U19 Cricket World Cup Semi Final 2026: అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ కీలక అంకానికి చేరుకుంది. సెమీఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియాతో తలపడిన ఇంగ్లాండ్ విజయం సాధించింది. ఫైనల్ వెళ్ళిపోయింది. పాకిస్తాన్ జట్టుపై గెలిచిన టీమ్ ఇండియా బుధవారం హరారే మైదానంలో ఆఫ్గనిస్తాన్ జట్టుతో ఆడునుంది..
ఆఫ్గనిస్తాన్ ఈ టోర్నీలో ఇప్పటివరకు నాలుగు విజయాలు సాధించింది. ఒక ఓటమిని అందుకుంది. మరోవైపు భారత్ వరుసగా ఐదు విజయాలు సాధించింది. గత రికార్డుల పరంగా చూసుకుంటే భారత్ ఫేవరెట్ గా కనిపిస్తున్నప్పటికీ.. సంచలనాల ఆఫ్ఘనిస్తాన్ భారత్ కు షాక్ ఇచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలేమని విశ్లేషకులు అంటున్నారు.
భారత జట్టు అండర్ 19 వరల్డ్ కప్ లో ఇప్పటివరకు ఐదుసార్లు విజేతగా నిలిచింది. 2000, 2008, 2012, 2018, 2022 సంవత్సరాలలో భారత్ విజేతగా నిలిచింది. నాలుగు సార్లు రన్నరప్ గా నిలిచింది. 2024 లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది.
యూత్ వన్డేలో ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై భారత సంపూర్ణ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. యూత్ వన్డే విభాగంలో భారత్, ఆఫ్ఘనిస్తాన్ 12సార్లు తలపడితే.. భారత్ 10 సార్లు విజయాలు సాధించింది. ఆఫ్ఘనిస్తాన్ రెండుసార్లు గెలిచింది. 2019లో ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన ద్వైపాక్షిక సిరీస్లో భారత్ రెండు సార్లు ఓటమిపాలైంది.
2024 లో దక్షిణాఫ్రికాలో జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్ లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ ను 88 పరుగులకు ఆల్ అవుట్ చేసింది. తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపును అందుకుంది.
అండర్ 19 లో వైభవ్ సూర్య వంశీ సెకండ్ హైయెస్ట్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు. బంగ్లాదేశ్ కు చెందిన అజీజుల్ హకీమ్ 35 ఇన్నింగ్స్ లలో 1261 పరుగులు చేశాడు. అతడు తర్వాతి స్థానంలో సూర్యవంశీ ఉన్నాడు. సూర్య వంశీ 23 ఇన్నింగ్స్ లలో 1169 పరుగులు చేశాడు. ఇతడి స్ట్రైక్ రేట్ 158.18. యూత్ వన్డే టోర్నీలో సూర్య వంశీ 500 పరుగులు చేశాడు.