Cricketer Friendships : ప్రపంచ క్రికెట్ లో దేశాలు వేరైనా స్నేహం మాత్రం చెక్కుచెదరకుండా మెయింటేన్ చేస్తున్నారు క్రికెటర్లు.. ఐపీఎల్ వంటి ఫ్రాంచైజీ క్రికెట్ వల్ల అన్ని దేశాల వారు మిత్రులుగా మారి క్రికెట్ ఆడుతున్నారు.. దేశాలకు ఆడినా వారి స్నేహం మాత్రం అలానే ఉంది. అలాంటి క్రికెటర్లు కొందరున్నారు..
ప్రపంచంలోనే ఇద్దరు గ్రేట్ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారాలు ఎప్పుడూ కలుస్తూ తమ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు తాజాగా లండన్ లో కలిశారు..
ఇక వీరితర్వాత ఇద్దరు దిగ్గజ క్రికెటర్ల స్నేహం ఇప్పటికీ ఉంది. వారే ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ.. ఈ గురుశిష్యుల బంధం చెక్కు చెదరడం లేదు. ధోని అంటే కోహ్లీ ప్రాణమిస్తాడు.
ఇక విరాట్ కోహ్లీకి ధోని తర్వాత ఫేవరెట్ క్రికెటర్ యువరాజ్.. వీరి స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది.
ఇక టీమిండియా టాప్ ఫేవరేట్ ఓపెనింగ్ జోడి సచిన్-గంగూలీల మధ్య స్నేహం ఇప్పటికీ నిలిచి ఉంది.
ఐపీఎల్ లో బెంగళూరుకు ఆడిన విరాట్ కోహ్లీ-ఏబీ డివిలయర్స్ ప్రాణ స్నేహితులుగా ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నారు..
ఇక టీమిండియాకు ఆడే హార్ధిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ లు ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్.. దేశవాళీ నుంచే వీరిద్దరూ ఫ్రెండ్స్
ఇక ఆస్ట్రేలియా క్రికెటర్లు మార్కస్ స్టాయినీస్, ఆడం జంపా స్నేహితులే కాదు.. వీరిద్దరే ‘గే’ పార్ట్ నర్స్ అని వీరి రోమాన్స్ ను బట్టి అందరూ అనుకుంటారు..
టీమిండియాతోపాటు చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడిన ఎంఎస్ ధోని, సురేష్ రైనాలు ఎప్పటి నుంచో ప్రాణమిత్రులు.. ధోని గురించి అన్ని విషయాలు రైనాకు తెలుసు. ధోని భార్య కూడా రైనాకే ఫిర్యాదు చేస్తుంటుందట..
వీరే కాదు.. రోహిత్-యజ్వేంద్రచాహల్, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యాలు కూడా అత్యంత స్నేహంగా ఉండే క్రికెటర్లు