Homeక్రీడలుక్రికెట్‌Vaibhav Suryavanshi Unlucky Dismissals: వైభవ్ సూర్య వంశీని వెంటాడుతున్న దురదృష్టం.. పాపం బుడ్డోడికి ఎందుకీ...

Vaibhav Suryavanshi Unlucky Dismissals: వైభవ్ సూర్య వంశీని వెంటాడుతున్న దురదృష్టం.. పాపం బుడ్డోడికి ఎందుకీ కష్టాలు

Vaibhav Suryavanshi Unlucky Dismissals: వైభవ్ సూర్య వంశీ వయసు 15 సంవత్సరాలు మాత్రమే. కానీ అతడు ఆడుతున్న తీరు చూస్తుంటే మాత్రం సంవత్సరాల అనుభవం ఉన్న ఆటగాడి కంటే ఎక్కువ కనిపిస్తోంది. బంతిని కొట్టే విధానంలో.. వికెట్ కాపాడుకునే విధానంలో అతను చూపిస్తున్న మెచ్యూరిటీ అద్భుతంగా ఉంది. ముఖ్యంగా జట్టులో పెద్దపెద్ద ప్లేయర్లు సైతం చేతులెత్తేస్తున్న వేళ.. అతడు ఆడుతున్న తీరు అత్యంత గొప్పగా ఉంది.

అతడి ఆట తీరు అంత అద్భుతంగా ఉంది కాబట్టి గొప్ప గొప్ప ప్లేయర్లు అతడిని కొనియాడుతున్నారు. సూపర్ బ్యాటింగ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇతడి చేతిలో భారత జట్టు అత్యంత భద్రంగా ఉంటుందని.. టీమిండియా కు భవిష్యత్తు ఇతడేనని వ్యాఖ్యానిస్తున్నారు. ఐపీఎల్ లో ఈ సీజన్లో ఇప్పటివరకు పరుగుల వరద పారిస్తూ.. ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా కొనసాగుతున్నాడు సూర్య వంశీ. రాజస్థాన్ జట్టుకు బ్యాటింగ్ విభాగంలో వెన్నెముక మాదిరిగా నిలుస్తున్నాడు. జట్టుకు అవసరమైన ప్రతి సందర్భంలో ఆపద్బాంధవుడి పాత్ర పోషిస్తూ సత్తా చూపిస్తున్నాడు.

వైభవ్ సూర్య వంశీ ఆట తీరు గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడు చూపించే దూకుడుకు కొత్తగా ఉపమానాలు అల్లాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అతడు బ్యాటింగ్ చేస్తున్న తీరు అమోఘం. బంతులను కొడుతున్న తీరు అత్యద్భుతం. వీరోచితమైన బ్యాటింగ్ తో అతడు చూపిస్తున్న తెగువ అనితర సాధ్యం. ఇన్ని సానుకూలతలు ఉన్నప్పటికీ.. సూర్య వంశీ కి ఒక విషయంలో మాత్రం ప్రత్యేక ఇబ్బంది ఎదురవుతోంది. అదే సెంచరీల ముందు అతడు అవుట్ కావడం..

ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడుసార్లు సెంచరీల ముందు సూర్య వంశీ అవుట్ అయ్యాడు.. అతడు అలా అవుట్ కావడం అభిమానులను తీవ్రంగా నిరాశ పరుస్తోంది. ఈ సీజన్లో ఇప్పటివరకు అతడు మూడుసార్లు సెంచరీల ముందు అవుట్ అయ్యాడు. లీగ్ దశలో 93 పరుగుల వద్ద ఒకసారి అవుట్ అయ్యాడు. ఎలిమినేటర్ మ్యాచ్లో 97 పరుగుల వద్ద మరొకసారి ఒకటి అయ్యాడు. క్వాలిఫైయర్ టు మ్యాచ్లో 96 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు.

ఒకవేళ ఈ మూడు సార్లు అతడు అవ్వకుండా ఉండి ఉంటే.. ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్లో నాలుగు సెంచరీలు నమోదు చేసిన ఆటగాడిగా అతడు రికార్డు సృష్టించేవాడు. అంతే కాదు, అన్ క్యాప్డ్ ఆటగాడిగా ఈ స్థాయిలో పరుగులు సృష్టించిన ప్లేయర్ గా అతడు రికార్డు నెలకొల్పేవాడు. సూర్య వంశీ ఇలా మూడుసార్లు అవుట్ కావడం పట్ల అతడి అభిమానులు, రాజస్థాన్ యాజమాన్యం తీవ్ర నిర్వేదం వ్యక్తం చేస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version