Homeక్రీడలుక్రికెట్‌Varun Chakravarthy Wife Neha Khedekar: వరుణ్ చక్రవర్తి కోసం భార్య ఎంత త్యాగం చేసిందంటే.....

Varun Chakravarthy Wife Neha Khedekar: వరుణ్ చక్రవర్తి కోసం భార్య ఎంత త్యాగం చేసిందంటే.. ఇది కదా గ్రేట్ లవ్ స్టోరీ అంటే

Varun Chakravarthy Wife Neha Khedekar: ఓ హార్దిక్ పాండ్యా నటాషా, శిఖర్ ధావన్ అయేషా, యజువేంద్ర చాహల్ దనశ్రీ.. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతడంత జాబితా. ప్రేమలు, పెళ్ళిళ్లు, పెటాకులు కామన్ అయిపోయాయి. అప్పటి దాకా కలిసిమెలిసి ఉండి.. ఆ తర్వాత విడిపోయి.. చాలామంది క్రికెటర్లు వార్తల్లో కనిపిస్తూ ఉంటారు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ అనుష్క, రోహిత్ రితీక కాస్త భిన్నం. ఎందుకంటే వీరు ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా ఉంటారు. ఈ జాబితాలో […]

Varun Chakravarthy Wife Neha Khedekar: ఓ హార్దిక్ పాండ్యా నటాషా, శిఖర్ ధావన్ అయేషా, యజువేంద్ర చాహల్ దనశ్రీ.. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతడంత జాబితా. ప్రేమలు, పెళ్ళిళ్లు, పెటాకులు కామన్ అయిపోయాయి. అప్పటి దాకా కలిసిమెలిసి ఉండి.. ఆ తర్వాత విడిపోయి.. చాలామంది క్రికెటర్లు వార్తల్లో కనిపిస్తూ ఉంటారు.

ఈ జాబితాలో విరాట్ కోహ్లీ అనుష్క, రోహిత్ రితీక కాస్త భిన్నం. ఎందుకంటే వీరు ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా ఉంటారు. ఈ జాబితాలో వరుణ్ చక్రవర్తి కూడా చేరిపోయాడు. వరుణ్ భార్య పేరు నేహ ఖేడేకర్. వరుణ్ ది ప్రేమ వివాహం. నేహా తో అతడికి srm విశ్వవిద్యాలయంలో పరిచయం ఏర్పడింది. అక్కడ చదువుకుంటున్నప్పుడే వారిద్దరూ ప్రేమలో పడ్డారు. వరుణ్ అర్కిటెక్ట్ గా పనిచేశాడు.

వరుణ్ చక్రవర్తి మొదట్లో అర్కిటెక్టర్ గా పనిచేశాడు. ఆ తర్వాత క్రికెట్ వైపు వెళ్లాడు. జాబ్ వదిలేస్తాను అని చెప్పగానే నేహా సంతోషంగా ఒప్పుకుంది. అతడికి అవకాశాలు వచ్చేంత వరకు ఉద్యోగం చేసింది. కుటుంబ ఖర్చులు, వరుణ్ ఖర్చులు ఆమెనే భరించింది. కుమారుడి ఆలనాపాలనా చూసుకుంది.

‘నీకు ఉద్యోగం లేకపోయినా నాకు ఇబ్బంది లేదు. నేను నిన్ను చూసుకోగలను. నేను సంపాదిస్తున్నాను. నీకు నచ్చిన క్రికెట్ లో సత్తా చూపించు. నువ్వు క్రికెట్ ధైర్యంగా ఆడు’ అని నేహా భరోసా ఇచ్చింది. అంతేకాదు, తనను వివాహం చేసుకోవద్దని వరుణ్ చెప్పినప్పటికీ నేహా ఒప్పుకోలేదు. పైగా నిన్ను తప్ప మరోకరిని వివాహం చేసుకోనని నేహా చెప్పడంతో వరుణ్ ఆమె నిర్ణయాన్ని గౌరవించి వివాహం చేసుకున్నాడు.

నాడు నేహా ఇచ్చిన సలహాలు, సూచనలతో వరుణ్ తన కెరియర్ మొత్తాన్ని మార్చుకున్నాడు. చివరికి టీ20 ఫార్మాట్ లో నెంబర్ వన్ బౌలర్ గా అవతరించాడు. ఇదే విషయాన్ని వరుణ్ ఇటీవల మీడియా సమావేశంలో చెప్పాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper