Homeక్రీడలుక్రికెట్‌Viral Video : పూరన్.. బంతి తలపగలగొట్టినా.. ఇంత పిచ్చేంట్రా బాబూ! వైరల్ వీడియో

Viral Video : పూరన్.. బంతి తలపగలగొట్టినా.. ఇంత పిచ్చేంట్రా బాబూ! వైరల్ వీడియో

Viral Video : ఐపీఎల్ నడుస్తున్న ప్రస్తుత సమయంలో క్రికెట్ చూసే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. మైదానాలు జాతరలను తలపిస్తున్నాయి. ఇక టీవీలు, స్మార్ట్ ఫోన్లైతే సాయంత్రం కాగానే బిజీ బిజీ అయిపోతున్నాయి. ఇక ఈ సమయంలో ఒక్కసారి గనుక కరెంటు పోతే.. ఫోన్లో చార్జింగ్ అయిపోతే.. అభిమానులకు కోపం తారస్థాయికి చేరుతోంది. ఎందుకంటే క్రికెట్ వారి నరనరాల్లో జీర్ణించుకు పోయింది కాబట్టి.. క్రికెట్ లేకుండా వారు ఉండలేరు కాబట్టి.. అలాంటి ప్రతిస్పందనలు వ్యక్తం చేస్తున్నారు. అందులో తప్పులేదు. తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు.

Also Read : ఎన్ని ప్రశంసలు వచ్చినా.. అభిషేక్ శర్మకు మాత్రం ఇది ప్రత్యేకం….

ప్రస్తుతం ఐపీఎల్ 10 జట్లు ఆడుతున్నా. ఈ పది జట్లకు కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక శనివారం లక్నో, గుజరాత్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో లక్నో జట్టు ఆటగాడు నికోలస్ పూరన్ తన బ్యాట్ ద్వారా శివతాండవం చేశాడు. పిచ్చకొట్టుడు కొట్టాడు. ఫలితంగా లక్నో జట్టు అద్భుతమైన విజయాన్ని దక్కించుకుంది. ఈ సీజన్లో ఎదురనేది లేకుండా దూసుకుపోతున్న గుజరాత్ జట్టుకు చిన్న షాక్ ఇచ్చింది. అయితే చేజింగ్ సమయంలో దూకుడుగా ఆడుతున్న పూరన్.. తన కొట్టిన ఓ బంతి మైదానంలోని స్టాండ్స్లోకి వెళ్లిపోయింది. ఆ సమయంలో మ్యాచ్ చూస్తున్న ఓ ప్రేక్షకుడి తలకు ఆ బంతి తగిలింది. దీంతో అతడికి తీవ్రంగా రక్తస్రావం జరిగింది. గమనించిన మైదానం సిబ్బంది వెంటనే అతనికి ప్రధమ చికిత్స చేశారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తరలించే క్రమంలో ఆ వ్యక్తి.. వైద్యం చేయించుకోవడానికి నిరాకరించాడు. తన తలకు దెబ్బ తగిలినా పర్వాలేదు గానీ.. మ్యాచ్ చూస్తానని పట్టుపట్టాడు. అయితే మైదానంలోని సిబ్బంది అతనికి నచ్చ చెప్పారు. ఇలా ఉంటే కుదరదు.. అన్ని తలకు ఏమైనా అయితే తర్వాత ఇబ్బంది పడతావు అంటూ అతడికి చెప్పి.. ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. ఆదివారం సాయంత్రం లేదా సోమవారం ఉదయం అతడు డిశ్చార్జ్ అవుతాడని తెలుస్తోంది.. పూరన్ ఈ మ్యాచ్లో 34 బంతులు ఎదుర్కని.. 61 రన్స్ స్కోర్ చేశాడు. ఇందులో అతడు ఒక ఫోర్ మాత్రమే కొట్టి.. 7 సిక్సర్లు బాదడం విశేషం. ఇక గుజరాత్ విధించిన టార్గెట్ 180 పరుగులను పూరన్ కొట్టిన కొట్టుడుకు లక్నో జట్టు చాలా సులభంగా చేదించి పడేసింది. 19.3 ఓవర్లలో టార్గెట్ ఫినిష్ చేసి.. 6 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీని సొంతం చేసుకుంది. దర్జాగా పాయింట్ల పట్టికలో థర్డ్ ప్లేస్ ను ఆక్రమించింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version