Homeక్రీడలుక్రికెట్‌Virat Kohli One8 commune: తందూరి రోటి 118 రూపాయలా..

Virat Kohli One8 commune: తందూరి రోటి 118 రూపాయలా..

Virat Kohli One8 commune: తందూరి రోటి 118 రూపాయలు. సాల్టెడ్ ప్రైస్ 348 రూపాయలు. లక్నో వీ దమ్ లాంబ్ బిర్యానీ 978. స్టీమ్ రైస్ 318. మాస్కోర్పోన్ చీజ్ కేక్ 748.. ఇవి కేవలం ధరలు మాత్రమే. పన్నులు కలుపుకుంటే మరింత అదనం. ఇదేదో పార్క్ హయత్ హోటల్ లో వసూలు చేసే రేట్లో.. తాజ్ బంజారాలో ఫైవ్ స్టార్ మెనూనో కాదు.. ఇది మన విరాట్ కోహ్లీ హోటల్లో వసూలు చేసే ధరలు..

ఈ డబ్బులు పెడితే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వారం పాటు హోటల్లో దర్జాగా తినవచ్చు. ఇదే మెనూ ను హాయిగా ఆస్వాదించవచ్చు. ఈ రేట్లు ఎందుకంటారా.. అది విరాట్ కోహ్లీ హోటల్ కాబట్టి. పైగా దాని పేరు one 8 commune కాబట్టి.. విరాట్ కోహ్లీ ఫుడ్ బిజినెస్ లోకి వచ్చి చాలా రోజులైంది. ఇందులో ఉన్న రేట్ల గురించి రకరకాల ప్రచారాలు జరిగాయి. అయినప్పటికీ అందులో ధరలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పుడంటే ఫుడ్ ఐటమ్స్ ధరలు పెరిగాయి. గ్యాస్ లభించకపోవడం.. కమర్షియల్ గ్యాస్ మీద ధర పెంచడం.. ఇతర కూరగాయలు.. వస్తువుల ధర కూడా పెరగడం వల్ల చాలామంది హోటల్ నిర్వాహకులు ఫుడ్ ఐటమ్స్ రేట్లు పెంచేశారు.

విరాట్ కోహ్లీ హోటల్లో ఈ రేట్లు ఎప్పటి నుంచో ఉన్నాయి. తాజాగా బెంగళూరులో హోటల్ ను మూసి వేసిన తర్వాత.. గోవాలో సీయోలిమ్ ఏరియాలో విరాట్ కోహ్లీ హోటల్ మొదలుపెట్టాడు. ఇందులో కాంటినెంటల్.. వెస్ట్రన్ ఫుడ్ ఐటమ్స్ లభిస్తుంటాయి. ఇద్దరు వ్యక్తులు తినడానికి వెళ్తే తక్కువలో తక్కువ అక్కడ 2000 వరకు బిల్ అవుతూనే ఉంటుంది. పైగా అదనపు ఖర్చులు ఉండనే ఉన్నాయి. ఒకవేళ బార్ లో తాగుతూ ఎంజాయ్ చేయాలనుకుంటే.. జేబుకు బొక్క పెట్టుకోవాల్సిందే. ఈ స్థాయిలో ధరలు ఎందుకంటే అది విరాట్ కోహ్లీ రెస్టారెంట్ కాబట్టి.. పైగా అందులో ఉన్న ఫుడ్ ఐటమ్స్ అలా ఉంటాయి కాబట్టి..

ఇంత ధర పెట్టి అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏముంది.. ఇంట్లో కూడా వండుకోవచ్చు కదా.. హాయిగా కుటుంబ సభ్యులతో తినవచ్చు కదా.. అని అనుకుంటున్నారా.. అలా అయితే సంతోషం. ఎందుకంటే డబ్బులు ఆదా అవుతాయి. పైగా ఇంట్లో కూర్చొని తిన్న అనుభూతి లభిస్తుంది. ఇప్పటి కాలంలో బయట తిండి కంటే ఇంట్లో తినడమే మంచిది. ఇంట్లో తాగే అవకాశం ఉండదు కదా.. అలాంటప్పుడు ఇంట్లో ఎలా తింటామని అంటారా.. అది మీ ఇష్టం.. కాకపోతే వన్ 8 కమ్యూన్ లో కేవలం హై-ఫై వ్యక్తులు మాత్రమే తింటారు. ఎందుకంటే అది విరాట్ కోహ్లీ రెస్టారెంట్ కాబట్టి..

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Tollywood Directors: బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేసే ఉద్దేశ్యం లేని తెలుగు దర్శకులు వీళ్లే…

Tollywood Directors: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లు కొందరు తెలుగు హీరోలు అవకాశం ఇవ్వకపోవడంతో బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా వంశీ పైడిపల్లి తెలుగు స్టార్...

Vemulawada Rajanna Temple: వేములవాడకు తండ్రి 7 లక్షల విరాళం.. తిరిగివ్వాలని కూతుళ్ల పోరాటం.. ఊహించని ట్విస్ట్

Vemulawada Rajanna Temple: తెలంగాణలో ప్రముఖ శైవ క్షేత్రాలలో అత్యంత ప్రసిద్ధి చెందింది వేములవాడ రాజేశ్వర ఆలయం. ఇక్కడ స్వామి వారు లింగం రూపంలో ఉంటారు. ఈ ఆలయంలో కోడె మొక్కులను చెల్లించడం...

Football Legends Retirement: దిగ్గజాల నిష్క్రమణ.. పుట్ బాల్ చరిత్రలో ముగిసిన స్వర్ణయుగం

Football Legends Retirement: ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన క్రీడ ఫుట్బాల్. అందుకే ఫిఫా ప్రపంచ కప్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. పైగా ఇది క్రీడల్లోకెల్లా అత్యధిక స్థాయిలో వీక్షణలు సొంతం...

US Iran Conflict: అమెరికా డేటా సెంటర్ పై దాడి.. ముదిరిన యుద్ధం

US Iran Conflict: గల్ఫ్‌ ప్రాంతంలో అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా మారాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు, ప్రతీకార చర్యలతో పశ్చిమాసియా మొత్తం అగ్నిగుండంలా మారింది. వాణిజ్య నౌకల రాకపోకలకు...

FIFA World Cup Revenue: ఫిఫా ప్రపంచ కప్.. ఎన్ని వేల కోట్లు వచ్చాయో తెలుసా..

FIFA World Cup Revenue: ఈ ప్రపంచంలో అత్యంత ప్రజాధరణ పొందిన క్రీడలలో ఫుట్ బాల్ ముందు వరుసలో ఉంటుంది. దీనిని ప్రపంచంలో మెజారిటీ దేశాలు ఆడుతూ ఉంటాయి. అంతర్జాతీయ ఫుట్...
Oktelugu Epaper
Exit mobile version