Peddi Chennai Pre Release Event: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) హీరోగా నటిస్తున్న ‘పెద్ది'(Peddi Movie) చిత్రం షూటింగ్ మరో ఆరు రోజుల్లో పూర్తి కానుంది. రేపటి నుండి రామ్ చరణ్ , శృతి హాసన్ లపై ఒక ఐటెం సాంగ్ ని చిత్రీకరించబోతున్నారు మేకర్స్. దీంతో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి అవుతుందని అంటున్నారు. మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జెట్ స్పీడ్ లో సాగుతుంది. క్వాలిటీ కోసం ఏ మాత్రం తగ్గని డైరెక్టర్ బుచ్చి బాబు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మరింత అద్భుతంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఈ నెల 30 న విడుదల అవ్వాల్సిన సినిమాని , జూన్ కి వాయిదా వేశారు. అందుతున్న సమాచారం ఏమిటంటే , ఈ చిత్రాన్ని మేకర్స్ జూన్ 25 కి విడుదల చెయ్యాలని ఫిక్స్ అయ్యినట్టు తెలుస్తోంది. షూటింగ్ పూర్తి అవ్వగానే విడుదల తేదీని అధికారికంగా ప్రకటించబోతున్నారు అట.
ఇదంతా పక్కన పెడితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొత్తం మే రెండవ వారానికి పూర్తి చేసేలా ప్లాన్ చేశారట మేకర్స్. ఇప్పటికే ఫస్ట్ హాఫ్ కి సంబంధించిన వర్క్ రీ రికార్డింగ్ తో సహా పూర్తి అయ్యింది. ప్రస్తుతం ఆ చిత్ర సంగీత దర్శకుడు AR రెహమాన్ సెకండ్ హాఫ్ కి సంబంధించిన రీ రికార్డింగ్ వర్క్ చేస్తున్నాడు. ఇది కూడా మే2 వ వారానికి పూర్తి అయ్యేలా చూస్తున్నారట. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ చిత్రానికి సంబంధించిన ప్రొమోషన్స్ ని మే చివరి నుండి మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నారట . సమయం బాగా దొరకడంతో ప్రొమోషన్స్ ని పాన్ ఇండియా లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ప్రతీ రాష్ట్రం లోనూ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ , ఇంటర్వ్యూస్ ఇవ్వబోతున్నారట. తమిళనాడు లో కూడా ఒక భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేసే పనిలో ఉన్నారట.
ఈ ఈవెంట్ కి సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొనే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇదే కనుక జరిగితే తమిళనాడు లో ఈ చిత్రానికి సెన్సేషనల్ ఓపెనింగ్ వసూళ్లు రావడం ఖాయం అని చెప్పొచ్చు. అదే విధంగా హిందీ లో కూడా మరో భారీ ఈవెంట్ ని ఏర్పాటు చేయబోతున్నారని , ఈ ఈవెంట్ కి సల్మాన్ ఖాన్ , లేదా షారుఖ్ ఖాన్ ని అతిథి గా పిలిచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ కూడా రామ్ చరణ్ కి ఎంతో సన్నిహితులు. సల్మాన్ ఖాన్ అయితే రామ్ చరణ్ ని తన సొంత తమ్ముడి లాగా ట్రీట్ చేస్తాడు. మరోపక్క షారుఖ్ ఖాన్ తో కూడా అదే తరహా రిలేషన్ రామ్ చరణ్ కి ఉంది. కాబట్టి బాలీవుడ్ లో కూడా ప్రొమోషన్స్ ఇరగకుమ్మే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్.