Viral Video: క్రికెట్లో వైవిధ్యానికి పెద్ద పీట ఉంటుంది. అటువంటి వారికి ఎక్కువ అవకాశాలు లభిస్తాయి. ఎందుకంటే ఇలాంటి వైవిధ్యం చూపేవారు క్రికెట్లో ఎక్కువ ప్రతిభ చూపుతారు. ప్రత్యర్థి ఆటగాళ్లకు చుక్కలు చూపిస్తారు. ఉదాహరణకు షేన్ వార్న్ అద్భుతంగా బంతులు వేస్తాడు.. అందులో వైవిధ్యం ఉంటుంది కాబట్టే గొప్ప బౌలర్ గా ఆవిర్భవించాడు. ఇక ముత్తయ్య మురళీధరన్, అజంత మెండిస్, పతిరణ.. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు జాబితా.. వీరంతా కూడా తమ వైవిధ్యం ద్వారా గొప్ప క్రికెటర్లుగా పేరు తెచ్చుకున్నారు. ఇక వీరిలో లసిత్ మలింగ మరింత ప్రత్యేకమైన బౌలర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇతడు వేసే డిఫరెంట్ బంతులు అప్పట్లో సంచలనాన్ని సృష్టించాయి.. కొన్నిసార్లు మలింగ మ్యాచ్లను ఏకపక్షంగా మార్చేశాడు. శ్రీలంకను విజేతగా చేశాడు. కేవలం వీరు మాత్రమే కాదు షోయబ్ అక్తర్, కులదీప్ యాదవ్.. ఇలా డిఫరెంట్ బౌలింగ్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించారు..
Also Read: మొదటి అర్ధ భాగం ముగిసింది.. ప్లే ఆఫ్ వెళ్లే జట్లు ఏవంటే?
లెఫ్ట్ ఆర్మ్.. రైట్ ఆర్మ్ స్పిన్నర్
ఎవరైనా ఎడమ చేతితో బంతులు వేస్తారు. లేదా కుడి చేతితో బంతులు వేస్తారు. కానీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి భిన్నంగా బౌలింగ్ చేశాడు. ఆ వ్యక్తి బంతిని ముందుగా తన ఎడమ చేతితో పట్టుకున్నాడు.. కొంత దూరం పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత ఆ బంతిని వెంటనే పూడి చేతిలోకి తీసుకున్నాడు. అంతేకాదు ఆ బంతిని అమాంతం విసిరేసాడు. క్రీజ్ లో ఆటగాడికి అతడు ఎటువైపు బంతి వేస్తున్నాడో అర్థం కాలేదు. చివరికి అతడు వేసిన బంతికి వికెట్లు నేలకూలాయి.. వికెట్లు నేలకూలిన ఆనందంలో ఆ బౌలర్ ఎగిరి గంతులు వేయగా.. ఆ బ్యాటర్ మాత్రం నిరాశలో కూరుకు పోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నది.” ఇప్పుడు సోషల్ మీడియాలో ఐపీఎల్ హవా కొనసాగుతోంది . అందువల్లే అతడు ఈ వీడియో పోస్ట్ చేశాడు కావచ్చు.. ఇలాంటి వీడియో రూపొందించి ఫేమస్ కావాలని భావించాడు కావచ్చు. అందువల్లే ఇలాంటి భిన్నమైన యాక్షన్ లో బౌలింగ్ వేశాడు. నిజంగా అతడు సోషల్ మీడియాను గుప్పిట పట్టాడని” నెటిజన్లు పేర్కొంటున్నారు.. ” ఇలా విభిన్నంగా బౌలింగ్ వేస్తున్నాడు. అతడికి అది ఆనందం అనిపించవచ్చు. కానీ క్రికెట్ లో ఇలాంటి వాళ్లతో అవకాశాలు లభించవు. ఎందుకంటే క్రికెట్లో స్థిరత్వం ఉండాలి. అన్నింటికీ మించి ప్రతిభ పదిమంది మెచ్చే విధంగా ఉండాలి. ఇలా బౌలింగ్ వేస్తున్న వ్యక్తికి అవకాశం ఎలా ఇస్తారు? ఇలాంటివారిని ఐసిసి ఎలా ఒప్పుకుంటుంది.. చివరికి భారత క్రికెట్ నియంత్రణ మండలి కూడా అంగీకరించదని” నెటిజన్లు పేర్కొంటున్నారు.
Right arm left hand spinner.. pic.twitter.com/SQIkP7TcGb
— முகில் (@mukil1123) April 18, 2025