CSK Vs Mi IPL 2025: చెన్నై జట్టు ఐపీఎల్లో ఐదుసార్లు విజేతగా నిలిచింది. గత సీజన్లో అంతంత మాత్రంగానే చెన్నై ఆడింది.. ఈ సీజన్ లోనూ అంతగా ఆకట్టుకోలేకపోతోంది.. ఈ నేపథ్యంలో చెన్నై జట్టు ఈ సీజన్లో ఇప్పటివరకు ఏడు మ్యాచ్లు ఆడింది.. ఇందులో రెండు విజయాలు మాత్రమే సాధించింది. పాయింట్ల పట్టికలో చెన్నై చివరి స్థానంలో ఉంది. ముంబై ఇండియన్స్ జట్టుతో ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడిన చెన్నై.. విజయం సాధించింది.. ఈ సీజన్లో మరో కీలక మ్యాచ్ ను చెన్నై ముంబై తో ఆడుతోంది.. చెన్నై జట్టు ఈ మ్యాచ్ లో కనుక విజయం సాధిస్తే ప్లే ఆఫ్ వెళ్లడానికి అవకాశాలను మెరుగుపరుచుకుంటుంది. లేకపోతే గ్రూప్ దశలోనే నిష్క్రమించాల్సి ఉంటుంది. ఇక ముంబై జట్టు కూడా ఏడు మ్యాచ్లు ఆడి.. మూడు విజయాలు సాధించి ఏడవ స్థానంలో ఉంది. చెన్నైకి మాత్రమే కాదు ముంబై జట్టుకు కూడా ఈ మ్యాచ్ అత్యంత కీలకం. రెండు జట్లు సమఉజ్జీలుగా ఉండడంతో పోరు హోరాహోరిగా సాగే అవకాశం కనిపిస్తోంది.
Also Read: బంగారపు హుండీ.. చిల్లరకు పనికొస్తోంది.. రాజస్థాన్ కు ఇదేం దరిద్రం రా అయ్యా
గత రికార్డులు ఎలా ఉన్నాయంటే..
2008 నుంచి 2014 ఐపీఎల్ వరకు చెన్నై, ముంబై జట్లు 18 సార్లు తలపడ్డాయి. ఇందులో చెన్నై 9సార్లు, ముంబై 9సార్లు విజయాలు సాధించాయి. 2015 నుంచి 2020 వరకు ముంబై, చెన్నై 12సార్లు తలపడ్డాయి. ఇందులో చెన్నై 3 సార్లు, ముంబై 9 సార్లు విజయాలు సాధించాయి. 2021 నుంచి ఇప్పటివరకు ముంబై, చెన్నై 8 సార్లు తలపడ్డాయి. ఇందులో చెన్నై ఆరుసార్లు, ముంబై రెండుసార్లు గెలిచాయి. చెన్నై జట్టుకు ధోని నాయకత్వం వహిస్తున్నాడు. ముంబై జట్టుకు హార్దిక్ పాండ్యా సారథిగా ఉన్నాడు. మొత్తంగా చూస్తే రెండు జట్ల మధ్య హోరాహోరీగా పోరు సాగే అవకాశం కనిపిస్తోంది.
చెన్నై జట్టు ను బ్యాటింగ్ లోపం ప్రధానంగా వేధిస్తోంది. ఇక బౌలింగ్ లో కూడా ఆ జట్టు అంతగా రాణించలేకపోతోంది. ఫీల్డింగ్ కూడా అంతంతమాత్రంగానే ఉంది. ధోని మినహాయిస్తే ఆ స్థాయిలో హిట్టర్లు లేకపోవడం జట్టును వేధిస్తోంది. ఇక ముంబైలో బ్యాటింగ్ పరంగా పెద్దగా ఇబ్బంది లేదు. బౌలింగ్ లో బుమ్రా, విల్ జాక్స్, దీపక్ చాహర్ అదరగొడుతున్నారు. ఇక బ్యాటింగ్ లో రికెల్టన్, విల్ జాక్స్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా దుమ్ము రేపుతున్నారు. హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ ఫామ్ లోకి వచ్చాడు. దూకుడు అయిన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. భారీగా పరుగులు చేసే క్రమంలో అతడు అవుట్ అయ్యాడు. ముంబై జట్టును చెన్నై నిలువరించాలంటే.. ముందుగా కీలకమైన ఆటగాళ్లను అవుట్ చేయాలి. అప్పుడే చెన్నై జట్టుకు మ్యాచ్ గెలవడం ఈజీ అవుతుంది. లేకపోతే ఇక అంతే సంగతులు.
Also Read: ఓటముల్లో రాజస్థాన్.. గెలుపుల్లో లక్నో.. ఐపీఎల్ లో ఇదో సంచలనం