USA Players Pani Puri: అది దేశ ఆర్థిక రాజధాని ముంబై. అక్కడ బిజీబిజీగా ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్డు పక్కన పానీ పూరి బండి ఉంది. రెండు వాహనాలలో దాదాపు పది మంది వచ్చారు. వారంతా కూడా యూఎస్ఏ స్పోర్ట్స్ జెర్సీ వేసుకున్నారు. పిచ్చపాటిగా మాట్లాడుకుంటూ పానీ పూరి తిన్నారు. అది కూడా.. లెక్క పెట్టలేని స్థాయిలో ఆరగించారు.
యూఎస్ఏ స్పోర్ట్స్ జెర్సీలో కనిపించిన ఆటగాళ్లు మనదేశంలో t20 వరల్డ్ కప్ ఆడేందుకు వచ్చారు. ఎటువంటి భద్రత లేకుండానే ముంబై వీధులలో స్వేచ్ఛగా తిరిగారు. నచ్చిన ఆహారాన్ని తిన్నారు. ఇష్టమైన దుస్తులను కొనుగోలు చేశారు. అంతేకాదు స్థానికులతో ముచ్చటించారు. స్ట్రీట్ ఫుడ్ ఆరగించారు. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం కలిగిస్తున్నాయి.
ఈ వీడియోలపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు..” చూశారా ఇది మా దేశం గొప్పతనం. భద్రత గురించి భయం లేదు. ఏదైనా జరుగుతుందనే ఆందోళన కూడా లేదు. ఆటగాళ్లకు కఠినమైన నిబంధనలు లేవు. స్వేచ్ఛగా విహరిస్తున్నారు. నచ్చినట్టు తింటున్నారు. ఇష్టం వచ్చినట్టు వీధులలో తిరుగుతున్నారు. తద్వారా తమ టూర్ ను ఆస్వాదిస్తున్నారు. ఇటువంటి దృశ్యాలు పాకిస్తాన్లో కనిపిస్తాయా? బంగ్లాదేశ్లో దర్శనమిస్తాయా” అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
టి20 వరల్డ్ కప్ లో ఆడేందుకు బంగ్లాదేశ్ రాలేదు.. పిచ్చిపిచ్చి కారణాలు చూపించి ఈ టోర్నీ నుంచి బంగ్లాదేశ్ నిష్క్రమించింది. పాకిస్తాన్ అయితే భారత జట్టుతో జరిగే మ్యాచ్ నుంచి తప్పుకుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో మనదేశంలో ఉన్న క్రికెట్ స్టేడియాలు.. ఇతర దేశాల ఆటగాళ్ల నడవడిక గురించి వీడియోలు సర్కులేట్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా తీవ్రమైన చర్చకు దారి తీస్తున్నాయి. ఇదే అదునుగా టీమ్ ఇండియా అభిమానులు బంగ్లాదేశ్, పాకిస్తాన్ ప్లేయర్లు తలదించుకునేలా కామెంట్లు చేస్తున్నారు.
” మాది శాంతి దేశం. స్వేచ్ఛ కలిగి ఉన్న దేశం. ఇటువంటి దేశంలో విద్వేషాలకు తావు లేదు. ఇతర ఆరోపణలకు ఆస్కారం లేదు. ఎవరైనా సరే మా దేశంలో ఇలానే స్వేచ్ఛగా తిరుగుతుంటారు. స్వాతంత్రాన్ని అనుభవిస్తుంటారు. ఇప్పటికైనా ఈ విషయాన్ని బంగ్లాదేశ్, పాకిస్తాన్ ప్లేయర్లు గుర్తించాలి. ముఖ్యంగా ఆదేశక్ క్రికెట్ బోర్డులు గమనించాలని” నెటిజన్లు హితవు పలుకుతున్నారు.
While Pakistan and Bangladesh are crying about security arrangements
USA cricketers enjoying pani puri (golgappa) in Mumbai on stall without any security issues
— JB (@93Yorker) February 3, 2026