Under-19 World Cup India Vs Afghanistan: అండర్ 19 వరల్డ్ కప్ లో టీమిండియా ఫైనల్ వెళ్తుందా.. ట్రోఫీ ని అందుకుంటుందా.. ఇప్పుడు ఈ ప్రశ్నలే సగటు క్రికెట్ అభిమాని మదిలో మెదులుతున్నాయి. పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో గెలిచిన నేపథ్యంలో టీమిండియా సెమీఫైనల్ వెళ్ళిపోయింది.. మరో సెమి ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ గెలిచింది. తద్వారా ఇంగ్లాండ్ ఫైనల్ వెళ్లిపోయింది. ఇటీవల పాకిస్తాన్ జట్టుతో జరిగిన పోరులో టీమిండియా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో టీమిండియాకు సెమీ ఫైనల్ ఆఫ్ఘనిస్తాన్ ప్రత్యర్థి అయింది.
భారత జట్టు ప్లేయర్లతో పోల్చి చూస్తే ఆఫ్ఘనిస్తాన్ జట్టులో గొప్ప ఆటగాళ్లు లేరు. ఇప్పుడున్న ఫామ్ ప్రకారం చూసుకుంటే టీమిండియాలో భీకరమైన ప్లేయర్లు ఉన్నారు. వైభవ్ సూర్య వంశీ తిరుగులేని స్థాయిలో బ్యాటింగ్ చేస్తున్నాడు. భారత్ ప్రస్తుత అండర్ 19 వరల్డ్ కప్ లో వరుసగా ఐదు మ్యాచ్లు గెలిచింది. ఇక ఆఫ్గనిస్తాన్ ఆడిన ఐదు మ్యాచ్లలో ఒక దాంట్లో మాత్రమే ఓటమిపాలైంది.
భారత జట్టు ప్లేయర్లలో వైభవ్ సూర్య వంశీ అదరగొడితే టీమ్ ఇండియాకు తిరుగు ఉండదు. ఇప్పటివరకు అతడు ఈ టోర్నీలో 39.20 సగటుతో కేవలం 196 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆల్ రౌండర్ విహాన్ మల్హోత్ర అదరగొడుతున్నాడు. టోర్నీలో అతడు ఒక సెంచరీ కూడా చేశాడు. బంగ్లాదేశ్ జట్టుపై జరిగిన మ్యాచ్లో 14 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. హరారే మైదానంలో సెమీఫైనల్ జరుగుతున్న నేపథ్యంలో విహాన్ మల్హోత్రా ప్రదర్శన పై టీమిండియా భారీగా ఆశలు పెట్టుకుంది.
ఆఫ్ఘనిస్తాన్ లో పైసల్ భీకరమైన ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుత టోర్నీలో సెకండ్ హైయెస్ట్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు. 81.25 సేకటితో ఇప్పటివరకు అతడు 325 పరుగులు చేశాడు. ఐర్లాండ్ జట్టుపై 163 పరుగులు చేశాడు.
నూరిస్తానీ ఓమర్జాయ్ కూడా అద్భుతమైన లయతో బౌలింగ్ వేస్తున్నాడు. 11.58 సగటుతో 12 వికెట్లు పడగొట్టాడు. వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 16 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు సొంతం చేసుకున్నాడు. వీరిద్దరు గనుక సెమి ఫైనల్ మ్యాచ్లో సత్తా చూపిస్తే భారత జట్టుకు ఇబ్బందులు తప్పవు.
సెమి ఫైనల్ మ్యాచ్లో విహాన్ మల్హోత్ర, వైభవ్ సూర్య వంశీ ప్రదర్శన కీలకం కానుంది. ఓపెనర్గా బరిలోకి దిగే సూర్య వంశీ మెరుగైన ఇన్నింగ్స్ ఆడితే టీమిండియా కు తిరిగి ఉండదు. అతడు వేసే బలమైన పునాది మిగతా బ్యాటర్లకు ఉత్సాహం ఇస్తుంది. అందువల్ల టీమిండియా భారీ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరోవైపు సూర్యవంశీ ని కట్టడి చేయడానికి తమ వద్ద ప్రణాళికలు ఉన్నాయని ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ చెప్పాడు. ఈ ప్రకారం చూసుకుంటే హరారే మైదానంలో పోరు హోరాహోరీగా సాగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.