Homeక్రీడలుక్రికెట్‌Vaibhav Suryavanshi: సున్నా పరుగులకు ఔట్ చేసి ఈగో మీద దెబ్బ కొట్టారు.. సెంచరీతో సూర్యవంశీ...

Vaibhav Suryavanshi: సున్నా పరుగులకు ఔట్ చేసి ఈగో మీద దెబ్బ కొట్టారు.. సెంచరీతో సూర్యవంశీ రివెంజ్ తీర్చుకున్నాడు..

Vaibhav Suryavanshi: ఐపీఎల్ లో 15 సంవత్సరాల బుడ్డోడు మరో రికార్డు బద్దలు కొట్టాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు తరుపున ఇప్పటికే సంచలన ఆట తీరుతో ఆకట్టుకుంటున్న వైభవ్ సూర్య వంశీ.. శనివారం హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో సెంచరీ చేసి అదరగొట్టాడు. 36 బంతులలో 12 సిక్సర్లు, ఐదు ఫోర్ల సహాయంతో సెంచరీ చేశాడు. ఇటీవల హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 0 పరుగులకు అవుట్ అయిన అతడు.. సొంత గడ్డమీద జరిగిన మ్యాచ్లో ప్రతీకారం తీర్చుకున్నాడు.. ప్రొఫైల్ బౌలింగ్ లో ఏకంగా నాలుగు సిక్సర్లు కొట్టిన అతడు.. ఆ తర్వాత తన జోరును ఏమాత్రం తగ్గించలేదు.

తొలి వికెట్ కు యశస్వి జైస్వాల్ తో తొలి వికెట్ కు 40, జూరె ల్ తో కలిసి రెండో వికెట్ కు 112 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు వైభవ్. దీంతో రాజస్థాన్ జట్టు పటిష్టమైన స్థితికి చేరుకుంది. హైదరాబాద్ జట్టు బౌలర్లలో ఎవరిని కూడా వదిలిపెట్టలేదు సూర్య వంశీ . కమిన్స్ నుంచి మొదలుపెడితే ప్రఫుల్ వరకు అందరి బౌలింగ్లో దుమ్ము దుమారం స్థాయిలో బ్యాటింగ్ చేశాడు.. ఫోర్లు, సిక్సర్లతో వీర విహారం చేశాడు.

ఆరెంజ్ క్యాప్ హోల్డర్

ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో సూర్యవంశీ తొలిసారిగా అరెంజ్ క్యాప్ హోల్డర్ గా ఆవిర్భవించాడు. ఆ తర్వాత రెండు మ్యాచ్లలో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో సెంచరీ చేయడంతో సూర్య వంశీ ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా మరోసారి ఆవిర్భవించాడు. విరాట్ కోహ్లీ (328) ని అధిగమించాడు. ప్రస్తుతం సూర్య వంశీ (357) పరుగులు చేసి.. ఆరెంజ్ క్యాప్ విభాగంలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. సగటు 44.62, 238.87 స్ట్రైక్ రేట్ తో ఈ పరుగులు చేశాడు.. వైభవ్ ఖాతాలో 31 ఫోర్లు, 32 సిక్సర్లు ఉన్నాయి.

సున్నా పరుగులకు ఇటీవల హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో సూర్య వంశీ ఔట్ అయ్యాడు. దీంతో అతడి ఈగో దెబ్బ తిన్నది. అయితే ఈసారి అటువంటి పొరపాటుకు అతడు తావు ఇవ్వలేదు. ఈసారి సమర్థవంతంగా బ్యాటింగ్ చేశాడు. ఏ బౌలర్ కు అవకాశం ఇవ్వలేదు. ప్రారంభం నుంచి.. సెంచరీ అయ్యే వరకు అదే స్థాయిలో బ్యాటింగ్ చేశాడు. అతని బ్యాటింగ్ దూకుడు ముందు హైదరాబాద్ బౌలర్లు తేలిపోయారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version