Vaibhav Suryavanshi: ఇప్పుడు వాళ్లంతా సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే సూర్యవంశీ ఆ స్థాయిలో ఆడుతున్నాడు మరి. దీటుగా బ్యాటింగ్ చేస్తూ.. దాటిగా పరుగులు రాబడుతూ.. టీమిండియా కు భవిష్యత్తు ఆశా కిరణం లాగా వెలుగొందుతున్నాడు. స్ఫూర్తిదాయకమైన ఇన్నింగ్స్ ఆడుతూ అదరగొడుతున్నాడు. ప్రస్తుతం అండర్ 19 ఆసియా కప్ లో భారత జట్టు ఫైనల్ పోరుకు క్వాలిఫై అయింది అంటే దానికి ప్రధాన కారణం సూర్యవంశి. చార్జమైదానంలో శుక్రవారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో శ్రీలంకపై సూర్యవంశీ వీర విహారం చేశాడు. ఎలాంటి బౌలర్ అయినా భయపడకుండా వీరోచితంగా బ్యాటింగ్ చేశాడు. ఫలితంగా భారత్ ఏడు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.. ఈ మ్యాచ్లో శ్రీలంక జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి 46.2 ఓవర్లలో 173 రన్స్ మాత్రమే చేసింది. లక్ విన్ 69, షణ్ముగనాథన్ 42 పరుగులతో ఆకట్టుకున్నారు. వీరిద్దరు మాత్రమే భారత బౌలర్లను కాస్త అడ్డుకున్నారు. మిగతా వాళ్లంతా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. భారత బౌలర్లలో చేతన్ శర్మ మూడు వికెట్లతో మాయాజాలాన్ని ప్రదర్శించాడు. కిరణ్, ఆయుష్ చెరి 2 వికెట్లు పడగొట్టి లంక పతనాన్ని శాసించారు.. అయితే ఈ లక్ష్యాన్ని భారత్ ఏ మాత్రం కష్టపడకుండా చేదించింది. 21.4 ఓవర్లలోనే 175 టార్గెట్ ను ఉఫ్ మని ఊదేసింది. దర్జాగా ఫైనల్ వెళ్ళింది.
విధ్వంసాన్ని రుచి చూపించాడు
వైభవ్ సూర్య వంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. శ్రీలంక బౌలర్లకు నిద్రలేని రాత్రిని పరిచయం చేశాడు. ఒకటి కాదు రెండు కాదు ఆరు బౌండరీలు కొట్టాడు. వాటికి పోటీగా సిక్సర్లు దంచాడు. బౌలర్ ఎవరనేది చూడలేదు. విధ్వంసాన్ని సరికొత్తగా ప్రదర్శించాడు. అతడి బ్యాటింగ్ దెబ్బకు షార్జా మైదానం బౌండరీ లైన్ చిన్న పోయింది.. మరో ఓపెనర్ ఆయుష్ (34) తో కలిసి చేయాల్సిన నష్టాన్ని సూర్య వంశీ చేసేశాడు. కేవలం 36 బంతులు మాత్రమే ఎదుర్కొన్న అతడు 67 పరుగులు చేసి అదరగొట్టాడు. ఆయుష్ – వైభవ్ అయినప్పటికీ అండర్ 19 కెప్టెన్ మహమ్మద్ అమాన్ 25* కార్తికేయ 11* పరుగులు చేసి ఆకట్టుకున్నారు. వీరిద్దరూ తదుపరి లాంచనాన్ని పూర్తి చేశారు.” వైభవ్ అదరగొడుతున్నాడు. తన పేరులో ఉన్న సూర్య వంశీ అనే పదానికి న్యాయం చేస్తున్నాడు. అతని దూకుడు చూస్తుంటే టీమిండియా అండర్ 19 కప్ గెలిచే లాగా ఉంది. అతని ప్రదర్శన అద్భుతం. అనన్య సామాన్యం. రాజస్థాన్ జట్టుకు పూర్తిస్థాయిలో వర్త్ లభించింది. అతడు అండర్ 19 లో మాత్రమే కాదు, ఐపీఎల్ లోనూ అదరగొడతాడు. అందులో అనుమానమే అక్కరలేదని” క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.