Homeక్రీడలుక్రికెట్‌Virat Kohli: విరాట్ కోహ్లీ.. ఇంగ్లాండ్ ను ఇంగ్లాండ్ గడ్డ మీద.. ఇది కదా కింగ్...

Virat Kohli: విరాట్ కోహ్లీ.. ఇంగ్లాండ్ ను ఇంగ్లాండ్ గడ్డ మీద.. ఇది కదా కింగ్ ఆట అంటే..

Virat Kohli: ప్రత్యర్థికి సొంత గడ్డమీద చుక్కలు చూపిస్తే వచ్చే కిక్ మామూలుగా ఉండదు. ఇప్పుడు దీనిని టీం ఇండియా స్టార్ ఆటగాడు.. రన్ మిషన్.. కింగ్ .. విరాట్ కోహ్లీ సంపూర్ణంగా అనుభవిస్తున్నాడు. సంవత్సరాలుగా క్రికెట్ ఆడుతున్నప్పటికీ అలుపు అనేది లేకుండా అతడు పరుగులు తీస్తున్నాడు. నేటి తరంతో కూడా పోటీపడుతూ మైదానంలో వీర విహారం చేస్తున్నాడు. 2027 వన్డే వరల్డ్ కప్ లో చోటు ఉంటుందా.. ఉండదా.. అనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో.. విరాట్ కోహ్లీ తను ఎంత గొప్ప ఆటగాడినో మేనేజ్మెంట్ కు తెలిసేలా చేస్తున్నాడు.

ఇంగ్లాండ్ గడ్డమీద టీమిండియా ప్రస్తుతం 3 వన్డేల సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్లో టీమిండియా తొలి మ్యాచ్లో అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇప్పుడు రెండవ వన్డేలో విజయం సాధించేందుకు బలంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో టీం ఇండియా రెండవ వన్డేలో ఈ కథనం రాసే సమయం వరకు మూడు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. రోహిత్ 26.. గివ్ 31.. ఇషాన్ కిషన్ 1 పరుగులు చేశారు.

విరాట్ కోహ్లీ 66 బంతులు ఎదుర్కొని 65 పరుగులు చేశాడు. అతడి ఖాతాలో ఎనిమిది ఫోర్లు ఉన్నాయి. మరో ఆటగాడు అయ్యర్ 37 బంతుల్లో 42* పరుగులు చేశాడు. ఇతడి ఖాతాలో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ ఉంది. అయ్యర్, విరాట్ కోహ్లీ నాలుగో వికెట్ కు ఇప్పటివరకు 66* పరుగులు జోడించారు. తద్వారా ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ మీద తన సత్తా చూపిండానికి ఇటీవల విపరీతంగా ప్రాక్టీస్ చేశాడు. ఇంగ్లాండ్ ను పోలీ ఉన్న మైదానాలను ఏర్పాటు చేసుకుని కసరత్తు చేశాడు.అందువల్లే ఇలా బ్యాటింగ్ చేశాడు.

ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ చేసిన హాఫ్ సెంచరీ హైలెట్ గా నిలిచింది. ఇంగ్లాండ్ మీద అతడు ఏకంగా 14 సార్లు అతడు 50 కి పరుగులు చేసిన ఘనతను అందుకున్నాడు. ఈ జాబితాలో వీవ్ రిచర్డ్స్ తో సమానంగా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో సంగక్కర మొదటి స్థానంలో ఉన్నాడు. విరాట్ ఇదే జోరు గనుక కొనసాగిస్తే.. మూడో వన్డేలో కచ్చితంగా సంగక్కర రికార్డు బద్దలు కొట్టే అవకాశం ఉంది.


image.png

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular