Vaibhav Suryavanshi IPL Record: 1 అనుకున్నట్టుగానే ఈ సీజన్లో వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ మొత్తాన్ని దున్నేస్తున్నాడు. తిరుగులేని స్థాయిలో ఆడుతూ అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు ఈ సీజన్లో అతడు ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు సాధించాడు. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ జట్టు మీద హాఫ్ సెంచరీ చేశాడు. తద్వారా ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఈ సీజన్లో అన్ క్యాప్డ్ ఆటగాడిగా రంగంలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ చరిత్రను మొత్తం తిరగ రాశాడు. పవర్ ప్లే లో 500 పరుగులు చేసిన ఆటగాడిగా సరికొత్త రికార్డు సృష్టించాడు. పొట్టి ఫార్మాట్లో గేల్.. హెడ్.. అభిషేక్ శర్మ.. వంటి మేటి ప్లేయర్లకు సాధ్యం కాని రికార్డులను అతడు సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడిగా మిగిలిపోయాడు. అతడు సాధించిన రికార్డును మరే ఆటగాడు కూడా బద్దలు కొట్టే అవకాశం లేదు. 15 సంవత్సరాల వయసులోనే అతడు ఈ స్థాయిలో రికార్డులు సృష్టిస్తున్నాడు అంటే మాటలు కాదు.
ఐపీఎల్ చరిత్రలో పవర్ ప్లే లో 500 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా వైభవ్ సూర్య వంశీ రికార్డు సృష్టించాడు. 2016లో వార్నర్ 467, 2024లో హెడ్ 402, సాయి సుదర్శన్ 2025లో 402, గిల్ క్రిస్ట్ 2009లో 382, బట్లర్ 2022లో 374, కోహ్లీ 2024లో 373 పరుగులు చేశారు. వైభవ్ సూర్య వంశీ తో పోల్చి చూస్తే మిగతా ప్లేయర్లు అత్యంత అనుభవం ఉన్నవారు. ఎక్కువ వయసు ఉన్నవారు. వారిలో ఎవరు కూడా 500 పరుగుల మార్కు అందుకోలేకపోయారు. కానీ సూర్య వంశీ తనకు మాత్రమే సాధ్యమైన బ్యాటింగ్ తో ఆకట్టుకుంటున్నాడు. అంతేకాదు 500 పరుగుల మైలు రాయి అందుకొని సరికొత్త చరిత్ర సృష్టించాడు.
ఇటీవల హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో సూర్య వంశీ 97 పరుగులు చేశాడు. మూడు పరుగుల తేడాతో సెంచరీ కోల్పోయాడు. ఒకవేళ అతడు గనక సెంచరీ చేస్తే ఐపీఎల్ చరిత్రలో రెండు సెంచరీలు చేసిన ఆన్ క్యాప్డ్ ఆటగాడిగా రికార్డు సృష్టించేవాడు.
