Vaibhav Suryavanshi Emotional: తన తోటి ఓపెనర్ ఒక్క పరుగుకే అవుట్ అయ్యాడు. కీలకమైన వన్ డౌన్ ఆటగాడు కొద్ది పరుగులు మాత్రమే చేసి వెనక్కి వెళ్లిపోయాడు. కెప్టెన్ చేతులెత్తేశాడు. మిగతా ప్లేయర్లు కూడా అంతగా ఆకట్టుకోలేదు. ఓపెనర్ గా వచ్చిన అతడు దాదాపు చివరి వరకు ఉన్నాడు. ఏకంగా 96 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించాడు. తాను సెంచరీ కోల్పోయినప్పటికీ.. తిరుగులేని తెగువ చూపించాడు.
ఈ ఉపోద్ఘాతం మొత్తం వైభవ్ సూర్య వంశి గురించి. రాజస్థాన్ ఆటగాడిగా అతడు ఈ ఐపిఎల్ సీజన్లో తిరుగులేని రికార్డులను సృష్టించాడు. ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా కొనసాగుతున్నాడు. సెంచరీ, హాఫ్ సెంచరీలు చేసి తనకంటూ ఒక స్థాయిని ఏర్పాటు చేసుకున్నాడు. చివరికి గుజరాత్ గట్టుతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో అదరగొట్టాడు. జట్టు కోసం చివరి వరకు గట్టిగా నిలబడ్డాడు. అయితే మిగతా ప్లేయర్ల నుంచి అతడికి అంతగా సపోర్ట్ లభించలేదు. అయినప్పటికీ ఒంటరి పోరాటం చేశాడు. గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
భారీగా పరుగులు చేసినప్పటికీ గుజరాత్ జట్టు చేతిలో రాజస్థాన్ ఓడిపోవడంతో వైభవ్ సూర్య వంశీ లో దుఃఖం కట్టలు తెంచుకుంది. అతడు తన ఆవేదన తట్టుకోలేక.. జట్టు ఓడిపోవడంతో మైదానంలో కూర్చుండిపోయాడు.. బౌండరీ లైన్ వద్ద కూర్చుని ఏడవడం మొదలుపెట్టాడు. తన జట్టుకు ఐపీఎల్ ట్రోఫీ అందించేందుకు సూర్య వంశీ ప్రాణం పెట్టి ఆడాడు.
గుజరాత్ జట్టుతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో చివరి వరకు నిలబడ్డాడు. తోటి ప్లేయర్లు అవుట్ అవుతున్నప్పటికీ.. సహనంతో బ్యాటింగ్ చేశాడు. ఎంత ఓపికతో పరుగులు సాధించాడు. గుజరాత్ మందు రాజస్థాన్ 200కు పైగా టార్గెట్ విధించింది అంటే దానికి ప్రధాన కారణం సూర్య వంశీ. కానీ ఫైనల్ చేరుకునే క్రమంలో ఒక్క అడుగు దూరంలో రాజస్థాన్ జట్టు ఓడిపోయింది.
రాజస్థాన్ జట్టు ఓటమిని అతడు తట్టుకోలేకపోయాడు. మ్యాచ్ ఓడిపోయిన తర్వాత కన్నీళ్లు పెట్టుకున్నాడు. కేవలం 15 సంవత్సరాల వయసులోనే అతడికి ఆట మీద.. జట్టు మీద ఈ స్థాయిలో డెడికేషన్ ఉండడం పట్ల క్రికెట్ విశ్లేషకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటువంటి ఆటగాడు ఈ తరంలో ఉండడం గొప్ప విషయమని వ్యాఖ్యానిస్తున్నారు.
Heartbreaking scenes
Vaibhav Suryavanshi was seen crying badly after the loss despite playing a fighting knock. The young star gave everything for his team, but it just wasn’t enough in the end pic.twitter.com/Za4r9rmDkW
— Shivangi Choudhary (@TweetShivangiii) May 29, 2026
