Team India: ఐసీసీలో టాప్ : వరల్డ్ కప్ లో ఓడిపోయినా.. ప్రపంచంలో టీమిండియాకు తిరుగులేదంతే…

నిజానికి ఇండియా ఈసారి కప్పు కొట్టి చూపిస్తుంది.ఇక 12 సంవత్సరాల తర్వాత మరోసారి ఇండియా గర్వంగా తన సత్తా ఏంటో ప్రపంచ దేశాలకు చూపిస్తుంది అనే ఒక ఆశ లో ఉన్న ప్రతి అభిమాని ఆశలకు ఆజ్యం పోస్తు మొదటి నుంచి అన్ని మ్యాచ్ లు గెలుస్తూ రావడంతో ప్రేక్షకుల అంచనాలు తారాస్థాయికి చేరిపోయాయి.

Written By: Gopi, Updated On : December 6, 2023 6:57 pm

Team India

Follow us on

Team India: ఇండియా 2023 వన్డే వరల్డ్ కప్ టైటిల్ కొడుతుందని ఇండియా లో ఉన్న అభిమానులు అందరూ కొన్ని వందల ఆశలను పెట్టుకున్నారు. ఇక ఇండియన్ టీమ్ మాత్రం వరుసగా 10 మ్యాచ్ ల్లో గెలిచినప్పటికీ ఫైనల్ మ్యాచ్ లో మాత్రం ఆస్ట్రేలియా మీద ఓడిపోయి ఇండియాలో ఉన్న ప్రతి క్రికెట్ అభిమానికి తీవ్రమైన నిరాశని మిగిల్చాయి.

నిజానికి ఇండియా ఈసారి కప్పు కొట్టి చూపిస్తుంది.ఇక 12 సంవత్సరాల తర్వాత మరోసారి ఇండియా గర్వంగా తన సత్తా ఏంటో ప్రపంచ దేశాలకు చూపిస్తుంది అనే ఒక ఆశ లో ఉన్న ప్రతి అభిమాని ఆశలకు ఆజ్యం పోస్తు మొదటి నుంచి అన్ని మ్యాచ్ లు గెలుస్తూ రావడంతో ప్రేక్షకుల అంచనాలు తారాస్థాయికి చేరిపోయాయి. కానీ ఇండియన్ టీమ్ మాత్రం ఫైనల్ కి చేరుకొని విజయం సాధిస్తుంది అనుకునే లోపే ఆస్ట్రేలియా మీద దారుణంగా ఓడిపోయింది. ఇక దాంతో ప్రతి ఒక్కరు దుఖః సాగరాల్లో మునిగిపోయారు.ఇక ఇండియన్ టీమ్ ఫైనల్ లో చేసిన చిన్న మిస్టేక్స్ వల్ల కప్ మనకు రాకుండా చివరి నిమిషం లో చేయి జారీ పోయింది. ఇక దాంతో చాలా మంది కి క్రికెట్ అంటే విరక్తి పుట్టి అప్పటి నుంచి చాలామంది అసలు మ్యాచ్ లను పట్టించుకోవడం లేదు ఇక రీసెంట్ గా ఆస్ట్రేలియాతో టి20 సిరీస్ జరిగినప్పటికీ దానిమీద ఎవరు పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు…

అయితే మరికొందరు మాత్రం మ్యాచ్ లను ఆదినప్పుడు అందులో గెలుపు, ఓటమి అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. అలాంటి దానికి మ్యాచ్ లను చూడకుండా వదిలేయడం అనేది కరెక్ట్ కాదు. గేమ్ లో గెలుపు ఓటమిలు అనేవి సహజం జరుగుతూనే ఉంటాయి. వాటన్నింటిని స్పోర్టివ్ గా తీసుకోవాలి అంటూ వాళ్ల యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక ఇది ఇలా ఉంటే మనం వరల్డ్ కప్ లో ఓడిపోయాం కానీ ఇప్పటికీ కూడా మనం మూడు ఫార్మాట్ల లలో నెంబర్ వన్ పొజిషన్ లోనే కొనసాగుతున్నాం. అలాగే మన ప్లేయర్లు కూడా మూడు ఫార్మాట్లలో నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతున్నారు. నిజానికి ఇండియా ఓడిపోయింది అన్నమాటే గానీ ప్రతి అభిమాని గుండెల్లో గెలిచి చూపించారు. ఇండియన్ ప్లేయర్ల ఆట తీరు కి ప్రపంచ క్రికెట్ అభిమానులు సైతం ఫిదా అయిపోయారు…ఒక్కసారి మన టీమ్ గాని, మన ప్లేయర్లు గాని ఏ ర్యాంకుల్లో ఉన్నారో మనం తెలుసుకుందాం…

ప్రస్తుతం ఇండియన్ టీమ్ వన్డేల్లో నెంబర్ వన్ స్థానం లో కొనసాగుతుంది.ఇక ఇండియా తర్వాత ఆస్ట్రేలియా సెంకండ్ పొజిషన్ లో ఉంది.అలాగే పాకిస్తాన్ థర్డ్ పొజిషన్ లో ఉండగా, సౌతాఫ్రికా ఫోర్త్ పొజిషన్ లో కొనసాగుతుంది…నిజానికి ఆస్ట్రేలియాకి వరల్డ్ కప్ వచ్చినప్పటికీ నెంబర్ 1 ర్యాంక్ లో మాత్రం మనల్ని బీట్ చేయలేకపోయింది.

ఇక ఇది ఇలా ఉంటే ఇండియన్ టీమ్ టెస్టుల్లో కూడా నెంబర్ 1 గా కొనసాగుతుంది.ఆ తర్వాత ప్లేస్ ల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా టీమ్ లు కొనసాగుతున్నాయి…

ఇక టి 20 ల్లో కూడా టీమిండియా మొదటి స్థానాన్ని దక్కించుకుంది. మన తరువాత వరుసగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా టీమ్ లు ఉన్నాయి…

ప్లేయర్ల ర్యాంకులను కనక చుసుకున్నటైతే
టీ20 ల్లో సూర్యకుమార్ యాదవ్ నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతున్నాడు. రీసెంట్ గా ఆస్ట్రేలియా మీద జరిగిన 5 మ్యాచ్ లా టి 20 సీరీస్ లో ఇండియన్ టీమ్ తరుపున అద్భుతమైన బ్యాటింగ్ చేయడమే కాకుండా మంచి కెప్టెన్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు…

ఇక బౌలర్లలో రవి బిష్ణోయ్ మొదటి స్థానం లో ఉన్నాడు…

వన్డే బ్యాట్స్ మెన్స్ లలో శుభ్ మన్ గిల్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇక వన్డే వరల్డ్ కప్ లో మంచి ప్రదర్శన కనబరిచాడు…

ఇక ఇది ఇలా ఉంటే టెస్టుల్లో నెంబర్ వన్ బౌలర్ గా మన ఆల్ టైం స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఉండగా, టెస్టుల్లో నెంబర్ వన్ ఆల్ రౌండర్ గా రవీంద్ర జడేజా ఉన్నాడు…

ఇలా అన్ని విభాగాల్లో మన ప్లేయర్లు సత్తా చాటుతూ ఇండియన్ టీమ్ పరువు నిలబెడుతున్నారు…