అంటే అలాగే ఉంటుంది కానీ స్టోరీ మాత్రం 24 గంటల తర్వాత డిసపియర్ అయిపోతుంది కదా.
కోహ్లీ యొక్క పోస్ట్ కి సంపాదించే అమౌంట్ విని కళ్ళు తేలేశారు అతనికంటే ముందు ఇంకా ఎక్కువ అమౌంట్ తీసుకుని ఇద్దరు ప్లేయర్స్ ఉన్నారు. అయితే వాళ్లు క్రికెట్ కి సంబంధించిన వాళ్ళు కాదు ..వరల్డ్ ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్స్. ఫుట్బాల్ చరిత్రలోనే ఒక సంచలనం సృష్టించిన క్రిస్టియానో రొనాల్డో పెట్టే ప్రతి ఇన్స్టా పోస్ట్ కి అందుకునే మొత్తం అక్షరాల 26.7 కోట్లు. ఇక తర్వాత ప్లేస్ ప్రతి పోస్ట్ కి సుమారు 21.5 కోట్లు అందుకునే లెజెండరీ ఫుట్ బాల్ ప్లేయర్ మెస్సీ కే దక్కుతుంది. వీళ్ళు కేవలం ఆటల ద్వారానే కాకుండా ఇలా సోషల్ మీడియాలో కూడా కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు.