Homeక్రీడలుక్రికెట్‌Uppal stadium Lemon Incident: ఉప్పల్ లోకి అందుకే నిమ్మకాయ తీసుకెళ్లాడట.. బయటపెట్టిన వైరల్ ’మంత్రగాడు’

Uppal stadium Lemon Incident: ఉప్పల్ లోకి అందుకే నిమ్మకాయ తీసుకెళ్లాడట.. బయటపెట్టిన వైరల్ ’మంత్రగాడు’

Uppal stadium Lemon Incident: ఇటీవల హైదరాబాద్, చెన్నై జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరిగింది. ఉప్పల్ వేదిక ఈ మ్యాచ్ నిర్వహించారు. మ్యాచ్లో హైదరాబాద్ ఉత్కంఠ మధ్య విజయం సాధించింది. ఒక మోస్తరు స్కోరు నమోదైన ఈ మ్యాచ్లో.. చెన్నై జట్టు లక్ష్యం దిశగా సాగింది. చివర్లో హైదరాబాద్ బౌలర్లు సత్తా చూపించడంతో చెన్నై ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ ఆటగాళ్లు అభిషేక్ శర్మ, క్లాసెన్ హాఫ్ సెంచరీలు సాధించారు. తద్వారా హైదరాబాద్ అభిమానుల గుండెల్లో తమ స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నారు. అయితే వారికి మించిన పేరు తెచ్చుకున్నాడు ఓ హైదరాబాద్ అభిమాని.

చెన్నై జట్టు ఇన్నింగ్స్ సాగుతున్న సమయంలో హైదరాబాద్ అభిమాని ఒకరు స్టేడియంలో నిమ్మకాయతో ఒక రకమైన పూజలు చేశారు. అతడు ఆ పూజలు చేయడంతో చెన్నై ఆటగాడు శివం దుబే ఔట్ అయ్యాడు. దీంతో ఆ పూజలు చేసిన వ్యక్తి ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయాడు. అతడు నిమ్మకాయతో పూజలు చేయడం వల్లే శివం దుబే అవుట్ అయ్యాడని.. హైదరాబాద్ జట్టు గెలిచిందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అంతేకాదు చెన్నై యాజమాన్యం దీనిపై బీసీసీఐకి ఫిర్యాదు కూడా చేసిందని వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ ఫేక్ అని తేలిపోయింది. ఈ విషయంలో చెన్నై యాజమాన్యం బీసీసీఐకి
ఎటువంటి లేఖ రాయలేదని క్లారిటీ ఇచ్చింది.

నిమ్మకాయతో పూజలు చేసిన వ్యక్తి ఇప్పుడు ఒక సెలబ్రిటీగా మారిపోయాడు. అతడిని చానల్స్ ఇంటర్వ్యూ చేయడం మొదలు పెట్టాయి. ఈ నేపథ్యంలో అతడు జరిగిన విషయాన్ని చెప్పాడు. ఆ వ్యక్తికి ప్రయాణం చేస్తే వాంతులు అవుతాయి. అందువల్లే తన వెంట నిమ్మకాయ పెట్టుకుంటాడు. ఏదైనా వాంతి లాంటి ఇబ్బంది కలిగితే నిమ్మకాయ నోట్లో పెట్టుకుంటాడు. హైదరాబాద్ జట్టుతో జరిగే మ్యాచ్లో కూడా అతడు క్యాబ్లో ఉప్పల్ స్టేడియం దాకా వచ్చాడు. పోలీసు అధికారులను బతిమిలాడుకొని నిమ్మకాయ పట్టుకొని లోపలికి వచ్చాడు. అప్పటికే అతడు మూడుసార్లు నిమ్మకాయతో పూజలు చేశాడు. కాకపోతే అది వర్కౌట్ కాలేదు. చివరికి నాలుగోసారి నిమ్మకాయతో అతడు ఏదో పూజలు చేసినట్టు ప్రయత్నించగానే.. దుబే అవుట్ అయ్యాడు. ఈ దృశ్యాలను మొత్తం ఆ వ్యక్తి స్నేహితుడు వీడియో తీసి.. సోషల్ మీడియాలో పెట్టాడు.

ఈ వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా కనిపిస్తుంది. ఇప్పటికే లక్షలతో వీక్షణలు సొంతం చేసుకుంది. దీంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయాడు. అంతేకాదు, ఒక నిమ్మకాయ అతడి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. సోషల్ మీడియాలో అతడికి లభిస్తున్న ఆదరణ ఒక రేంజ్ లో ఉంది.. సోషల్ మీడియాలో పేరు తెచ్చుకోవడానికి చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అందులో కొంతమంది మాత్రమే విజయవంతమవుతారు. ట్రెండ్ కు తగ్గట్టుగా చేసే పని ఏదైనా సరే సోషల్ మీడియాలో సంచలనం అవుతుంది. ఇప్పుడు ఇతడు చేసిన పని కూడా అలానే ఉంది.. ఏది ఏమైనా సరే ఒక చిన్న నిమ్మకాయతో ఇతడు మంత్రగాడయ్యాడు. చివరికి సోషల్ మీడియాలో హీరో అయ్యాడు.

 

View this post on Instagram

 

A post shared by Seva Jyothi Media (@jyothi_reddy_off)

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular