IPL 2022 CSK: 5 సార్లు ఐపీఎల్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్.కే) ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ -2022 ఎడిషన్‌లో ఒక్క విజయం లేక వరుసగా నాలుగు మ్యాచ్ లు ఓడిపోయి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఎందుకంటే వారు తమ మొదటి నాలుగు గేమ్‌లలో ఓడిపోయారు. వారు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అట్టడుగున చివరి స్థానంలో ఉన్నారు. ఐపీఎల్ లోనే అత్యంత బలహీనంగా కనిపిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా నిన్న రాత్రి చెన్నైను ఓడించి షాకిచ్చింది. ఇంకా ఖాతా తెరవకపోవడం చెన్నై అభిమానులకు షాకింగ్ గా మారింది.ధోని కెప్టెన్సీ వదిలేశాక.. రవీంద్ర జడేజా కొత్త కెప్టెన్ గా నియామకమైన తర్వాత చెన్నైకి ఇలా కొత్త సారథ్యంలో వరస ఓటములు షాక్ కు గురిచేస్తున్నాయి. సీఎస్.కే టోర్నీలోనే అన్ని జట్ల కంటే తక్కువ నెట్ రన్ రేట్‌ను కలిగి ఉంది. మూడు గేమ్‌లలో వారి ప్రదర్శనను విశ్లేషిస్తూ మాజీ సీఎస్.కే స్టార్.. భారత దిగ్గజం హర్భజన్ సింగ్ లోపాలను ఎత్తి చూపాడు. రవీంద్ర జడేజా నేతృత్వంలోని జట్టుకు ఆందోళన కలిగించే రెండు ముఖ్య అంశాలను పేర్కొన్నాడు.

గాయంతో సీఎస్కేకు దూరమైన ఆల్ రౌండర్ దీపక్ చాహర్ లేకపోవడం సీఎస్.కేని కలవరపెడుతున్న ప్రధాన సమస్యల్లో ఒకటిగా తేల్చాడు.. చాహర్ కొత్త బంతితో సీఎస్.కే ఆయుధంగా ఉన్నాడు. ఐపీఎల్ గత మూడు సీజన్లలో 32 వికెట్లు తీసుకున్నాడు, ఇది ఐపీఎల్ లోని అందరి బౌలర్‌లోనూ అత్యధికంగా ఉంది. చాహర్ తప్పుకోవడంతో కొత్త బాల్ స్పెషలిస్ట్‌కు సరైన ప్రత్యామ్నాయం సీఎస్.కేకి లేదు. “వారికి ఒకటి కాదు, రెండు సమస్యలు ఉన్నాయి. మొదటి ఆరు ఓవర్లలో, బౌల్‌తో కొత్త బంతితో త్వరగా వికెట్లు ఇవ్వగల దీపక్ చాహర్ లాంటి వారు లేరు. పవర్‌ప్లే తర్వాత, 7 -15 ఓవర్ల మధ్య సీఎస్.కేకు వికెట్లు అందించగల స్పిన్నర్లు లేరు” అని హర్భజన్ సింగ్ చెన్నై ఓటమికి గల కారణాలను విశ్లేషించాడు.
సీఎస్కే ఐపీఎల్-2022లో అత్యంత చెత్త ప్రదర్శన కనబరిచిన బౌలింగ్ జట్టుగా ఉంది. మూడు గేమ్‌లలో కేవలం రెండు వికెట్లు తీయడంతోపాటు ఓవర్‌కు 9.44 పరుగుల చొప్పున ఆ టీం బౌలర్లు ఇచ్చారు. దాదాపు ప్రతి 4 బంతుల్లో ఒక బౌండరీని అందించడం చెన్నై ఓటమికి కారణంగా ఉంది..
ఇక ఐపీఎల్ లో గత సీజన్లలో దంచి కొట్టి చెన్నైని గెలిపించిన రుతురాజ్ గైక్వైడ్ ఫామ్ లో లేకపోవడం సీఎస్కేకి చాలా ఆందోళన కలిగించిందని హర్భజన్ అంచనావేశాడు. యువ ఓపెనర్ ఐపీఎల్ 2021లో ఆరెంజ్ క్యాప్ సాధించి అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ గా నిలిచాడు. గత సీజన్‌లో సీఎస్కే నాలుగో టైటిల్‌ను సాధించడానికి కీలకమైన బ్యాట్స్ మెన్ గా ఉన్నాడు. . అయితే, ఐపీఎల్ 2022లో అతను మూడు గేమ్‌ల్లో ఎదుర్కొన్న 12 బంతుల్లో కేవలం రెండు పరుగులు మాత్రమే చేశాడు. “రుతురాజ్ చాలా తొందరగా ఔట్ అవుతున్నాడు కాబట్టి బలమైన ఓపెనింగ్ భాగస్వామ్యాలు చెన్నైకి ఉండడం లేవు. కాబట్టి జట్టులో చాలా సమస్యలు ఉన్నాయి. అందుకే చెన్నై సూపర్ కింగ్స్ లాంటి జట్టు ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిందని హర్భజన్ అంచనావేశాడు. అయినప్పటికీ, చెన్నై పునరాగమనం చేసి, ఆ తర్వాత విజయాన్ని కొనసాగిస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ” అని హర్భజన్ అన్నాడు. .
[…] Also Read: IPL 2022 CSK: ఐపీఎల్ లో చెన్నై ఓటమికి ప్రధాన క… […]