Viral Video : ఢిల్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ మరో ఓటమిని నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ ఢిల్లీ జట్టు ఎదుట 205 రన్స్ టార్గెట్ విధించింది. ఆ టార్గెట్ చేజ్ చేయలేక ఢిల్లీ జట్టు 190 స్కోర్ మాత్రమే చేయగలిగింది. తద్వారా సొంతవేదిక మీద రెండో ఓటమిని ఢిల్లీ జట్టు మూటకట్టుకుంది. ఈ ఓటమి ద్వారా ఢిల్లీ జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఢిల్లీ జట్టు ఈ సీజన్లో ఇప్పటివరకు పది మ్యాచ్ లు ఆడింది. ఇందులో ఆరు విజయాలు నమోదు చేసుకుంది. అయితే సొంతవేదికపై ఇటీవల బెంగళూరు, ఇప్పుడు కోల్ కతా చేతిలో ఓటమిపాలై.. తీవ్ర ఇబ్బందులలో పడింది.
Also Read : 14 ఏళ్ల కుర్రాడి మెరుపు సెంచరీ.. గిఫ్ట్‌గా వచ్చిన లగ్జరీ కారు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
చెంపదెబ్బ కొట్టిన కులదీప్
కోల్ కతా ఇన్నింగ్స్ సమయంలో.. ఆ జట్టు ఆటగాడు రింకూ సింగ్ అదరగొట్టాడు. 25 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 36 పరుగులు చేశాడు. విప్రజ్ నిగం బౌలింగ్లో అతడు అవుట్ అయ్యాడు. ఇక కులదీప్ యాదవ్ బౌలింగ్ లో రింకూ ఏకంగా 22 పరుగులు చేశాడు. ఆ ఓవర్ ఒక్కసారిగా కోల్ కతా జట్టు స్థితిని మార్చేసింది. 22 పరుగులు చేయడంతో కులదీప్ యాదవ్ అలా చూస్తూ ఉండిపోయాడు.. గెలవాల్సిన మ్యాచ్ లో ఢిల్లీ జట్టు అపజయాన్ని ఎదుర్కొంది. మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలో ఊహించని సంఘటన చోటుచేసుకుంది.. రింకు సింగ్ ను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు స్పిన్ బౌలర్ కులదీప్ యాదవ్ చెంప మీద గట్టిగా కొట్టాడు. దీంతో ఒక్కసారిగా రింకు సింగ్ ముఖంలో హావభావాలు మారిపోయాయి. అయినప్పటికీ కులదీప్ యాదవ్ గమనించలేదు. మళ్లీ ఏదో చెబుతూ అతడిని మరోసారి చెంప దెబ్బ కొట్టాడు. ఈ ఘటన తర్వాత ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది. కులదీప్ యాదవ్ రింకు సింగ్ ను ఎందుకు కొట్టాడు అనే విషయంపై ఇంతవరకు ఒక క్లారిటీ లేదు. దీనిపై జాతీయ మీడియాలో రకరకాలుగా కథనాలు ప్రసారమవుతున్నాయి. అయితే ఎందులోనూ ఒక స్పష్టత అంటూ లేకుండా పోయింది. తన ఓవర్లో 22 పరుగులు చేయడం వల్లే కులదీప్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశాడని.. అందువల్లే రింకు సింగ్ ను కొట్టాడని ప్రచారం జరుగుతోంది. అయితే ప్రొఫెషనల్ ఆటగాళ్లు ఇలా కొట్టుకోవడం ఏంటని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కులదీప్ యాదవ్ చేసిన పని సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అతడు రింకు సింగ్ ను కొట్టిన తీరు సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది. అసలు ఎందుకు అతడు కొట్టాడు? రింకు సింగ్ ఏమన్నాడు? అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం లభించాల్సి ఉంది.