Travis Head: టాస్ ఓడిపోయిన తర్వాత ఈ మైదానంపై 240 రన్స్ చేస్తేనే గెలుస్తామని హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్ వ్యాఖ్యానించాడు. చాలామంది అతని మాటలను అతిశయోక్తి అనుకున్నారు. కానీ దానిని నిజం చేసి చూపించాడు హైదరాబాద్ ఆటగాడు హెడ్. బెంగళూరు జట్టుతో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ ఆటగాడు హెడ్ విధ్వంసకరమైన బ్యాటింగ్ చేశాడు. 41 బంతుల్లో 9 ఫోర్లు, ఏడు సిక్సర్లు బాది 102 పరుగులు చేశాడు. దీంతో హైదరాబాద్ స్కోర్ రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. ఐపీఎల్ లో సరికొత్త స్కోరు నమోదు చేసింది.. 2024 మార్చి 27న ముంబై జట్టుపై సాధించిన 277 పరుగుల రికార్డు చెరిపేసింది. 20 రోజుల వ్యవధిలోనే 287 పరుగులతో సరికొత్త ఘనతను లిఖించింది. ముఖ్యంగా ఈ మ్యాచ్లో హెడ్ వీరోచిత బ్యాటింగ్ చేశాడు. బంతి మీద దీర్ఘకాలంగా పగ ఉన్నట్టు కసిగా బాదాడు. అతడు కొట్టిన కొట్టుడుకు కుదిరితే ఫోర్లు, లేకుంటే సిక్సర్లుగా అన్నట్టుగా బంతులు బౌండరీలు దాటాయి.
జీవం లేని మైదానం, సహకరించని ఔట్ ఫీల్డ్.. ఇన్ని అనుకూలతల మధ్య హెడ్ తుఫాన్ లాంటి ఇన్నింగ్స్ ఆడాడు. బ్యాట్ లో ఏమైనా స్ప్రింగులు పెట్టుకొచ్చాడా అన్నట్టుగా ఆడాడు. చిన్నస్వామి స్టేడియాన్ని పరుగుల వర్షంతో ముంచెత్తాడు. ఇప్పటివరకు ఈ 226 పరుగులే హైయెస్ట్ స్కోర్ గా ఉండేది. కానీ హెడ్ దెబ్బకు అది ఒకసారిగా తుడిచిపెట్టుకుపోయింది. హెడ్ సెంచరీ చేయడం, క్లాసెన్ 67 రన్స్ చేయడంతో హైదరాబాద్ 287 రన్స్ చేసింది. అనంతరం బెంగళూరు 262 పరుగులకు పరిమితమైంది. ఫలితంగా 25 రన్స్ తేడాతో హైదరాబాద్ విజయం సాధించింది. ఈ విజయం అనంతరం హైదరాబాద్ ఆటగాడు హెడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
“ఈ సెంచరీ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. మైదానం పూర్తిగా బ్యాటర్లకు సహకరించింది. ఇరుజట్ల బ్యాటర్లు కొట్టిన పరుగులతో ప్రేక్షకులు సందడి చేశారు. ఇది నాకు ఎప్పటికీ స్పెషల్ ఇన్నింగ్స్ లాగా గుర్తుండిపోతుంది. నా సెంచరీ ప్రేక్షకులకు అమితమైన ఆనందాన్ని ఇచ్చిందని భావిస్తున్నాను.. భారీగా హాజరైన హైదరాబాద్ ప్రేక్షకుల మద్దతుతోనే నేను ఈ విధ్వంసకరమైన బ్యాటింగ్ చేశాను. వచ్చే మ్యాచ్ లలోనూ హైదరాబాద్ ఇదే తీరుగా ప్రదర్శన కొనసాగించాలని భావిస్తున్నానని” హెడ్ సెల్ఫీ వీడియోలో వ్యాఖ్యానించాడు. దీనిని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తన అధికారిక సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసింది.
️ “The boys were exceptional!”
Let’s hear from our on a special, special night at the Chinnaswamy #PlayWithFire #RCBvSRH pic.twitter.com/98Vdqo10di
— SunRisers Hyderabad (@SunRisers) April 16, 2024