Under – 19 World Cup Final : అండర్ 19 ప్రపంచకప్ 2024లో ఆదివారం దక్షిణాఫ్రికాలో భారత్, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో టీమిండియా 79 పరుగుల తేడాతో ఓడిపోయింది. టాస్ గెలిచన ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసింది. 253 పరుగుల భారీ సో‍్కరు చేసింది. 254 పరుగల లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా పేలవ ప్రదర్శనతో 174 పరుగులకే ఆల్‌ఔట్ అయింది. ఇక ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మెగా టోర్నీ ఆడుతున్న ఇద్దరు తెంగాళ కుర్రాళ్లు అరవెల్లి అవనీశ్‌రావు, మురుగణ్ అభిషేక్ తెలుగులో మాట్లాడుకున్నారు. వికెట్ కీపర్ అయిన అవనీశ్‌రావు.. స్పిన్ ఆల్‌రౌండర్ అయిన అభిషేక్‌కు తెలుగులోనే కొన్ని సూచనలు చేశాడు.
సంభాషణ ఇలా..
‘సేమ్ బాల్ వేయ్‌రా.. బాగుంది. స్వీప్ కొట్టినా ఏం కాదు. రెండే షాట్స్ ఆడుతాడు. ఏం కాదు’ అని అవనీశ్‌రావు తెలుగులో అన్నాడు. ఈ సంభాషణ స్టంప్ మైక్‌లో రికార్డు అయింది. స్టార్ స్పోర్ట్స్ తెలుగు దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. ‘ఇద్దరు క్రికెటర్లు గ్రౌండ్‌లో తెలుగులో మాట్లాడుతుంటే వినడానికి హాయిగా ఉంటుంది కదూ..! మరి ఈరోజు U19 ఫైనల్స్‌లో అదే జరిగింది. మరి మీరు కూడా చూసేయండి’ అని ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. అచ్చ తెలంగాణ యాసలో మాట్లాడిన మాటలకు తెలుగు అభిమానులు ఫిదా అవుతున్నారు. అవనీశ్‌రావుది సిరిసిల్ల కాగా.. మురుగన్ అభిషేక్‌ది హైదరాబాద్. ఈ ఇద్దరూ ఈసారి అండర్ 19 ప్రపంచకప్ ఎంపికయ్యారు.
ఇద్దరు క్రికెటర్లు గ్రౌండ్ లో తెలుగులో మాట్లాడుతుంటే వినడానికి హాయిగా ఉంటుంది కదూ.!!
మరి ఈరోజు U19 ఫైనల్స్ లో అదే జరిగింది
మరి మీరు కూడా చూసేయండి.!!
చూడండి
ICC U19 World Cup Final#INDU19vAUSU19 లైవ్
మీ #StarSportsTelugu & Disney + Hotstar లో#U19WorldCupOnStar pic.twitter.com/UPX0xz7zCd— StarSportsTelugu (@StarSportsTel) February 11, 2024