Victory Parade Controversy : అభిమానులకు క్రికెట్ పిచ్చిని అలవాటు చేసి.. క్రికెట్ చూడకుండా ఉండలేని పరిస్థితిని కల్పించి.. వారిద్వారా వేలకోట్ల ఆదాయాన్ని ఆర్జించి.. అంతకంతకు ఎదిగిపోతున్న బీసీసీఐ, ఐపీఎల్ నిర్వాహ కమిటీ.. అభిమానులకు కష్టం వస్తే మాత్రం దూరం జరుగుతున్నాయి. వాస్తవానికి కన్నడ జట్టు ఐపిఎల్ ట్రోఫీ గెలిచిన తర్వాత విక్టరీ పరేడ్ నిర్వహించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఏమి ఇంటర్నేషనల్ సిరీస్ కాదు. కన్నడ జట్టు గెలిచింది వరల్డ్ కప్ కూడా కాదు.. సుదీర్ఘ నిరీక్షణ ఉన్నంత మాత్రాన ఈ స్థాయిలో ఓవరాక్షన్ చేయడం ఏ మాత్రం బాగోలేదు. ఒకవేళ కన్నడ జట్టు యాజమాన్యం ఈ స్థాయిలో పరేడ్ నిర్వహించాలి అనుకున్నప్పుడు.. దానికి కసరత్తు చేయాలి. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అంచనా వేయాలి. ఎందుకంటే కన్నడ అభిమానులు ఉద్రేకంతో ఉన్నారు. చాలా సంవత్సరాల తర్వాత ట్రోఫీని గెలిచామని ఆనందంలో ఉన్నారు. అలాంటప్పుడు అభిమానులు భారీగా రోడ్లమీదకి వచ్చే అవకాశం ఉంది. వారిని కర్ణాటక పోలీసులు మాత్రమే కాదు.. ఈ దేశంలో ఉన్న ఆర్మీ కూడా కంట్రోల్ చేయలేదు. ఎందుకంటే ఒకేసారి లక్షల మంది రోడ్లమీదకి వస్తే ఏ బలగాలు కూడా వారిని కంట్రోల్ చేయలేవు.
ఈ స్థాయిలో అభిమానులు వస్తారని అంచనా వేసిన కర్ణాటక పోలీసులు ముందుగానే చేతులెత్తేశారు. తమ వద్ద ఉన్న బలగాలతో ఆ స్థాయిలో భద్రత కల్పించలేమని చెప్పేశారు. కానీ నెత్తి మాసిన కర్ణాటక క్రికెట్ బోర్డు గొప్పలకు పోయింది. పైగా కర్ణాటక క్రికెట్ బోర్డులో కొంతమంది రాజకీయ నాయకులు తమ ప్రాపకం కోసం పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు విక్టరీ పరేడ్ కు తమ సమ్మతం తెలిపారు. గంటలోనే కార్యక్రమం పూర్తి చేసుకోవాలని సూచించారు. కానీ అప్పటికే మైదానం వెలుపల అభిమానులు భారీగా గుమిగూడి పోయారు. గేట్లు తెరవడం కూడా ఆలస్యం కావడంతో ఒక్కసారిగా పరిస్థితి అదుపుతప్పింది. ఒకేసారిగా అభిమానులు తీసుకురావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటివరకు 11 మంది చనిపోయారని తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా అవకాశం కూడా ఉందని కన్నడ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఇంతటి దారుణం జరిగినప్పటికీ.. విక్టరీ పరేడ్ గురించి తెలియదని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ చెప్పడం విస్మయాన్ని కలిగిస్తోంది.. ” ఈ ఘటనపై నిర్వాహకులను ఆరా తీశాం. బయట ఏం జరిగిందో తెలియదని వారు అంటున్నారు. ఈ ఘటన దురదృష్టకరం. పకడ్బందీగా నిర్వాహకులు ఏర్పాటు చేసి ఉంటే బాగుండేదని” ఐపీఎల్ చైర్మన్ పేర్కొన్నారు. ఇక ఈ ఘటనపై బీసీసీఐ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని పేర్కొన్నారు. వీటిని రాజకీయం చేయకూడదని సూచించారు. భారీగా అభిమానులు వచ్చారని.. ఈ స్థాయిలో వస్తారని ఊహించలేదని ఆయన పేర్కొన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటించినప్పటికీ.. ఏ రూపంలో వారిని ఆదుకుంటారో మాత్రం చెప్పకపోవడం విశేషం.
“JUST DON’T GO. IT’S DANGEROUS.”
RCB fans outside Chinnaswamy reveal stampede like situation pic.twitter.com/uM2EFD0wb6
— Cricket.com (@weRcricket) June 4, 2025